ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కరికి సాధారణంగా అనేక కోరికలు ఉంటాయి. ఈ కోరికలు నిజం కావచ్చు లేకుంటే అలాగే మిగిలిపోవచ్చు. చాలా మందికి వాహనాలంటే చాలా ఇష్టం, అది సామాన్య ప్రజల నుంచి అపర కుబేరుని దాకా. అయితే ఇక్కడ సామాన్య ప్రజలు వాడే వాహనాలు మరియు బాగా డబ్బున్న ధనవంతులు వాడే వాహనాలకు చాలా తేడా ఉటుంది. ఈ విషయం దాదాపు అందరికి తెలుసు.

కొంతమంది విలాసవంతమై వాహనాలను ఇష్టపడితే, మరికొందరు సూపర్ కార్లను ఇష్టపడతారు. కొందరు మంచి ఫీచర్స్ మరియు మైలేజ్ ఉన్న కార్లను ఇష్టపడితే, మరికొందరు మంచి సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లను ఇష్టపడతారు. ఈ విధంగా ఎవరి అభిరుచికి తగిన విధంగా వారు వాహనాలను ఎంపిక చేసుకుని వినియోగిస్తుంటారు.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

అయితే సామాన్య ప్రజల వాహనాలు కాకూండా ప్రపంచంలో అపర కుబేరులైన జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, ఎలోన్ మస్క్ వంటి టాప్ 10 బిలినియర్స్ యొక్క కార్స్ ఎలా ఉటాయి అనే విషయం గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

జెఫ్ బెజోస్: హోండా అకార్డ్

ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్త, అంతే కాదు యితడు అమెజాన్ కంపేనీ యొక్క సీఈఓ కూడా. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సంస్థ ఎంత ప్రాచుర్యం చెందిందో అందరికి తెలుసు. అమెజాన్ కంపేనీ ప్రపంచవ్యాప్తంగా డెలివరీలు మొదలైన ఇ సర్వీసులు చేస్తుంది.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

ఈ రోజు బెజోస్ ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల్లో ఒకరుగా అందరికి తెలుసు. ఇంత గొప్ప ధనవంతుని జీవన శైలి ఏవిధంగా ఉంటుందో మీరు ఊహించవచ్చు. అయితే ఇతడు హోండా అకార్డ్ కలిగి ఉన్నాడు. యితడు 90 లలో బిలియనీర్‌గా ఉన్నప్పుడు కూడా ఈ కారులో తిరిగేవాడు.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

ఎలోన్ మస్క్: మెక్లారెన్ ఎఫ్ 1

ఈ రోజు ప్రపంచదేశాల్లో ఎలోన్ మస్క్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచానికే అడ్వాన్స్డ్ గా ఉన్న ప్రముఖ టెస్లా కంపెనీకి సీఈఓ అయిన ఎలోన్ మస్క్ ఈ రోజు ప్రపంచంలోని టాప్ 10 బిలినియర్స్ లో ఒకడుగా ఉన్నాడు. ఇతని కంపేనీ యొక్క ఎలక్ట్రిక్ కార్లు చాల దేశాల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

ఎలోన్ మస్క్ మొదట కొని వ్యాపారాల్లో బాగా లాభాలను ఆర్జించిన తరువాత కొన్ని సంవత్సరాలుగా తన డబ్బును కొన్ని ఆసక్తికరమైన కార్ల కోసం ఖర్చు చేశాడు. ఇందులో భాగంగానే మస్క్ 'మెక్లారెన్ ఎఫ్ 1' ను కొనుగోలు చేసాడు. ఐతే కాకుండా ఇతడు బాండ్ ఫిల్మ్ ది స్పై హూ లవ్డ్ మి లోని 'లోటస్ ఎస్ప్రిట్‌'ను దాదాపు 6,00,000 డాలర్లను వెచ్చించి కొనుగోలు చేశాడు.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

బెర్నార్డ్ ఆర్నాల్ట్: బీఎండబ్ల్యూ 760ఎల్ఐ

ఎల్‌విఎమ్‌హెచ్ చైర్మన్ మరియు సీఈఓ అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచంలోని టాప్ 10 సంపనుల్లో ఒకరు. ఇతని గురించి పెద్దగా ఎవరికీ తెలియక పోవచ్చు, కానీ వ్యాపారవేత్తలకు ఇతని పేరు సుపరిచయమే. అయితే యితడు బీఎండబ్ల్యూ బ్రాండ్ యొక్క 760ఎల్ఐ ఏ కారుని కలిగి ఉన్నాడు.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

బిల్ గేట్స్: పోర్స్చే 959

ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' తెలియని వారు ఉండరు. ఒకప్పుడు ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల్లో ఒకడుగా ఉన్న బిల్ గేట్స్ ఇటీవల వెల్లడైన ఒక జాబితా ప్రకారం 4 స్థానంలో చేరినట్లు తెలిసింది. బిల్ గేట్స్ గురించి తెలిసిన వాళ్ళకి కూడా అతని కార్ల గురించి తెలియకపోవచ్చు.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

బిల్ గేట్స్ 80 లలోనే ప్రముఖ పోర్స్చే 959 కొనుగోలు చేశాడు. అయితే ఇటీవల అమెరికా ప్రభుత్వం 25 ఏళ్లలోపు కార్లను దిగుమతి చేసుకోవడాన్ని చట్టవిరుద్ధం చేసింది. అయితే సంవత్సరానికి 2,500 మైళ్ల లోపు ఉంటే కార్లను అనుమతించవచ్చని ఒక ‘షో అండ్ డిస్ప్లే' నిబంధనను రూపొందించడంతో, చివరకు అతను దానిని పొందగలిగాడు.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

మార్క్ జుకర్‌బర్గ్: పగని హుయెరా, హోండా జాజ్

ప్రపంచ కుబేరుల్లో ఒకరు మార్క్ జుకర్‌బర్గ్. మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను స్థాపించిన ఇటాలియన్. 'ఫేస్‌బుక్‌' కి ప్రపంచంలో ఎంత ఆదరణ ఉందో అందరికి తెలుసు. ఈ రోజు ఫేస్‌బుక్‌ ఎంతగా వినియోగంలో ఉందంటే అనుక్షణం యువత అందులోనే లీనమైపోయి ఉన్నారు.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

మార్క్ జుకర్‌బర్గ్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 12 పగని హుయెరా అనే కారుకి కలిగి ఉన్నాడు. ఇది మాత్రమే కాకుండా హోండా జాజ్ కూడా కలిగి ఉన్నాడు.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

వారెన్ బఫెట్: కాడిలాక్ ఎక్స్‌టిఎస్

బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ ఛైర్మన్ 'వారెన్ బఫెట్'. ఇతని అసలు పేరు వారెన్ ఎడ్వర్డ్ బఫెట్. డబ్బు ఎలా సంపాదించాలి అని చెప్పిన ప్రముఖులలో ఒకరు వారెన్ బఫెట్. ఇతడు చిన్నప్పటి నుంచే ఎంతగానో కస్టపడి డబ్బును సంపాదించేవాడు.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

ఎన్నెనో సాహసాలు చేసి ఈ రోజు టాప్ 10 బిలినియర్లలో ఒకరుగా ఎదిగిన వారెన్ బఫెట్ ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఇతడు కాడిలాక్ ఎక్స్‌టిఎస్‌ అనే కారుని కలిగి ఉన్నాడు. ఈ కారు గురించి తెలియని వారు ఇక్కడ గమనించవచ్చు.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

లారీ పేజ్ / సెర్గీ బ్రిన్: టెస్లా రోడ్‌స్టర్, టయోటా ప్రియస్

గూగుల్ వ్యవస్థాపకులయిన లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ ఇద్దరూ కూడా టాప్ 10 బిలినియర్ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ ఇద్దరికి కూడా గతంలో ఒకేలాంటి కార్లు ఉండేవి. అవి టెస్లా రోడ్‌స్టర్ మరియు టయోటా ప్రియస్ కార్లు.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

లారీ ఎలిసన్: లెక్సస్ ఎల్ఎఫ్ఎ, మెక్లారెన్ ఎఫ్1, లెక్సస్ ఎల్ఎస్600హెచ్

లారీ ఎలిసన్ అమెరికన్ బిజినెస్ మ్యాన్ అంతే కాకుండా ఇతడు కంప్యూటర్ కి సంబంధించిన ఒరాకిల్ స్థాపించడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బును ఆర్జించి ప్రపంచ కుబేరుల్లో ఒకడుగా నిలదొక్కుకున్నాడు. దీని కారణంగానే ఇతడికి ఇప్పుడు 65 ​​బిలియన్ డాలర్లకు పైగా డబ్బును కలిగి ఉన్నారు.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

లారీ ఎలిసన్ అత్యంత విలాసవంతమై కార్లను కూడా కలిగి ఉన్నాడు. ఇందులో మెక్‌లారెన్ ఎఫ్ 1 మరియు లెక్సస్ ఎల్‌ఎఫ్‌ఎ వంటివి ఉన్నాయి. లారీ ఎలిసన్ తా రోజువారీ ఉపయోగం కోసం లెక్సస్ ఎల్ఎస్600హెచ్ కొనుగోలు చేసాడు. ఇది వాహా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

ముఖేష్ అంబానీ: మేబాచ్ 62

అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్న కుబేరుల్లో అంబానీ ఫ్యామిలీ ఒకటి. ముఖేష్ అంబానీ టాప్ 10 ధనవంతుల్లో ఒకరుగా ఉన్నారు. ముఖేష్ అంబానీ పేరు వినని వారు దాదాపు ఎవ్వరూ ఉండరు. ముఖేష్ అంబానీ అత్యత ఖరీదైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

ముఖేష్ అంబానీ యొక్క కార్ల విషయానికి వస్తే, ఇతని వద్ద రోల్స్ రాయిస్, ఆస్టన్ మార్టిన్స్ మరియు బిఎమ్‌డబ్ల్యూలు వంటి చాలా లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. అయితే వీటిలో ఒకటి మాత్రం వాటి నుండి భిన్నంగా ఉంది. ఇది అతని భార్య తన పుట్టినా రోజు సందర్భంగా ఇచ్చిన మేబాచ్ 62.

ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్లు నడిపే కార్లు ఒక్కసారైనా చూసారా.. అయితే ఇది చూడండి

అమాంసియో ఆర్టిగా: ఆడి ఎ8, మెర్సిడెస్ జిఎల్

స్పానిష్ దేశానికి చెందిన 'అమాంసియో ఆర్టిగా' ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరు. ఇతడు ఇండిటెక్స్ ఫ్యాషన్ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్. ఇతడు ఇప్పటివరకు కూడా కేవలం మూడు ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. అమాంసియో ఆర్టిగా ఆడి బ్రాడ్ యొక్క ఏ8 మరియు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జిఎల్‌ వంటి వాటిని కలిగి ఉన్నట్లు తెలిసింది.

Most Read Articles

English summary
World’s Top 10 Billionaires Cars. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X