ఆటోలో ప్రయాణించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఈ బ్యూటీ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా, వైరల్‌ వీడియో.!!

టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ నెల 22 న రకుల్‌ వివాహం జరగనున్నట్లు సమాచారం. నటుడు జాకీ భగ్నానీతో రకుల్‌ రిలేషన్‌ షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరివురూ త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh).. టాలీవుడ్‌లో టాప్‌ హీరోల సరసన నటించి సూపర్‌ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా రకుల్‌(Rakul Marriage).. పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉంది. ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఫిబ్రవరి 19 నుంచి 21 నుంచి జరగనున్నట్లు సమాచారం. అయితే పెళ్లి వేడుక ఎక్కడనే దానిపై రకుల్‌ ఇంకా వివరాలు వెల్లడించలేదు.

Rakul-Preet-Singh-Riding-In-Auto

పెళ్లి వేడుక గోవాలో జరుగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పుడు రకుల్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ తన లగ్జరీ కార్లను వదిలేసి ఆటోలో ప్రయాణించింది. అవును వినడానికి ఇది షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. మంబయిలో ఓ ఇంటివద్ద రకుల్‌ హడావుడిగా ఆటో దిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

"ఈ రోజు ముంబైలో ఆటోలో ప్రయాణించిన రకుల్ ప్రీత్ సింగ్.."(Rakul Preet Singh In Auto) అని క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్‌ చేశారు. ఆకర్షణీయమైన పసుపు రంగు గౌన్‌లో.. పూల ప్రింట్లతో రకుల్‌ చాలా అందంగా కనిపించింది. మినిమల్‌ యాక్సెసరీస్‌, వైట్‌ స్నీకర్స్‌ను ధరించింది. జతగా హ్యాండ్‌బ్యాగ్‌తో పాటు ముఖానికి మాస్క్‌ ధరించింది. ఆటో డ్రైవర్‌కు డబ్బులు చెల్లించిన అనంతరం.. హడావుడిగా ఆమె లోపలికి వెళ్లిపోయింది.

Rakul-Preet-Singh-Riding-In-Auto

కాగా ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ మరియు కాబోయే భర్త జాకీ భగ్నానీ.. ఇటీవల తేరీ బాటన్ మెయిన్ ఐసా ఉల్జా జియా ప్రత్యేక ప్రదర్శనలో జంటగా కనిపించి అభిమానులను అలరించారు. అమిత్ జోషి మరియు ఆరాధనా సాహ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో షాహిద్ కపూర్ మరియు కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇదిలా ఉండగా.. రకుల్ ప్రీత్‌ సింగ్‌ సాధారణ యువతిలా ఆటోలో ప్రయాణించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ఎందుకంటే ఈ టాప్‌ హీరోయిన్‌ గ్యారేజ్‌లో లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో మెర్సిడెస్ బెంజ్ GLE, మెర్సిడెస్ బెంజ్ GLA, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి Q3 మరియు BMW 5 సిరీస్ వంటి విలాసవంతమైన కార్లు ఆమె సొంతం.

Rakul-Preet-Singh-Riding-In-Auto

కాగా గతంలో కూడా ప్రముఖ నటి కీర్తి సురేష్‌ ఆటోలో ప్రయాణించిన సంఘటన చోటుచేసుకుంది. కీర్తి నటిస్తున్న బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లో భాగంగా నటుడు వరుణ్‌ ధావన్‌తో కలిసి ఆటోలో ప్రయాణించింది. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఏదేమైనా ఇలా ప్రముఖ హీరోహీరోయిన్లు ఇలా సాదాసీదాగా కనిపించడం.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, February 9, 2024, 15:59 [IST]
English summary
Tollywood actress rakul preet singh riding in auto video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+