లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కొనుగోలుచేసిన మాస్ మహారాజ.. ఈ ఫ్యాన్సీ నంబరే ఎందుకు ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు మాస్ మహారాజ రవితేజ. తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న చిన్న పాత్రల నుంచి స్టార్ హీరోగా ఎదిగిన రవితేజకు కార్లంటే చాలా ఇష్టం. మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ‌్జరీ కార్లు మాస్ మహారాజా దగ్గర ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త ఎలక్ట్రిక్ వాహనం ఆయన గ్యారేజీలోకి చేరింది.
చైనాకు చెందిన BYD Atto 3 ఎలక్ట్రిక్ కారును రవితేజ కొనుగోలు చేశారు. ఈ కారులో ఐదుగురు ప్రయాణించవచ్చు. మరియు ఈ కారు ధర సుమారు 34 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు బేసిక్ ఎలక్ట్రిక్ మోడల్ 34 లక్షల రూపాయలు, ప్రత్యేక ఎడిషన్ 34.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ ఈవీ (Electric vehicle) ఫ్యాన్సీ నంబర్ సైతం ఆయన సొంతం చేసుకున్నారు.

ఫ్యాన్సీ నంబర్ కోసం రవాణా శాఖ అధికారులు ఈ వేలం నిర్వహిస్తారు. ఎవరైతే అటువంటి నంబర్లు కావాలని కోరుకుంటారో వాళ్లు ఆ వేలంగా పాల్గొనవచ్చు. ఆయా ఫ్యాన్సీ నంబర్లకు ఎవరైతే ఎక్కువ బిడ్డింగ్ వేస్తారో వారికి అధికారులు ఆయా నంబర్లను కేటాయిస్తారు. ఇదే విధంగా హీరో రవితేజ ఈ- వేలంలో పాల్గొని "2628" నంబర్‌ను సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి స్వయంగా మాస్ మహారాజ రవితేజ వచ్చి కారును రిజిస్టర్ చేసుకున్నారు.
సంఖ్యాశాస్త పరంగా 2628 నంబర్‌ను కలిపితే చివరగా 9 వస్తుంది. ఈ నంబర్ 9 ను అదృష్టసంఖ్యగా భావిస్తారు. ఈ సంఖ్య తమకు మేలు చేస్తుందని కొందరు భావిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసి ఎకో ఫ్రెండ్లీ వాహనాల ప్రాధాన్యతను తెలియజేస్తున్నారంటూ పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఈ ఎలక్ట్రిక్ కారు మోటార్ 201 Bhp పవర్ మరియు 310 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ కారు 60.48 kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 521 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అంతేకాకుండా కేవలం 7.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఈ కారు అందుకోగలదని సంస్థ తెలిపింది. ఈ కారులో BYD dPilot అని పిలిచే L2 అధునాతన డ్రైవింగ్ సహాయ వ్యవస్థను కూడా ఇచ్చారు.
ఈ సంవత్సరం మెగా-మాస్ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రంతో చిరంజీవి, రవితేజ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. తర్వాత వచ్చినా ధమాకాతోనూ రవితేజ తన హిట్ ట్రాక్ కొనసాగించారు. ఇటీవల రిలీజ్ అయిన రావణాసుర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నారు. దాంతోపాటు మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








