తన డ్రీమ్ కారు 'Mercedez-Benz G-Wagon' ను కొన్న యాంగ్రీ యంగ్ హీరో 'విశ్వక్ సేన్'

విశ్వక్ సేన్ (Vishwak Sen).. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కుర్ర హీరో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ని సంపాధించుకున్నాడు. ఇటీవల ఓ టెలివిజన్ న్యూస్ ఛానెల్ డిబేట్ లో జరిగిన గొడవ కారణంగా, ఇతడు మరింత పాపులరాటీని దక్కించుకున్నాడు. సరే ఆ గొడవ అటుంచితే, హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం గడచిన మే 6 వ తేదీన విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. అంత పెద్ద కాంట్రావర్సీ తర్వాత కూడా ఈ చిత్రం పెద్ద హిట్ కావడంతో ఈ హీరో తన విజయాన్ని తనదైన శైలిలో జరుపుకున్నాడు.

తన డ్రీమ్ కారు 'Mercedez-Benz G-Wagon' ను కొన్న యాంగ్రీ యంగ్ హీరో 'విశ్వక్ సేన్'

హీరో విశ్వక్ సేనే మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ (Mercedez-Benz) లోనే అత్యంత ఖరీదైన ఎస్‌యూవీ జి-వ్యాగన్ (G-Wagon) ను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. హైదరాబాద్ లోని కావూరి హిల్స్ వద్ద ఉన్న మహవీర్ మోటార్స్ నుండి తాను ఈ మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్ కొనుగోలు చేశాడు. తనకెంతో ఇష్టమైన మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ కారును కొనుగోలు చేయడం ద్వారా తన చిరకాల కలను నెరవేర్చుకున్నాని, ఇదంతా తన అభిమానులు తనపై చూపిస్తున్న ఆదరణ, ప్రేమ వల్లనే సాధ్యమైందని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.

తన డ్రీమ్ కారు 'Mercedez-Benz G-Wagon' ను కొన్న యాంగ్రీ యంగ్ హీరో 'విశ్వక్ సేన్'

విశ్వక్ సేన్ తన ఇన్‌స్టా పోస్ట్ లో.. "నిన్ననే నా డ్రీమ్ కార్ కొన్నాను. మీ నిరంతర ప్రేమ మరియు మద్దతు కారణంగానే ఇదంతా సాధ్యమైంది. అందరికీ ధన్యవాదాలు. నా జీవితంలో జరిగిన ప్రతిదానికీ మరియు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అని రాసి ఉంది. ఈ సందర్భంగా తనకు సహకరించిన మహవీర్ మోటార్స్ యాజమాన్యానికి కూడా ఈ హీరో కృతజ్ఞతలు తెలియజేశాడు. కొత్త కారుతో దిగిన ఫొటోలను హీరో తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు చూసి అభిమానులు సంబరపడుతున్నారు. ఈ మాస్ కా దాస్ కి అభినందనలు చెబుతున్నారు.

తన డ్రీమ్ కారు 'Mercedez-Benz G-Wagon' ను కొన్న యాంగ్రీ యంగ్ హీరో 'విశ్వక్ సేన్'

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన వాహనాలలో జి-క్లాస్ (Mercedez-Benz G-Class) కూడా ఒకటి. దేశీయ మార్కెట్లో ఈ కారు ధరలు రూ1.72 కోట్ల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. కస్టమర్ ఎంచుకునే కస్టమైజేషన్ ప్యాకేజీలను బట్టి ఈ ధరలు మారుతూ ఉంటాయి. కంపెనీ ఈ మోడల్ లైనప్‌లో తమ పెర్ఫార్మెన్స్ డివిజన్ ఏఎమ్‌జి ట్యూన్ చేసిన మెర్సిడెస్-ఏఎమ్‌జి జి 63 4-మ్యాటిక్ (Mercedes-AMG G 63 4MATIC) అనే ప్రత్యేకమైన కారును కూడా విక్రయిస్తోంది. ఈ హై-పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.2.55 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

తన డ్రీమ్ కారు 'Mercedez-Benz G-Wagon' ను కొన్న యాంగ్రీ యంగ్ హీరో 'విశ్వక్ సేన్'

హీరో విశ్వక్ సేన్ కొనుగోలు చేసింది ఇందులో G 350d 4MATIC వేరియంట్ అని తెలుస్తోంది. ఈ వేరియంట్ లో శక్తివంతమైన 3.0 లీటర్ ఇన్‌లైన్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 3400 - 4600 ఆర్‌పిమ్ వద్ద గరిష్టంగా 282 బిహెచ్‌పి పవర్ ను మరియు 1200 - 3200 ఆర్‌పిఎమ్ వద్ద 600 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 9జి-ట్రానిక్ (9-స్పీడ్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

తన డ్రీమ్ కారు 'Mercedez-Benz G-Wagon' ను కొన్న యాంగ్రీ యంగ్ హీరో 'విశ్వక్ సేన్'

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మెర్సిడె బెంజ్ జి 350డి 4మ్యాటిక్ జి-క్లాస్ ఎస్‌యూవీ కేవలం 7.4 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 199 కిలోమీటర్ల (టాప్ స్పీడ్) వేగంతో పరుగులు తీస్తుంది. ఈ ఎస్‌యూవీలో ఏకంగా 100 లీటర్ల డీజిల్ ను స్టోర్ చేయగల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.

తన డ్రీమ్ కారు 'Mercedez-Benz G-Wagon' ను కొన్న యాంగ్రీ యంగ్ హీరో 'విశ్వక్ సేన్'

ఈ కారులోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇదొక బాక్సీ టైప్ డిజైన్ సిల్హౌట్ ను కలిగి ఉండి, ఓ క్లాసీ లుక్ ఎస్‌యూవీగా ఉంటుంది. ఇందులో గుండ్రటి ఎల్ఈడి హై పెర్ఫార్మెన్స్ హెడ్‌ల్యాంప్స్, నప్పా లెదర్‌ ఇంటీరియర్స్, మల్టీఫంక్షన్ స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్, యాంబియెంట్ లైటింగ్, రియర్ మౌంటెడ్ స్పేర్ వీల్, మెర్సిడెస్ మి కనెక్ట్, యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి మరోన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

తన డ్రీమ్ కారు 'Mercedez-Benz G-Wagon' ను కొన్న యాంగ్రీ యంగ్ హీరో 'విశ్వక్ సేన్'

జి కస్టమైజేషన్స్ లో భాగంగా కంపెనీ ఈ లగ్జరీ ఎస్‌యూవీ కోసం AMG లైన్ ప్యాకేజ్, నైట్ ప్యాకేజ్, నైట్ ప్యాకేజ్ మాగ్నో, స్టెయిన్లెస్ స్టీల్ ప్యాకేజ్, G Manufaktur ఇంటీరియర్, ఎక్స్‌క్లూజివ్ ఇంటీరియర్, వుడ్ అండ్ లెదర్‌ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, యాక్టివ్ మల్టీకంటౌర్ ప్యాకేజ్, రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, అర్బన్ గార్డ్ వెహికల్ ప్రొటెక్షన్ వంటి కస్టమైజేషన్ ఆప్షన్లు కూడా అందిస్తోంది. అలాగే, కస్టమర్లు 18 ఇంచ్ నుండి 20 ఇంచ్ వరకూ అందుబాటులో ఉండే వివిధ రకాల అల్లాయ్ వీల్స్ ను కూడా ఎంచుకోవచ్చు.

తన డ్రీమ్ కారు 'Mercedez-Benz G-Wagon' ను కొన్న యాంగ్రీ యంగ్ హీరో 'విశ్వక్ సేన్'

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం అనే చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అర్జున్ కుమార్ అల్లం పాత్రలో చూపిన నటనకు అందరిని ఆకట్టుకుంటోంది. విశ్వక్ సేన్ ఇప్పటి వరకూ ఇలాంటి భిన్నమైన చేయకపోవడం ఈ సినిమాకు హైలైట్ అయ్యింది.

Most Read Articles

English summary
Tollywood hero vishwak sen brought his dream car mercedez benz g class
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X