వర్షాకాలం వచ్చేసింది.. మరి మీ కారులో ఈ టాప్ 10 యాక్ససరీలు ఉన్నాయా..? లేకపోతే, వెంటనే కొనుక్కోండి!

మాన్‌సూన్ (వర్షాకాలపు) సీజన్ వచ్చేసింది మరియు ఈ వర్షాకాలానికి తగినట్లు మీరు మీ కారును సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా, వర్షాకాలంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను అధిగమించడానికి తప్పనిసరిగా మీ కారులో కొన్ని యాక్ససరీలు ఉండాలి. వీటి సాయంతో వర్షాకాలంలో మీ ప్రయాణం సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా సాగిపోతుంది. ఇవన్నీ కూడా బయటి మార్కెట్లో కార్ యాక్ససరీస్ విక్రయించే షాపులలో లభిస్తాయి. మరి ఆ యాక్ససరీల వివరాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

వర్షాకాలం వచ్చేసింది.. మరి మీ కారులో ఈ టాప్ 10 యాక్ససరీలు ఉన్నాయా..? లేకపోతే, వెంటనే కొనుక్కోండి!

1. రెయిన్ వాటర్ రిపెల్లెంట్

వర్షాకాలంలో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలలో రెయిన్ వాటర్ రిపెల్లెంట్ కూడా ఒకటి. దీనిని విండ్‌షీల్డ్‌పై అప్లయ్ చేయడం వలన, విండ్‌షీల్డ్ పై పడే వర్షపు నీరు అక్కడే నిలిచిపోకుండా క్రిందకు జారిపోతుంది. విండ్‌షీల్డ్ పై ఈ ద్రవాన్ని వర్తింపజేయడం వల్ల వర్షాల సమయంలో విజిబిలిటీ బాగా మెరుగుపడుతుంది. ఎందుకంటే మీరు అప్లయ్ చేసే రెయిన్ వాటర్ రిపెల్లెంట్ లిక్విడ్ విండ్‌షీల్డ్ పై హైడ్రోఫోబిక్ షీల్డ్‌ను ఏర్పరుస్తుంది. ఫలితంగా, ఇది వర్షపు నీటిని విండ్‌షీల్డ్ ఉపరితలంపై అంటుకోకుండా చేస్తుంది.

వర్షాకాలం వచ్చేసింది.. మరి మీ కారులో ఈ టాప్ 10 యాక్ససరీలు ఉన్నాయా..? లేకపోతే, వెంటనే కొనుక్కోండి!

2. సైడ్ మిర్రర్ యాంటీ ఫాగ్ ఫిల్మ్

వర్షాకాలంలో సైడ్ మిర్రర్ పై పడే వర్షపు నీరు లేదా టైర్ల నుండి స్ప్లాష్ అయ్యే బురద నీటి కారణంగా సైడ్ మిర్రర్స్ పై నీరు నిలిచిపోయి విజిబిలిటీ తగ్గిపోతుంది. ఫలితంగా, వెనుక నుండి వచ్చే వాహనాలను గుర్తించడం కష్టంగా మారుతుంది. ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి మార్కెట్లో లభ్యమయ్యే యాంటీ-ఫాగ్ ఫిల్మ్‌లను ఉపయోగించవచ్చు. వీటిని సైడ్ మిర్రర్లపై అంటించడం ద్వారా వాటిపై వర్షపు నీరు నిలబడదు, ఫలితంగా వర్షంలో కూడా విజిబిలిటీ మెరుగుపడుతుంది.

వర్షాకాలం వచ్చేసింది.. మరి మీ కారులో ఈ టాప్ 10 యాక్ససరీలు ఉన్నాయా..? లేకపోతే, వెంటనే కొనుక్కోండి!

3. వాటర్‌ప్రూఫ్ బాడీ కవర్

ఏకాలమైనా సరే కారును సరైన బాడీ కవర్ ఉపయోగించి కవర్ చేసుకుంటే దాని జీవితకాలం పెరుగుతుంది మరియు పెయింట్ కూడా ఎక్కువ కాలం మన్నుతుంది. ప్రత్యేకించి, వర్షాకాలంలో వాటర్‌ప్రూఫ్ కార్ బాడీ కవర్‌ను ఉపయోగించడం చాలా మంచిది. అందులోనూ మీరు మీ కారును ఆరుబయట పార్క్ చేయాల్సి వస్తే, ఇది వర్షపు నీటి వలన మీ కారుకి కిలిగే డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తుంది. వర్షాకాలంలో కార్ కవర్ ఉపయోగించడం వలన కారు బయటి భాగం చాలా వరకూ శుభ్రంగా ఉంటుంది మరియు తడి కారణంగా కారు తుప్పు పట్టడాన్ని నిరోధిస్తుంది.

వర్షాకాలం వచ్చేసింది.. మరి మీ కారులో ఈ టాప్ 10 యాక్ససరీలు ఉన్నాయా..? లేకపోతే, వెంటనే కొనుక్కోండి!

4. రెయిన్ వైజర్

వర్షంలో బయటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడే వ్యక్తులలో మీరు కూడా ఒకరైతే, ఈ యాక్ససరీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చినుకులు పడుతున్నప్పుడు ఎవ్వరూ ధైర్యం చేసి కారు సైడ్ విండోస్‌ని క్రిందకు దించరు. ఇలా చేస్తే వర్షపు నీరు నేరుగా కారులోకి ప్రవేశిస్తుంది. అయితే, కారుకి రెయిన్ వైజర్లను ఉపయోగించినట్లయితే, కారు అద్దాలను కొద్దివరకు క్రిందకు దించుకొని, బయట చల్లటి వాతావరణాన్ని మీరు కూడా కారులో నుండే ఆస్వాదించవచ్చు. అద్దాలు క్రిందకు దించినప్పటికీ, ఇవి వర్షపు నీటిని కారు లోపలకి ప్రవేశించకుండా చేస్తాయి మరియు విండోలను ఫాగింగ్ నుండి కూడా నిరోధిస్తాయి.

వర్షాకాలం వచ్చేసింది.. మరి మీ కారులో ఈ టాప్ 10 యాక్ససరీలు ఉన్నాయా..? లేకపోతే, వెంటనే కొనుక్కోండి!

5. కారు వ్యాక్స్

కారుకి సరైన వ్యాక్స్ అప్లయ్ చేయడం వలన కారు ఉపరితలంపై ధూళి అంటుకోదు. అలాగే, కొన్ని నాణ్యమైన కార్ వ్యాక్స్ లు స్ప్లాష్ ప్రూఫ్ ని కూడా కలిగి ఉంటాయి. ఇలాంటి కార్ వ్యాక్స్ లను కారు ఉపరితలంపై అప్లయ్ చేయడం కారుపై వర్షపు నీరు సులువుగా జారిపోతుంది మరియు నీటి మరకలు ఏర్పడకుండా చేస్తుంది. అయితే, గుర్తుంచుకోండి కార్ వ్యాక్స్ ని కేవలం కారు బాడీ పార్ట్స్ పై మాత్రమే అప్లయ్ చేయాలి. విండ్‌షీల్డ్ సైడ్ మిర్రర్స్ మరియు సైడ్ విండో గ్లాస్ లపై కార్ వ్యాక్స్ అప్లయ్ చేయకూడదు.

వర్షాకాలం వచ్చేసింది.. మరి మీ కారులో ఈ టాప్ 10 యాక్ససరీలు ఉన్నాయా..? లేకపోతే, వెంటనే కొనుక్కోండి!

6. రబ్బర్ ఫ్లోర్ మ్యాట్స్

వర్షాకాలంలో కారు లోపల తరచుగా పాడయ్యేవి ఫ్లోర్ మ్యాట్స్. మీ కారులో ఫ్యాబ్రిక్ లేదా సాఫ్ట్ ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నట్లయితే, వాటిని తొలగించి వాటి స్థానంలో రబ్బర్ ఫ్లోర్ మ్యాట్స్ ని ఉపయోగించండి. ఎందుకంటే, రబ్బర్ ఫ్లోర్ మ్యాట్స్ పై ఏర్పడే మురికి, బురదను క్లీన్ చేయడం చాలా సులభం. వీటిని కారు నుండి విడిగా తీసి ట్యాప్ క్రింద కానీ లేదా ప్రెజర్ వాష్ తో సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. నాణ్యమైన రబ్బరు ఫ్లోర్ మ్యాట్‌లు యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఫంగల్ పూతలతో కూడా వస్తాయి.

వర్షాకాలం వచ్చేసింది.. మరి మీ కారులో ఈ టాప్ 10 యాక్ససరీలు ఉన్నాయా..? లేకపోతే, వెంటనే కొనుక్కోండి!

7. మైక్రోఫైబర్ క్లాత్

సాధారణ క్లాత్‌లతో పోలిస్తే మైక్రోఫైబర్ క్లాత్ కారును సులభంగా శుభ్రం చేయడంలో సహాయపడటమే కాకుండా మైక్రోఫైబర్ క్లాత్‌ను ఉపయోగించడం వల్ల కార్లపై పడే నీటి గుర్తులు మరియు చిన్నపాటి గీతలను నివారిస్తుంది. అంతేకాకుండా, ఈ మైక్రోఫైబర్ క్లాత్‌లు ఇతర సాధారణ క్లాత్ ల కంటే చాలా ఎక్కువ నీటిని పీల్చుకోగలవు. కాబట్టి, వర్షాకాలంలో మీరు మీ కారులో ఉంచుకోవాల్సిన ప్రధాన యాక్ససరీలలో ఈ మైక్రోఫైబర్ క్లాత్ కూడా ఒకటని గుర్తుంచుకోండి.

వర్షాకాలం వచ్చేసింది.. మరి మీ కారులో ఈ టాప్ 10 యాక్ససరీలు ఉన్నాయా..? లేకపోతే, వెంటనే కొనుక్కోండి!

8. కార్ ఎయిర్‌ ఫ్రెషనర్ లేదా కార్ పెర్ఫ్యూమ్

వర్షాకాలంలో, క్యాబిన్‌ లోపల తేమ అధికంగా ఉంటుంది. తడిచిన దుస్తులతో కారు లోకి ప్రవేశించడం మరియు గాలిలో ఉండే తేమ కారణంగా కారు క్యాబిన్ లోపల ఓ రకమైన దుర్వాసన వస్తుంది. కాబట్టి, ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి మీకు కారులో మంచి నాణ్యమైన కార్ ఫ్రెషనర్ లేదా కార్ పెర్ఫ్యూమ్ ఎంతో అవసరం. కార్ ఫ్రెషనర్‌లు క్యాబిన్ లోపల మంచి సువాసనను వెదజల్లడమే కాకుండా, మీ మనస్సుకు మంచి ఉల్లాసాన్ని కూడా ఇస్తుంది.

వర్షాకాలం వచ్చేసింది.. మరి మీ కారులో ఈ టాప్ 10 యాక్ససరీలు ఉన్నాయా..? లేకపోతే, వెంటనే కొనుక్కోండి!

9. సిలికా జెల్ ప్యాకెట్లు

సిలికా జెల్ ప్యాకెట్లు లేదా షాచెట్‌లు మార్కెట్‌లో సులభంగా లభిస్తాయి. మీరు గమనించినట్లయితే, కొత్తగా మీరు కొనుగోలు చేసే గృహోపకరణాలలో తయారీదారులు సిలికా జెల్ ప్యాకెట్లను ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే, ఈ ప్యాకెట్లు అధిక తేమను గ్రహించగలవు. కాబట్టి, బాక్స్ లోపల ఏర్పడే తేమను ఇవి సులభంగా గ్రహిస్తాయి. ఇవి వర్షాకాలంలో మీ కారు క్యాబిన్ లోపల ఏర్పడే దుర్వాసనను కూడా నివారిస్తాయి.

వర్షాకాలం వచ్చేసింది.. మరి మీ కారులో ఈ టాప్ 10 యాక్ససరీలు ఉన్నాయా..? లేకపోతే, వెంటనే కొనుక్కోండి!

10. గొడుగు

వర్షాకాలంలో అతి ముఖ్యమైన యాక్ససరీ గొడుగు. వర్షాకాలంలో కార్లలో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా గొడుగు ఉండేలా చూసుకోండి. వర్షంలో మీరు కారులో నుండి బయటకు తడవకుండా రావడానికి మరియు మీ కారు వద్దకు తడవకుండా చేరుకోవడానికి గొడుకు ఎంతగానో సహకరిస్తుంది. కేవలం వర్షాకాలంలోనే కాకుండా వేసవిలో కూడా ఈ గొడుకు మీకు వేసవి తాపం నుండి రక్షణ కల్పిస్తుంది.

Most Read Articles

English summary
Top 10 car accessories that you need to have in monsoon season
Story first published: Friday, July 22, 2022, 17:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X