ఖరీదైన కొత్త కారు కొన్న నటుడు.. తల్లికి మొదటి గౌరవం.. సోషల్ మీడియాలో వైరల్! ఇంతకీ ఆ కారు ఏదంటే?

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో నోయెల్ సీన్ (Noel Sean) ఒకరు. రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించిన ఈయన, తన గంభీరమైన, శక్తివంతమైన గొంతుతోనే అందరిని ఆకట్టుకున్నాడు. ఆరంభంలోనే వినూత్నమైన రాప్ స్టైల్, వినసొంపైన మాటతీరు, హాస్యభరితమైన ప్రెజెంటేషన్‌ అన్ని కలిసి అతడిని ఎంటర్‌టైన్‌‌మెంట్ రంగంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. చాలా ఏళ్ల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి గాయకుడిగా, నటుడిగా అనేక ప్రాజెక్టుల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. మంత్ర సినిమాలో పాడిన రాప్ సాంగ్‌తో ఆయన పేరు ఇంటింటా మార్మోగింది. అప్పటి నుంచి అనేక సినిమాల్లో రాప్ పాటలు పాడుతూ, తనకంటూ ప్రత్యేకమైన మార్కును క్రియేట్ చేసుకున్నాడు. నటుడిగా కూడా కొన్ని గుర్తుండిపోయే పాత్రల్లో నటించి అభిమానులను అలరించాడు.

ప్రస్తుతం నోయెల్ సినీ రంగంలో అడపాదడపా సినిమాలు చేస్తూ, టెలివిజన్ షోల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే నోయెల్, తరచుగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంటాడు. అలాంటి సందర్భంలోనే ఆయన తాజాగా ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్‌ను అందించాడు. నోయెల్ ఇటీవలే ఒక ఖరీదైన కొత్త కారును కొనుగోలు చేశాడు.

Tollywood Actor Noel Sean Buys New Maindra Be6 Electrical Car

కానీ ఈ కొనుగోలును మరింత ప్రత్యేకంగా మార్చింది ఆయన తల్లిదండ్రుల పట్ల చూపిన గౌరవం. తన తల్లి చేతుల మీదుగా కారును స్వీకరించిన వీడియోను నోయెల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో కొత్త కారు ముందు నోయెల్ తల్లి పూజ చేసి, తరువాత తాళాలు అందజేస్తున్న దృశ్యం ఎంతో హృదయాన్ని తాకేలా ఉంది. అభిమానులు కూడా ఈ వీడియోను చూసి నోయెల్ వినయాన్ని ప్రశంసిస్తున్నారు.

ఇక నోయెల్ కొనుగోలు చేసిన ఈ కొత్త కారు సాధారణ కారు కాదు, మహీంద్రా కంపెనీకి చెందిన బీఈ6 (BE6) ఎలక్ట్రిక్ కారు. ఆధునిక డిజైన్, ఎకో-ఫ్రెండ్లీ టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో ఈ కారుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తన లైఫ్‌స్టైల్‌లో పాజిటివ్ మార్పులు చేస్తూ, పర్యావరణానికి మద్దతుగా ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంచుకోవడం ద్వారా నోయెల్ ఒక మంచి ఉదాహరణ చూపించాడు.

Tollywood Actor Noel Sean Buys New Maindra Be6 Electrical Car

నోయెల్ సీన్ కొనుగోలు చేసిన బీఈ6 ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్స్‌ షోరూమ్ రూ.18.90 లక్షల నుంచి ఉంటుంది. ఈ సమాచారం బయటకు రావడంతో పాటు, నోయెల్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన వీడియో అభిమానులను మాత్రమే కాదు, సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంది. వీడియోలో తల్లి చేతుల మీదుగా కొత్త కారును స్వీకరిస్తూ, ఆనందంతో మెరిసిపోతున్న నోయెల్‌ను చూసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కెరీర్‌లో తన ప్రతిభతో, వ్యక్తిగత జీవితంలో విలువలతో, ఇలాంటివి చేస్తూ అభిమానుల హృదయాల్లో మరింత దగ్గర అవుతున్నాడు నోయెల్ సీన్. మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ SUV గురించి చూసినట్లయితే, ఈ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది . 59kWh బ్యాటరీతో ప్యాక్, 79kWh బ్యాటరీతో లభిస్తుంది. చిన్న బ్యాటరీతో సుమారు 400 కిలోమీటర్ల వరకు, పెద్ద బ్యాటరీతో 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

Tollywood Actor Noel Sean Buys New Maindra Be6 Electrical Car

ఇది ప్రస్తుత ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లో వినియోగదారులకు నిజంగా ఆకర్షణీయమైన ఆఫర్. BE 6 SUVలో ఫీచర్ల విషయానికి వస్తే, ఇది లగ్జరీ కార్లకే సాటి. ఫుల్ గ్లాస్ రూఫ్, లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), రేస్-రెడీ డిజిటల్ కాక్‌పిట్, ప్రీమియం సేజ్ లెథరెట్ ఇంటీరియర్, అలాగే డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్న 16 స్పీకర్ హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణలు.

More from DriveSpark

Article Published On: Sunday, August 24, 2025, 9:35 [IST]
English summary
Tollywood actor noel sean buys new mahindra be6 electrical car details
Read more on: #celebrity cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+