ప్రపంచంలోని అగ్ర ఆటోమొబైల్ సంస్థల భవిష్యత్తు మార్చిన 10 సాంకేతికతలు
ఆధునిక కార్లు ప్రస్తుతం ఎన్నో కొత్త సాంకేతికతలు, సౌకర్యాలు మరియు కార్ల ప్రయాణాలలో ఎన్నో మార్పులతో వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ ప్రపంచంలోని సాంకేతిక ఆవిష్కరణలను మరియు అవి అభివృద్ది చెందిన తీరు ఈ కథనంలో మీరు చూడవచ్చు.
కొన్ని దశాబ్దాల క్రితం ఆవిష్కరించబడిన అనేక సాంకేతికతలు నేటి ఆధునిక కార్లలో లెక్కపెట్టలేని విధంగా ఉన్నాయి. అందులో మీరు రోజూ ఎన్నో టెక్నాలజీలను ఉపయోగిస్తుంటారు.
ఆ టెక్నాలజీల ఆవిష్కరణలలోని మార్పులను వాటిని మొదటి సారిగా అందుబాటులోకి తెచ్చిన సంస్థలు అన్ని ఒక అత్భుతంగా ఉంటాయి. మరింత సమాచారం క్రింది కథనంలో....

1. ప్రపంచంలో మొదటి కారు
ప్రపంచలోనే మొదటి కారు అవును ప్రపంచానికి మొదటి సారిగా పరిచయం అయిన కారు ఇది. 1886 లో బెంజ్ పేటెంట్ మోటార్ వ్యాగన్ గా కార్ల్ బెంజ్ చేత తయారు చేయబడింది. అప్పుడు ఇది పెట్రోల్ మరియు గ్యాస్ ద్వారా నడిచేది.

2. స్టీరింగ్ వీల్‌తో వచ్చిన మొదటి కారు
స్టీరింగ్ వీల్ లేకుండా కారును నడిపే అవకాశం ఉందా..! ఒకప్పుడు ఉండేది, స్టీరింగ్ వీల్ కనుగొనక ముందు టిల్లర్ అనే పరికరం ఉపయోగించి వాహనాలను నడిపేరు వారు. అయితే 1894 లో మొదటి సారిగా ఆల్ఫ్రెడ్ వాచెరాన్ అనే వ్యక్తి 4 హార్స్‌పవర్ గల తన వాహనానికి స్టీరింగ్ వీల్‌ను మొదిటి సారిగా ఉపయోగించారు. స్టీరింగ్ వీల్స్ వాడకంలో కలిగిన మార్పులు ప్రక్కన గల చిత్రంలో చూడవచ్చు.

3. మొదటి డీజల్ కారు
ప్రపంచ వ్యాప్తంగా మొదటి డీజల్ కారును రూపొందించిన సంస్థగా మెర్సిడెస్ బెంజ్ నిలిచింది. మెర్సిజడెస్ బెంజ్ వారు రూపొందించిన ఈ 260డి కారులో 2545 సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల ఇన్ లైన్ ఇంజన్‌ను కలదు. తరువాత దీనిని 1940 వరకు ఉత్పత్తి చేశారు.

4. ఎయిర్ కండీషన్ ఉపయోగించిన మొదటి కారు
ఇంటికి మాత్రమే పరిమితమైన ఎసి ని మొదటి సారిగా 1939 కార్లలో ఉపయోగించారు. 1939 లో ప్యాకార్డ్ అనే కార్ల సంస్థ తమ కారులో ఎయిర కండీషనర్‌ను ఉపయోగించింది. అయితే ప్రస్తుత కాలంలో దాదాపు అన్ని కార్లలో కూడా ఏసి సౌలభ్యం ఉంది.

5. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
ప్రస్తుతం ఎన్నో కార్ల సంస్థలు తమ కార్లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అంటూ కార్లను అందిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్న ఆటోమేటిక్ ట్రాన్స్‌మిన్ ను 1939 లో ప్రపంచ వ్యాప్తంగా మొదటి సారిగా జనరల్ మోటార్స్ వారి క్యాడిల్లాక్ కారులో ఉపయోగించారు.

6. త్రీ పాయింట్ సీట్ బెల్ట్‌ను కలిగిన మొదటి కారు
త్రీ పాయింట్ సీట్ బెల్ట్‌ను ప్రపంచ వ్యాప్తంగా మొదటిసారిగా స్వీడిష్‌కు చెందిన వోల్వో కార్ల తయారీ సంస్థ తమ పివి544 కారులో ఉపయోగించింది.

7. ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను వినియోగించిన మొదటి కారు
ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్‌లో ప్రపంచ వ్యాప్తంగా మొదటిసారిగా డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను వినియోగించిన మొదటి కారు మెర్సిడెస్ బెంజ్ కు చెందిన ఎస్ఎల్ గాల్వి. 1955లో దీనిని వినియోగించారు. ఈ కారులో ఉపయోగించిన ఇంజెక్షన్ సిస్టమ్ బాష్ సంస్థ వారు అందించారు.

8. డిస్క్ బ్రేకులను వినియోగించిన మొదటి కారు
సిట్రోయెన్ డిఎస్ కారులో 1955 లో ప్రపంచ వ్యాప్తంగా మొదటిసారిగా డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు. అప్పట్లో సిట్రోయెన్ డిఎస్ కారులో చాలా వరకు కొత్త ఫీచర్లు కల్పించారు అందులో భాగంగానే ఈ డిస్క్ బ్రేక్‌లను అందించారు.

9. యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్
భారత్‌లో ఇప్పుడిప్పుడే ఈ యాంటి లాకింగ్ బ్రేకింగ్ ఫీచర్లతో కార్లు వస్తున్నాయి. అది కూడా టాప్ ఎండ్ వేరయంట్లలో మాత్రమే అందిస్తున్నారు. అయితే ఈ ఫీచర్‌ను చాలా దేశాలలో తప్పనిసరి చేశారు.
బ్రిటిష్ కు చెందిన జెన్సెన్ ఎఫ్‌ఎఫ్ కార్ల తయారీ సంస్థ 1966 నుండి 1971 వరకు 360 కార్లను యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో మొదటి సారిగా తయారు చేశారు.

10. మొదటి ఎయిర్ బ్యాగ్ కారు
1951 నుండి 1973 వరకు ఎయిర్ బ్యాగ్స్ మీద చాలానే ప్రయోగాలు జరిగాయి. అయితే జనరల్ మోటార్స్ కు చెందిన టొరాండో కారును ఎయిర్ బ్యాగ్‌తో మొదటి సారిగా వినియోగదారులకు అందించారు.

11. లైట్లు లేని కారు (2014)
ఇంత వరకు ప్రపంచానికి మొదటి సారిగా పరిచయం అయిన టెక్నాలజీల గురించి చూశారు కదా కాని ఇప్పుడు లైట్లను వినియోగించని మొదటి కారు గురించి తెలుసుకోండి. అవును ఇందులో వెలగడానికి బలుపులు ఏ మాత్రం కూడా ఇందులో వినియోగించలేదు. అయితే బలుపులు ఉండవలసిన హెడ్ ల్యాంప్స్ , టెయిల్ ల్యాంప్స్ మరియు ఇంటీరియర్ ల్యాంప్‌లలో మొదటి సారిగా ఎల్‌ఇడి లైట్లను అందించారు. మెర్సిడెస బెంజ్ ఎస్- క్లాస్ కారులో దాదాపుగా 500 వరకు ఎల్‌ఇడి లైట్లను వినియోగించారు.


Click it and Unblock the Notifications