అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనం మహిళ: టాప్-10 బెస్ట్ కార్స్ ఫర్ ఉమెన్
ప్రపంచం మొత్తం నేడు ఎన్నో విజయాలను సాధిస్తూ రాకెట్ వేగంతో ముందుకు పరుగులు పెడుతోంది అంటే ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి కారణం మహిళలే మానవ జాతి సాధించిన ఎంతటి అభివృద్ది అయినా అది స్త్రీ మూర్తి నుండి ప్రారంభం అయినదే అని నిరభ్యంతరంగా చెప్పవచ్చు. ఇలా మానజాతి అభివృద్దికి అడుగడుగునా వెన్నంటి నిలుస్తున్న మహిళల కోసం డ్రైవ్‌స్పార్క్ నుండి ప్రత్యేకంగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
Also Read: బాలీవుడ్ తారలకు ఇష్టమైన బైకులు
మహిళల కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-10 ఉత్తమ కార్లు గురించి క్రింది స్లైడర్ల ద్వారా అందివ్వడం జరిగింది.

01. టాటా నానో
టాటా నానో కారు సిటిలో ఉన్న మహిళలకు ఎంతో బాగా నప్పుతుంది. తక్కువ దూరం కలిగిన ప్రాంతాలకు వెళ్లుటకు, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ద్వారా సులభంగా డ్రైవింగ్ చేసుకునే అవకాశం, తక్కువ టర్నింగ్ రేడియస్ కలిగి ఉంటుంది. దీని మైలేజ్ లీటర్‌కు 21.9 కిలోమీటర్లు మరియు ప్రారంభ వేరియంట్ ధర రూ. 2,88,877 లు ఆన్ రోడ్ (హైదరాబాద్)గా ఉంది

2. మారుతి సుజుకి ఆల్టో కె10 ఏఎమ్‌టి
మారుతి సుజుకికు చెందిన అతి తక్కువ నిర్వహణ ఖర్చు గల కారు ఆల్టో కె10 ఆటోమేటిక్. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా అత్యధిక సర్వీసింగ్ పాయింట్లను మారుతి సుజుకి కలిగి ఉంది. కాబట్టి సులంభంగా వీటి సర్వీసింగ్ పూర్తి చేయవచ్చు. ఆల్టో కె10 ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 3,91,690 లుగా ఉంది. మరియు దీని మైలేజ్ లీటర్‌కు దాదాపుగా 24 కిలోమీటర్లుగా ఉంది.

3. మారుతి సుజుకి సెలెరియో ఆటోమేటిక్
మారుతి సుజుకిలోని మరొక బడ్జెట్ కారు సెలెరియో ఆటోమేటిక్ ఇది 998 సీసీ గల పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ లీటర్‌కు 23.1 కిలోమీటర్లు మైలేజ్‌ని ఇస్తుంది. అంతే కాకుండా చక్కటి రైడింగ్ అనుభూతి కోసం ఆటోమేటిక్ వర్షెన్‌లో కూడా అందుబాటులో ఉంది. మంచి ఫీచర్లు గల దీని ప్రారంభ వేరియంట్ యొక్క ధర రూ. 4,80,698 ఆన్ రోడ్ (హైదరాబాద్)గా ఉంది

4. హోండా బ్రియో ఆటోమేటిక్
దూర మరియు దగ్గర ప్రాంత ప్రయాణాలకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది. మంచి పవర్‌ను విడుదల చేయు దీని ఇంజన్‌కు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అనుసంధానించారు. ఇది లీటర్‍కు అత్యధికంగా 18.9 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ.5,17,001 లు ఆన్ రోడ్ (హైదరాబాద్) గా ఉంది.

5. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఆటోమేటిక్
ముందు వైపున ఆకర్షణీయమైన డిజైన్, అత్భుమైన ఫీచర్లు మరియు మంతి రీ సేల్ వ్యాల్యూ కలిగిన కారు ఇది. ఈ గ్రాండ్ ఐ10 కారు యొక్క ప్రారంభ వేరియంట్ లీటర్‌కు దాదాపుగా కిలోమీటర్లు 18.9 మైలేజ్‌ను ఇస్తుంది. మరియు దీని ప్రారంభం వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ. 5,65,460లు (హైదరాబాద్) గా ఉంది.

6.ఫోర్డ్ ఫిగో సివిటి
ఫోర్డ్ వారి ఫిగో కారులో 1196 సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది మంచి పవర్‌ను విడుదల చేస్తుంది. మంచి నిర్వహణ మరియు సరైన ధరకు ఇది అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ వేరియంట్ మైలేజ్ లీటర్‌కు 18.6 కిలోమీటర్లు మరియు ఆన్ రోడ్ ధర రూ. 5,25,305 లు (హైదరాబాద్) గా ఉంది

7. నిస్సాన్ మైక్రా ఎక్స్-షిఫ్ట్
మహిళల కోసం అత్భుతంగా ఉంటుంది ఈ మైక్రా ఎక్స్ షిఫ్ట్ . ఇందులో చక్కటి పనితీరు కనబరిచే 1198 సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు. దీనికి ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను అనుసంధానించారు. దీని మైలేజ్ లీటర్ పెట్రోల్‌కు 18.44 కిలోమీటర్లుగా ఉంది. మరియు ఆటోమేటిక్ మైక్రా ధర రూ. 8.39.047 లు ఆన్ రోడ్ (హైదరాబాద్) గా ఉంది

8. మారుతి సుజుకి బాలెనొ సివిటి
మారుతి సుజుకి వారి నూతన కారు బాలెనొ గొప్ప అమ్మకాలు సాధిస్తోంది. అయితే ఇందులోని సివిటి వేరియంట్ కారు మహిళలకు అచ్చంగా సరిపోతుందని మామ అభిప్రాయం. అధిక ఇంటీరియర్ స్పేస్ మారుతి నుండి మంచి సర్వీసింగ్ సపోర్ట్ కలదు.దీని గరిష్ట మైలేజ్ పెట్రోల్ లీటర్‌కు 21.4 కిలోమీటర్లు మైలేజ్ మరియు దీని ధర రూ. 6,20,988 లు ఆన్ రోడ్ (హైదరాబాద్)గా ఉంది

9.హోండా జాజా సివిటి
హోండా మోటార్స్ వారు ఈ జాజ్ కారులో నూతన ఫీచర్లు మరియు కొత్తగా పెడల్ షిఫ్టర్స్‌ను కల్పించారు. అన్ని అవసరాలకు ఉపయోగపడే విదంగా గల ఇంటీరియర్ డిజైన్ ఇందులో కలదు. ఆటోమేటిక్ పెట్రోల్ వర్షెన్ లీటర్‌కు 19 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు. దీని ధర రూ. 9,54,546 ఆన్ రోడ్ (హైదరాబాద్) గా ఉంది.

10.హోండా సిటి ఆటోమేటిక్
హోండా సిటి ఆటోమేటిక్‌ను నూతన శైలిలో డిజైన్ చేసారు. ఇందులో 1497సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఆటోమేటిక్ గేర్ బాక్స్ గల ఇది లీటర్‌కు 18 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. దీని ఆన్ రోడ్ ధర రూ. 11,90,488 లు (హైదరాబాద్)గా ఉంది.

11.రెనో క్విడ్ ఏఎమ్‌టి
మంచి డిజైన్, కాంపాక్ట్ సైజులో మరియు సులభమైన నిర్వహణ కలిగిన రెనో క్విడ్ కారు మహిళలకు బాదా నప్పుతుంది. ప్రస్తుతం ఇది మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది లీటర్‌కు 25.17 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ. 3,18,948 లు ఆన్ రోడ్ (హైదరాబాద్) గా ఉంది.

- డ్రైవింగ్ చేసే గర్భిణీ స్త్రీల కోసం ముఖ్యమైన చిట్కాలు
- అమ్మాయిల కోసం కొన్ని పింక్ కలర్ కార్స్ - ఫొటోలు


Click it and Unblock the Notifications