విఫలమైన టాప్-10 ఆటోమొబైల్ టటూలు
పచ్చబొట్టేసినా... అనే పాట ఇప్పుడు యావత్తు తెలుగు ప్రజలందరి నోటి నుండి వినపడుతూ ఉంటుంది. పాటకు ఎంత క్రేజ్ ఉందో, పచ్చబొట్టుకు కూడా అంతే క్రేజ్ ఉంది. ఎందుకంటే చాలా మంది పచ్చబొట్టు వేయించుకోవడానికి ఏది బాగుటుంది ? ఎప్పుడు వేయించుకోవాలి అని ఉవ్విళ్లూతుంటారు. అంతే కాదండోయ్ ఈ మోడ్రన్ ప్రపంచంలో ఆటోమొబైల్ టటూలు కూడా కొంత మందికి డ్రీమ్ ప్రాజెక్టులా ఎప్పుడెప్పుడు పొడుకుందామా అని ఎదురు చూస్తుంటారు.
కాని చాలా సందర్భాల్లో ప్రజలు తమకు నచ్చినట్లు వేయించుకోలేక పోతారు. అలా విఫలమైన టాప్-10 ఆటోమొబైల్ టటూలు క్రింది కథనంలో కలవు.

10. వోక్స్‌వ్యాగన్ లోగో
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వోక్స్‌వ్యాగన్ ఎంతో ఇబ్బందుల్లో ఉంది. కాని టటూ ప్రేమికుడు వోక్స్‌వ్యాగన్ గుర్తొచ్చేవిదంగా ఉంది కదూ ? కాని ఆ టటూ మీద గ్రద్ద కూచొని ఉంది. కాబట్టి ఇది వోక్స్‌వ్యాగన్ లోగో కాదు కాని రెండింటి కలయికగా ఇలా పచ్చవేయించుకున్నాడు.

09. సూపర్ మ్యాన్ థీమ్‌లో వోక్స్‌వ్యాగన్ లోగో
ఈ లోగోను వేయించుకున్న వ్యక్తి మొదట్లో సూపర్ మ్యాన్ కాని వోక్స్‌వ్యాగన్ లోగోను గాని పచ్చ వేయించుకోవాలని అనుకున్నాడు. కాని ఇతని మిత్రుని సలహా మేరకు ఇలా సూపర్ మ్యాన్ థీమ్‌లో వోక్స్‌వ్యాగన్ లోగోను టటూగా వేయించుకున్నాడు. కాబట్టి ఇది కూడా వోక్స్‌వ్యాగన్ లోగో కాదని చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో సూపర్ మ్యాన్ థీమ్ ఉంది కాబట్టి.

08. ఒకే కారు మూడు రంగుల్లో
ఇందులో ఉన్నఆమె టటూ సోయగాన్ని చూస్తున్నారుగా ? మొదట్లో ఈ అమ్మడు తనకు ఇష్టమైన కారును కొనుకుంది. తరువాత అదే కారు మూడు రంగుల్లో కూడా ఆమెకు నచ్చింది. ఇక చేసేది లేక మూడు కార్లను కూడా తన వీపు మొత్తం టటూ వేయించుకుంది.

07. షెవర్లేలో షెవర్లే లోగో
బాగా గమనించండి ఇక్కడ షెవర్లే లోగో కనబడుతోంది కదా. కాని మీరు ఇంకా బాగా గమనిస్తే ఈ లోగోలో మరిన్ని చిన్న చిన్న షెవర్లే లోగోలు మీరు చూడవచ్చు. అది కూడా మొత్తం లోగో మంటల్లో కాలిపోతున్నట్లు ఉంది చూడండి.

06. మీ చేతి బలమెంతో ఈ మీటర్‌లో చూడండి
మామూలుగా అప్పుడప్పుడు మనం చేతులను బిగిస్తూ ఉంటాము కదా, అపుడు మీ చేతి బలం ఎంతో తెలుసుకోవాలంటే ఇలాంటి టటూను మీ చేతి మీద వేయించుకోండి. అచ్చం ఇలాంటి అర్థ వచ్చేలా ఉంది కదూ.

05. ఇంట్లో స్వేఛ్చ దొరికినట్లు
ఇక్కడ ఉన్న టటూ చూడండి ఇంట్లో వాళ్లు టటూ వేయించుకోవడానికి అంగీరిస్తే ఎలా ఉంటుందో అలా టటూ వేయించుకున్నాడు. అది కూడా 15 సంవత్సరాల తరువాత అనుమతి వచ్చిందని అర్థం వస్తుందట.

04. బేబి బ్లూ కార్ టటూ
కారుకు ముందు అతి పెద్ద ఎయిర్ ఇంటేకర్ మరియు ఉబ్బెత్తుగా ఉన్నటువంటి బ్యానెట్ మరియు అక్కడక్కడ నీలం రంగులో ఉంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి కారును బయట చూశారా ? చూసి ఉండరు. అందుకోసమే దీనిని బేబీ బ్లూ కార్ అని అభివర్ణించారు.

03. ఆడి లోగో
మీరు ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా పచ్చబొట్టె అంటారు కదా. కాని కాదండోయ్, ఒక స్టూడెండ్ స్కెచ్ పెన్ తీసుకుని ఇలా తన పనితనం చూపించాడు.

02. డబ్బు మీద కార్ పార్కింగ్
బాగా చూడండి కారుని తన తల మీద పార్కింగ్ చేసినట్లు అవగతం అవుతోంది కదూ ? కాని కారు క్రింది బాగం చూడండి డబ్బు నోట్ల మీద కారును పార్క్ చేసినట్లు కనబడుతుంది.

01. బెంట్లీ లోగో
ఇటువంటి అత్భుతమైన లోగో వేసిన ప్రదేశం మరియు టటూ రెండు కూడా ఆశ్చర్యం కలిగించేవే. దీనికి రాయడానికి మాటలు రావడం లేదు. ఈ టటూ గురించే మీరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ రాయండి.

- 2013 అమెరికన్ మజిల్ క్యాలెండర్: వంపులు అదుర్స్
- పాత కార్ల విడిభాగాల నుండి 15 అత్భుతమైన ఫర్నీచర్స్
- బాలీవుడ్ తారలకు ఇష్టమైన బైకులు:


Click it and Unblock the Notifications