భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఇవే..!

By Anil

దేశీయంగా వాయు సేవలు రోజు రోజుకీ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఇది దేశ ప్రజలకు విమాన సేవలు మరింత చేరువ చేసేందుకే కాకుండా దేశ ఆధాయంలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశీయంగా వాయు సేవలు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో అని చెప్పడానికి ఈ రెండు అంశాలు చాలు.
Also Read: ఈ ఎయిర్‌పోర్ట్ రన్‌వెేల మీద దిగితే కచ్చితంగా గుండె జారి గల్లంతవుతుంది.
అదే విధంగా దేశీయంగా గల చాలా నగరాలకు ఈ వాయు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అలా దేశ వ్యాప్తంగా చాలా వరకు విమానాశ్రయాలలో రద్దీ నానాటికీ పెరుగుతూ వస్తోంది. నేడు పాఠకుల కోసం దేశ వ్యాప్తంగా అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాల గురించి క్రింది శీర్షిక ద్వారా అందిస్తున్నాము.

10. పూనే ఎయిర్‌పోర్ట్

10. పూనే ఎయిర్‌పోర్ట్

దేశ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాలలో పూనే ఎయిర్ ‌పోర్ట్ పదవ స్థానంలో నిలిచింది. 2,535 మీటర్లు పొడవు గల కేవలం ఒక్క రన్‌వే మాత్రమే ఉంది.

భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా దాదాపుగా 41.9 లక్షల మధ్య రాకపోకలు సాగించారు.

09. గోవా ఎయిర్‌పోర్ట్

09. గోవా ఎయిర్‌పోర్ట్

దేశీయంగా గోవా చక్కటి సముద్ర తీరాన్ని కలిగి ఉండటం ద్వారా గోవాకు పర్యాటకులు తాకిడి ఎక్కువ. అందుకే గోవా అనగానే పర్యాటక ప్రాంతం అని గుర్తొస్తుంది. గోవాలో 1955లో 680 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎయిర్ పోర్ట్‌ను నిర్మించారు.

భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

ప్రస్తుతం గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు పెద్ద టెర్మినల్స్‌ ఉన్నాయి. ఈ విమానాశ్రయానికి దాదాపుగా 15 విమానయాన సంస్థవలకు చెందిన విమానాలు సేవలు అందిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 45.1 లక్షల మంది ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా ప్రయాణం సాగించారని గణాంకాలు చెబుతున్నాయి.

08. సర్ధార్ వల్లభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం-అహ్మదాబాద్

08. సర్ధార్ వల్లభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం-అహ్మదాబాద్

గుజరాత్‌లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయంగా అత్యంత రద్దీగల విమానాశ్రయాల టాప్-10 జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇది దాదాపుగా 3,599 మీటర్లు పొడవుగల రన్‌వేను మరియు నాలుగు టెర్మనల్స్‌ను కలిగి ఉంది.

భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

గత ఆర్థిక సంవత్సరంలో 50.5 లక్షల మంది ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా ప్రయాణించారు. అందులో దాదాపుగా 12.16 లక్షల మంది అంతర్జాతీయంగా ప్రయాణించారు మరియు మిగిలిన వారు దేశీయంగా ప్రయాణించారు. ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా 15 వరకు ప్యాసింజర్ మరియు కార్గో ఎయిర్‌లైన్స్ సంస్థలు సేవలు అందిస్తున్నారు.

07. కొచ్చిన అంతర్జాతీయ విమానాశ్రయం

07. కొచ్చిన అంతర్జాతీయ విమానాశ్రయం

టాప్-10 జాబితాలో ఏడవ స్థానంలో ఉంది కొచ్చిన అంతర్జాతీయ విమానాశ్రయం. కేరళలో అతి గల అతి పెద్ద ఎయిర్ పోర్ట్ అయిన దీనిని 1999 లో నిర్మించారు. ఇందులో మూడు టెర్మినల్స్ కలవు.

భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

గత ఆర్థిక సంవత్సరంలో కొచ్చిన అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 64.14 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.

06. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం- హైదరాబాద్

06. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం- హైదరాబాద్

దేశ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉన్న టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ ఆరవ స్థానంలో నిలిచింది. ఈ ఎయిర్ పోర్ట్‌ను పూర్తి స్థాయి హంగులతో 2008 లో ప్రారంభించారు. ఇది 5,000 ఎకరాలకు పైబడి విస్తరించి ఉంది.

భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో గల సింగిల్ టెర్మినల్ కలదు. మరియు ఈ ఎయిర్ పోర్ట్‌కు గోల్డెన్ పికాక్ ఎన్విరాన్‌మెంట్ అవార్డు కూడా వచ్చింది. దీనికి ఒక లక్ష మెట్రిక్ టన్నుల కార్గో సరుకులను నిర్వహించే సామర్థ్యం కలదు. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 1.04 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఎయిర్ పోర్ట్ సేవలు వినియోగించుకున్నారు.

05. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయ-కలకత్తా

05. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయ-కలకత్తా

టాప్-10 జాబితాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఐదవ స్థానానికి ఎంపికైంది. ఈ ఎయిర్ పోర్ట్ దాదాపుగా 2,400 ఎకరాల విస్తీర్ణంలో కలదు.

భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

తూర్పు భారత దేశంలో గల ఏకైక అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఇది మరియు ఎంతో ముఖ్యమైనది కూడా. ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా గత ఏడాది దాదాపుగా 1.09 కోట్ల మంది ప్రయాణికులు సాగించారు.

04. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం

04. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం

నాలుగవ స్థానంలో ఉన్న చెన్నై ఎయిర్ పోర్ట్ మూడు రన్‌వేలను, మూడు టెర్మినల్స్ ‌తో 1,200 ఎకరాలలో విస్తరించి ఉంది. ప్రతిరోజు కూడా దాదాపుగా 300 వరకు విమానాలు వస్తుపోతుంటాయి. ఈ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా దాదాపుగా 50 వరకు దేశీయ మరియు అంతర్జాతీయ ఎయిర్ లైన్స్‌ సంస్థలు సేవలు అందిస్తున్నాయి.

భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

చెన్నై విమానాశ్రయం ఏడాదికి కాస్త అటు ఇటుగా 1.42 కోట్ల మందికి సేవలు అందిస్తోంది. ఇందులో దాదాపుగా 47.07 లక్షలు అంతర్జాతీయ ప్రాంతాలకు మరియు 95.92 లక్షల మంది దేశీయంగా ప్రయాణం చేశారని గణాంకాలు చెబుతున్నాయి.

03. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం-బెంగళూరు

03. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం-బెంగళూరు

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయంగా అతి పెద్ద మూడల రద్దీ ఎయిర్ పోర్ట్‌గా ఎంపిక అయింది. దీని నిర్మాణం 2005 లో మొదలు పెట్టి 2008 లో పూర్తి చేశారు. దాదాపుగా 4,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇందులో 4,000 మీటర్లు పొడవున్న రన్‌వే, 38 గేట్లు, 20 ఏరో వంతెనలు మరియు 2000 కార్ల వరకు పార్కింగ్ సామర్థ్యం ఉంది.

భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్ లిమిటెడ్ (BIAL) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా గత ఏడాదిలో దాదాపుగా 1.54 కోట్ల మంది విమానయాన సేవలు వినియోగించుకున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ 40 వరకు దేశీయ మరియు అంతర్జాతీయ ఎయిర్‌‌లైన్స్ సంస్థలు సేవలు అందిస్తున్నాయి.

02. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం -ముంబాయ్

02. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం -ముంబాయ్

దేశీయంగా ఎక్కువ రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాలలో ముంబాయ్ ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రెండవ స్థానంలో ఉంది. ఇది దాదాపుగా 750 హెక్టార్ల వరకు విస్తరించి ఉంది. సిఎస్‍‌ఐఎ ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ఎయిర్‌పోర్ట్ ‌లో రెండు రన్‌వేలు కలవు, అందులో ఒకటి 3,660 మీటర్లు పొడవు కలదు మరొకటి 2,990 మీటర్ల పొడవు కలదు.

భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

ఏడాదికి ఈ ఎయిర్‌పోర్ట్ నుండి దాదాపుగా 70,000 వరకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మరియు గత ఏడాదిలో 3.66 కోట్ల మంది ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా విమానయాన సేవలు వినియోగించుకున్నారు.

01. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

01. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

దేశ వ్యాప్తంగా గల అన్ని అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ రద్దీ విషయంలో మొదటి స్థానంలో నిలిచింది. దాదాపుగా 5,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎయిర్‌పోర్ట్‌లో మూడు టెర్మినల్స్, మూడు రన్‌‌వేలు కలవు మరియు ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా 70 వరకు జాతీయ మరియు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ సేవలను అందిస్తున్నాయి.

భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు

గత ఏడాదిలో దాదాపుగా 4.09 కోట్ల మంది ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా విమానయాన సేవలు వినియోగించుకున్నారు. అందులో 1.35 కోట్లు అంతర్జాతీయంగా మరియు 2.7 కోట్ల మంది దేశీయంగా ప్రాంతాలకు ప్రయాణించారు. అయితే ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రపంచ వ్యాప్తంగా నెం.1 ఎయిర్‌పోర్ట్ గా నిలిచింది. దీనికి సంభందించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు
  • పైలట్ మరియు విమాన సిబ్బంది చేసే 20 చీకటి నిజాలు
  • 170 సంవత్సరాల ఇండియన్ రైల్వే చరిత్రలో :49 ఆసక్తికరమైన నిజాలు
  • టైటానిక్-2 షిప్ వస్తోంది, టైటానిక్-1 గురించి మరచిపోండి

Most Read Articles

English summary
Top 10 Busiest International Airports in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X