మ్యాట్ ఫినిష్డ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో కనిపించిన ప్రకాష్ రాజ్

టాటా మోటార్స్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Jaguar Land Rover) అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender) చాలా ఏళ్ల తర్వాత తిరిగి భారతదేశంలోకి వచ్చింది. భారత్‌లో ఈ లగ్జరీ ఎస్‌యూవీ విడుదలైనప్పటి నుండి ఇది కొనుగోలుదారులలో మంచి ప్రాచుర్యాన్ని దక్కించుకుంది. ఖరీదైన కారు కావడంతో ఇది సెలబ్రిటీల ఫేవరేట్ కారుగా కూడా మారిపోయింది.

మ్యాట్ ఫినిష్డ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో కనిపించిన ప్రకాష్ రాజ్

స్టన్నింగ్ రోడ్ ప్రజెన్స్ మరియు కంఫర్టబల్ డ్రైవింగ్ అనుభూతిని అందించే ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీని బడా బిజినెస్‌మ్యాన్‌లు, రాజకీయ నాయకులు మరియు పలువురు సినీ ప్రముఖులు తమ గ్యారేజ్ లో చేర్చుకున్నారు. తాజాగా తెలుగు, హిందీ, తమిళ్ మరియు కన్నడ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మెయిన్ విలన్ గా, లీడ్ రోల్ యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు మరియు నిర్మాత అయిన ప్రకాష్ రాజ్ ఈ పాపులర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 మోడల్ ఎస్‌యూవీ స్వారీ చేస్తూ కనిపించారు.

మ్యాట్ ఫినిష్డ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో కనిపించిన ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ (Prakash Raj) తన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 కారులో ప్రయాణిస్తుండగా కెమెరాకు చిక్కారు, ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తుంటే, అతను ముంబైలోని ఓ రహదారిపై ప్రయాణిస్తున్నట్లుగా ఉంది. మా ఎన్నికల ఓటమి తర్వాత ప్రకాష్ రాజ్ తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైనట్లు వినికిడి. దీంతో ఇప్పుడు ఈ మోనార్క్ ముంబైలో మకాం వేసినట్లు తెలుస్తోంది.

మ్యాట్ ఫినిష్డ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో కనిపించిన ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ కి చెందిన ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుపై తెలంగాణా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఉంది. అంతేకాకుండా, ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ పూర్తి మాట్ బ్లాక్ షేడ్‌లో ఫినిష్ చేయబడి ఉంది. నిజానికి ల్యాండ్ రోవర్ సంస్థ తమ డిఫెండర్ 110 ఎస్‌యూవీ కోసం అధికారికంగా మ్యాట్ బ్లాక్ ఫినిష్ కలర్ ను ఆఫర్ చేయడం లేదు. బహుశా ఈ స్టార్ యాక్టర్ తన ఎస్‌యూవీని ఆఫ్టర్ మార్కెట్లో కస్టమ్ వ్రాప్ చేయించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కలర్ లో ఇది చాలా గంభీరమైన రోడ్ ప్రజెన్స్ ని కలిగి ఉంటుంది.

మ్యాట్ ఫినిష్డ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో కనిపించిన ప్రకాష్ రాజ్

ఈ వీడియోని గమనించినట్లయితే, డ్రైవ్ సమయంలో, ప్రకాష్ రాజ్ వాహనం యొక్క కో-డ్రైవర్ సీటులో కనిపిస్తారు. ఇది సరికొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కాదని చెబుతున్నారు. ప్రకాష్ రాజ్ గత సంవత్సరం ఈ కారును కొనుగోలు చేసి, ఆ వెంటనే దీనిని మాట్యా ఫిల్మ్ తో వ్రాప్ చేయించి ఉంటారని భావిస్తున్నారు. గమనించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశంలో కార్లను వ్రాప్ చేయడం (స్టిక్కర్ తో కారు మొత్తాన్ని చుట్టడం) చట్టవిరుద్ధం కాదు. అయితే, కారుకు అసలు రంగుకు భిన్నంగా మాత్రం వ్రాప్ చేయకూడదు.

అంటే, ఉదాహరణకు కారు బాడీ కలర్ రెడ్ అయితే, సదరు కారుకు చేసే వ్రాప్ కూడా రెడ్ కలర్ లోనే ఉండాలి. అలాకాకుండా, కారు మొత్తాన్ని బ్లాక్ కలర్ లో వ్రాప్ చేయించినట్లయితే, అది చట్టరీత్యా నేరంగా పరిగణించడం జరుగుతుంది. ఇక ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, భారతదేశంలో ఈ ఆల్ట్రా లగ్జరీ ఎస్‌యూవీ రెండు బాడీ స్టైల్స్‌లో విక్రయించబడుతోంది. వీటిలో ఒకటి 3-డోర్ వెర్షన్ (డిఫెండర్ 90), మరొకటి 5-డోర్ వెర్షన్ (డిఫెండర్ 110).

మ్యాట్ ఫినిష్డ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో కనిపించిన ప్రకాష్ రాజ్

భారతదేశంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 ప్రారంభ ధర రూ. 76.57 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటే, డిఫెండర్ 110 ధర కోటి రూపాయాల వరకూ ఉంటుంది. కంపెనీ ఈ SUVని 3 ఇంజన్ ఆప్షన్లతో పరిచయం చేసింది. వీటిలో మొదటిది 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది 296 బిహెచ్‌పి పవర్ ను మరియు 400 న్యూటన్ మీటర్ల టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ 296 బిహెచ్‌పి వవర్ ను మరియు 650 న్యూటన్ మీటర్ల టార్క్‌ ను జనరేట్ చేస్తుంది.

మ్యాట్ ఫినిష్డ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో కనిపించిన ప్రకాష్ రాజ్

ఇక మూడవ ఇంజన్ ఆప్షన్ గా 3.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 394 బిహెచ్‌పి పవర్ ను మరియు 550 న్యూటన్ మీటర్ల టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. డిజైన్ పరంగా చూస్తే, ముందు వైపు నుండి ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 మరియు ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 మోడళ్లు రెండూ ఒకేలా కనిపిస్తాయి. కాకపోతే, డిఫెండర్ 110 మోడల్ లో 5 డోర్ కారణంగా, దాని వీల్ బేస్ పెద్దదిగా ఉంటుంది.

మ్యాట్ ఫినిష్డ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీలో కనిపించిన ప్రకాష్ రాజ్

ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ కి చెందిన డిఫెండర్ మోడల్ 5-డోర్ వెర్షన్ గా ఉంది. అయితే, ఇందులో ఖచ్చితమైన వేరియంట్, అందులో చేసిన మోడిఫికేషన్స్ మరియు ధర వంటి విషయాల గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. తెలుగులో లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, March 24, 2022, 11:07 [IST]
English summary
Tollywood actor prakash raj spotted in land rover defender 110 suv in mumbai details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+