విమానం ఎక్కాలనుకుంటున్నారా ? అయితే వీటిని మాత్రమే ఎంచుకోండి
విమాన ప్రయాణం తప్పనిసరి అని అనిపించినపుడు ఏదో ఒక ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాన్ని ఎంచుకుని టికెట్ బుక్ చేసుకుంటాం. అయితే మన దేశంలోనే ఒక నగరం నుండి మరొక నగరానికి విమానంలో ప్రయాణించాల్సి వచ్చినపుడు ఎటువంటి విమానాన్ని ఎంచుకోవాలో తెలుసా...?
ఇలాంటి ఆలోచనలో ఉన్న వారికి ఈ మా ప్రత్యేత కథనం. విమానంలో గల వసతులు, విమానంలో ప్రయాణించాల్సిన వారి పరిమితి, వారు అందించే ఆహారం, టికెట్ ధర, టేకాఫ్ మరియు ల్యాండింగ్ వంటి విషయాలలో నాణ్యతను బట్టి మీకోసం దేశీయంగా గల టాప్-10 ఉత్తమ విమానయాన సంస్థలు వాటి వివరాలు....
మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

10. విస్తారా ఎయిర్‌లైన్స్
టాటా వారు మరియు సింగపూర్ ఎయిర్ లైన్స్ వారి ఉమ్మడి భాగస్వామ్యంతో నెలకొల్పిన ఈ సంస్థ జనవరి 9, 2015 నుండి సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం ఇది ఆరు ఎ320-232 ఎయిర్ బస్ విమానాల ద్వారా సేవలు అందిస్తోంది.

09. ఎయిర్ కోస్టా
టాప్-10 లో స్థానం దక్కించుకున్నఈ ఎయిర్ కోస్టా తెలుగువారు స్థాపించినది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. దీనిని అక్టోబర్ 5, 2013 న ప్రారంభించారు. ప్రస్తుతం నాలుగు విమానాల ద్వారా 9 నగరాలకు సేవలు అందిస్తున్నారు.

08. ఎయిర్ ఏసియా
ఎవరివన్ కెన్ ఫ్లైయ్ అనే ట్యాగ్‌లైన్ కలిగి ఉన్న చౌక విమాన యాన సంస్థ ఎయిర్ ఏసియా ఇది బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా సర్వీసులను అందిస్తోంది. ప్రస్తుతం ఐదు విమానాల ద్వారా 10 నగరాలకు సర్వీసులను అందిస్తోంది.

07.జెట్ కనెక్ట్
1991 లో సహారా ఎయిర్ లైన్స్ పేరుతో స్థాపించబడిన సంస్థ ఇప్పుడు జెట్ కనెక్ట్ గా సేవలు అందిస్తోంది. ఇది కూడా చౌక విమాయాన సేవలు అందిస్తున్న వాటి సరసన చేరిపోయింది. జెట్ కనెక్ట్ సంస్థ ఇందిరా గాంధి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కేంద్రగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం ఇది తొమ్మిది విమానాల ద్వారా 43 గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది.

06. గోఎయిర్
ముంబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న మరొక చౌక విమాన యాన సంస్థ గోఎయిర్. దీనిని 2005 లో స్థాపించారు. ప్రస్తుతం ఇది 140 విమానాలతో 22 నగరాలకు సేవలను అందిస్తోంది.

05. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
మే 2004 లో స్థాపించబడి ఏప్రిల్ 29 2005 నుండి సేవలు ప్రారంభించిన సంస్థ అనతి కాలంలోనే ప్రసిద్దిగాంచింది. ఇది ప్రస్తుతం కేరళలోని కాలికట్ కేంద్రగా పని చేస్తోంది. ఇది ఒక వారానికి దాదాపుగా 175 విమానాలను నడుపుతోంది.

04.ఎయిర్ ఇండియా
అక్టోబర్ 15, 1930 లో టాటా ఎయిర్ లైన్స్ గా స్థాపించిబడిన ఈ సంస్థ కాలక్రమంలో ఎయిర్ ఇండియాగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇది 107 విమానాలతో దాదాపుగా 85 గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. మరియు డొమెస్టిక్ మార్కెట్ షేర్లు అత్యధికంగా గల విమానయాన సంస్థ కూడా ఇదే.

03. జెట్ ఎయిర్‌వేస్
జెట్ ఎయిర్ వేస్ సంస్థ వయస్సు పరంగా కొంచెం పాతదే అయినప్పటికీ టాప్-10 లో మూడవ స్థానంలో నిలిచింది. జెట్ ఎయిర్‌వేస్ విమాన సంస్థ మే 5, 1993 నుండి తమ సర్వీసులను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా పని చేస్తోంది. ఇది దాదాపుగా 300 విమానాలతో ప్రపంచ వ్యాప్తంగా గల 74 గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది.

02. స్పైస్‌జెట్
రెండవ స్థానంలో ఉన్న సంస్థ స్పైస్‌జెట్ దీనిని మే 18, 2005 లో ప్రారంభించారు. ఇది చెన్నై అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ 34 విమానాలను దాదాపుగా 41 గమ్యస్థానాలకు విమానాలను చేరవేస్తోంది.

01 .ఇండిగో
చౌక విమానయాన సంస్థలలో ఒకటిగా పేరుగాంచిన సంస్థ ఈ ఇండిగో ఎయిర్‌లైన్స్. గుర్గావ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థను 2006 లో స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ 97 విమానాలను దాదాపుగా 38 దేశీయ మరియు ఐదు అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. ఈ సంస్థ విమానాలలో ప్రయాణించిన ప్రయాణికుల అభిప్రాయం ప్రకారం ఇది మొదటి స్థానంలో ఉంది.

- ప్రపంచవ్యాప్తంగా గల ఉత్తమ విమానాలు ఇవేనంట...!!
- ప్రపంచంలో ఇది ఒక వింత...నౌకల్ని మోస్తున్న నౌకలు


Click it and Unblock the Notifications








