2018లో భారతదేశపు 10 బెస్ట్ ఎయిర్‌లైన్స్

Written By:

ప్రయాణ సాధానాలలో కెల్లా విమానం చాలా గొప్పది. సుదూర తీర ప్రయాణాలను కొన్ని గంటల్లోనే పూర్తి చేస్తుంది. విమానయాన సేవలకు డిమాండ్ అధికమయ్యేసరికి ఎన్నో ఎయిర్‌లైన్స్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.

Recommended Video - Watch Now!
Most Expensive Planes In The World Used By Presidents

విమానంలోని వసతులు, విమానంలో ప్రయాణించాల్సిన వారి పరిమితి, వారు అందించే ఆహారం, టికెట్ ధర, టేకాఫ్ మరియు ల్యాండింగ్ వంటి అంశాల పరంగా నాణ్యతను బట్టి 2018 కోసం ఇండియాలో ఉన్న టాప్-10 బెస్ట్ ఎయిర్‌లైన్స్ గురించి ఇవాళ్టి కథనంలో....

భారతదేశపు 10 బెస్ట్ ఎయిర్‌లైన్స్

10. ఎయిర్ కోస్తా

టాప్-10 లో స్థానం దక్కించుకున్నఈ ఎయిర్ కోస్తా తెలుగువారు స్థాపించినది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. దీనిని అక్టోబర్ 5, 2013 న ప్రారంభించారు. ప్రస్తుతం నాలుగు విమానాల ద్వారా 9 నగరాలకు సేవలు అందిస్తోంది.

భారతదేశపు 10 బెస్ట్ ఎయిర్‌లైన్స్

09. విస్తారా ఎయిర్‌లైన్స్

టాటా గ్రూపు మరియు సింగపూర్ ఎయిర్‌లైన్స్ వారి ఉమ్మడి భాగస్వామ్యంతో నెలకొల్పిన ఈ సంస్థ జనవరి 9, 2015 నుండి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది ఆరు ఎ320-232 ఎయిర్‌బస్ విమానాల ద్వారా సేవలు అందిస్తోంది.

భారతదేశపు 10 బెస్ట్ ఎయిర్‌లైన్స్

08. ఎయిర్ ఏసియా

"ఎవరివన్ కెన్ ఫ్లైయ్" అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఎయిర్ ఏసియా పేరుకు తగ్గట్లుగానే చౌక విమానయాన సంస్థ ప్రసిద్ది చెందింది. ఏయిర్ ఏసియా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఐదు విమానాల ద్వారా 10 నగరాలకు సర్వీసులను అందిస్తోంది.

భారతదేశపు 10 బెస్ట్ ఎయిర్‌లైన్స్

07. జెట్ కనెక్ట్

1991లో సహారా ఎయిర్‌లైన్స్ పేరుతో స్థాపించబడిన సంస్థ ఇప్పుడు జెట్ కనెక్ట్‌గా సేవలు అందిస్తోంది. ఇది కూడా చౌక విమాయాన సేవలు అందిస్తున్న వాటి సరసన చేరిపోయింది. జెట్ కనెక్ట్ ఎయిర్‌లైన్స్ ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం ఇది తొమ్మిది విమానాల ద్వారా 43 గమ్యస్థానాలకు సేవలందిస్తోంది.

భారతదేశపు 10 బెస్ట్ ఎయిర్‌లైన్స్

06. గో ఎయిర్

ముంబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న మరొక చౌక విమానయాన సంస్థ గోఎయిర్. దీనిని 2005లో స్థాపించారు. ప్రస్తుతం ఇది 140 విమానాలతో 22 నగరాలకు సేవలను అందిస్తోంది. వారానికి 975 విమాన సర్వీసులు ఉన్నాయి.

భారతదేశపు 10 బెస్ట్ ఎయిర్‌లైన్స్

05. ఎయిర్ ఇండియా ఎక్స్‌‌ప్రెస్

మే 2004 లో స్థాపించబడి ఏప్రిల్ 29 2005 నుండి సేవలు ప్రారంభించిన సంస్థ అనతి కాలంలోనే ప్రసిద్దిగాంచింది. ఇది ప్రస్తుతం కేరళలోని కాలికట్ కేంద్రగా పని చేస్తోంది. ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా భాగస్వామ్యంతో నడుస్తున్న లో-కాస్ట్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్. ఇది ఒక వారానికి దాదాపుగా 175 విమానాలను నడుపుతోంది.

భారతదేశపు 10 బెస్ట్ ఎయిర్‌లైన్స్

04. ఎయిర్ ఇండియా

అక్టోబర్ 15, 1930 లో టాటా ఎయిర్‌లైన్స్‌గా స్థాపించబడిన ఈ సంస్థ కాలక్రమంలో ఎయిర్ ఇండియాగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇది 107 విమానాలతో దాదాపుగా 85 గమ్యస్థానాలకు సేవలు అందిస్తోంది. ఆర్థిక సమస్యలు మరియు ఉద్యోగుల ఇబ్బందుల కారణంగా నాలుగవ స్థానానికే పరిమితమైంది.

భారతదేశపు 10 బెస్ట్ ఎయిర్‌లైన్స్

03. జెట్ ఎయిర్‌వేస్

జెట్ ఎయిర్‌వేస్ సంస్థ స్థాపించబడి చాలా సంవత్సరాలే అయినప్పటికీ, టాప్-10 జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. జెట్‌ ఎయిర్‌వేస్ విమానయాన సంస్థ మే 5, 1993 నుండి సర్వీసులను ప్రారంభించింది. ప్రస్తుతం ఇది ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా సేవలందిస్తోంది. ఇది దాదాపుగా 300 విమానాలతో ప్రపంచ వ్యాప్తంగా గల 74 గమ్యస్థానాల సర్వీసులు అందిస్తోంది.

భారతదేశపు 10 బెస్ట్ ఎయిర్‌లైన్స్

02. స్పైస్‌జెట్

రెండవ స్థానంలో ఉన్న సంస్థ స్పైస్‌జెట్ దీనిని మే 18, 2005 లో ప్రారంభించారు. ఇది చెన్నై అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ 34 విమానాలతో 41 గమ్యస్థానాలకు సేవలు అందిస్తోంది. స్పైస్‌జెట్ రోజుకు 270 విమాన సర్వీసులు అందిస్తోంది.

భారతదేశపు 10 బెస్ట్ ఎయిర్‌లైన్స్

01. ఇండిగో

చౌక విమానయాన సంస్థలలో ఒకటిగా పేరుగాంచిన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్. గుర్గావ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థను 2006 లో స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ 97 విమానాలను దాదాపుగా 38 దేశీయ మరియు ఐదు అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. ఇండిగో సంస్థ రోజుకు 633 విమాన సర్వీసులు అందిస్తోంది. ఈ సంస్థ విమానాలలో ప్రయాణించిన ప్రయాణికుల అభిప్రాయం ప్రకారం ఇది మొదటి స్థానంలో ఉంది.

భారతదేశపు 10 బెస్ట్ ఎయిర్‌లైన్స్

విమానాల్లో పైలట్లు మరియు ఎయిర్‌హోస్టెస్ రహస్యంగా చేసే పనులు

భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?

English summary
Read In Telugu: Top 10 Best Airlines of India 2018
Story first published: Saturday, March 3, 2018, 18:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark