కొత్త సినిమా రిలీజ్‌కు ముందే BMW కి పోటీ ఇచ్చే కారు కొన్న టాలీవుడ్ లక్కీ హీరోయిన్!

సౌత్ ఇండియాలో, బాలీవుడ్‌లో ఒకేసారి మెరుస్తున్న హీరోయిన్ ఆకాంక్ష సింగ్ (Aakanksha Singh). పేరు కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ సినీ ప్రియులకు మాత్రం ఆమె ఎవరో గుర్తుపట్టేసి ఉంటారు. నాని (Nani), నాగార్జున (Nagarjuna) వంటి స్టార్ హీరోలతో నటించిన ఈమె త్వరలో షష్టిపూర్తి (Shasthipoorthi) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రూపేష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మే 30న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు తన జీవితంలో మరో కలను సాకారం చేసుకున్న ఆనందంలో ఉంది ఆకాంక్ష సింగ్. విషయం ఏంటంటే, ముంబైలో తన ప్రయాణాలకు తోడుగా సరికొత్త కారును కొనుగోలు చేసింది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) సరికొత్త ఎలక్ట్రిక్ SUV, XEV 9e EVని సొంతం చేసుకుంది.

Aakanksha Singh

ఆకాంక్ష సింగ్ కొత్త కారుతో నిలబడిన చిత్రాలను మహీంద్రా అండ్ మహీంద్రా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు షేర్ చేసింది. సెలబ్రిటీల మధ్య హిట్ అయిన ఈ ఎలక్ట్రిక్ SUV ప్రపంచవ్యాప్తంగా వాహన ప్రియుల దృష్టిని ఆకర్షించింది. టెస్లా సైబర్ ట్రక్ (Tesla Cybertruck) కు దీటుగా ఉండే లుక్, లగ్జరీ కార్లను కూడా సిగ్గుపడేలా చేసే ఫీచర్లతో నిండిన ఈ మోడల్ ఎలక్ట్రిక్ కూపే SUV డిజైన్‌ను కలిగి ఉంది.

మహీంద్రా XEV 9e EV ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.90 లక్షల నుండి రూ. 30.50 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ INGLO ప్లాట్‌ఫారమ్‌పై ఈ ఇ-SUV నిర్మాణం పూర్తయింది. INGLO ప్లాట్‌ఫారమ్ మెరుగైన ఇంటీరియర్ స్పేస్, స్టెబిలిటీ, అద్భుతమైన హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. అంతేకాకుండా, అల్ట్రా-హై-స్ట్రెంగ్త్ బోరాన్ స్టీల్ ఫ్రేమ్‌తో వెహికల్ నిర్మాణం పూర్తయింది.

Aakanksha Singh Drives

59 kWh, 79 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో మహీంద్రా ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లోకి వచ్చింది. చిన్న బ్యాటరీ వెర్షన్ 228 bhp పవర్, గరిష్టంగా 380 Nm టార్క్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 542 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. మరోవైపు, పెద్ద 79 kWh వేరియంట్ 282 bhp పవర్, 380 Nm టార్క్ను అందిస్తుంది.

ఇది పూర్తి ఛార్జ్‌పై 656 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. మెరుగైన థర్మల్ ప్రొటెక్షన్, క్వాలిటీకి పేరుగాంచిన లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్‌లు ఇందులో ఉన్నాయి. 175 kW DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి కేవలం 20 నిమిషాల్లో 20-80 శాతం ఛార్జ్‌ను సాధించగల సామర్థ్యం ఈ ఎలక్ట్రిక్ SUVకి ఉంది. ఎక్స్‌టీరియర్ లాగానే ఇంటీరియర్ కూడా విలాసవంతంగా ఉంటుంది.

డాష్‌బోర్డ్‌లో మూడు పెద్ద 12.30 అంగుళాల స్క్రీన్‌లు మహీంద్రా XEV 9e EVలో అమర్చబడ్డాయి. సినిమాస్కోప్ కాక్‌పిట్ అని పిలవబడే ఈ సిస్టమ్‌తో పాటు, వెనుక సీట్లలో ప్రయాణీకుల కోసం రెండు అదనపు స్క్రీన్‌లు కూడా ఇచ్చారు. విజన్ఎక్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ HUD (VisionX Augmented Reality HUD), MAIA, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8295 ప్రాసెసర్, 24 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కూడా ఈ వాహనంలో ఉన్నాయి.

7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2+ ADAS, 360-డిగ్రీ కెమెరా, సీట్ వెంటిలేషన్‌తో కూడిన లెదర్‌రేట్ అప్హోల్స్టరీ, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సీట్లు, డైనమిక్ లైట్‌లతో కూడిన ఇన్ఫినిటీ గ్లాస్ రూఫ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 16-స్పీకర్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్ వంటివి మహీంద్రా XEV 9E ఎలక్ట్రిక్ SUVలోని ఇతర ఫీచర్లు.

More from DriveSpark

Article Published On: Thursday, May 29, 2025, 17:50 [IST]
English summary
Tollywood actress aakanksha singh drives home a new electric suv check out the mahindra xev 9e ev
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+