భారత్‌లో టాప్ 10 ఫ్లాప్ కార్లు: కారణం ఏంటి?

By Ravi

సినీ పరిశ్రమలో హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు ఏలా ఉంటాయో.. ఆటోమొబైల్ పరిశ్రమలో కూడా హిట్ కార్లు, ఫ్లాప్ కార్లు ఉంటాయి. సాధారణంగా కార్లు వాటి జీవితకాలం ముగిసాక కంపెనీ సదరు మోడల్ ఉత్పత్తిని నిలిపివేయటం జరుగుతుంది.

అలా ఇప్పటికే మారుతి 800, అంబాసిడర్, హ్యుందాయ్ శాంత్రో వంటి కార్లు చరిత్రలో కలిసిపోయాయి. ఇలాంటి కార్లకు ఇప్పటికీ డిమాండ్ ఉన్నప్పటికీ, కంపెనీలు మాత్రం వీటిని ఉత్పత్తి చేయటాన్ని నిలిపివేశాయి. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ.

కానీ, కొన్ని రకాల కార్లు మాత్రం మార్కెట్లోకి వచ్చిన కొన్ని సంవత్సరాలకే మార్కెట్ నుంచి తొలగిపోయే పరిస్థితి నెలకొంది. వీటినే మనం ఫ్లాప్ కార్లుగా చెప్పుకోవచ్చు. కొత్త మోడల్ అయినా సరకే కస్టమర్లకు నచ్చకపోతే మార్కెట్ నుంచి తొలగిపోవాల్సిందే.

మరి ఈనాటి మన కార్ టాక్ కథనంలో అలా మార్కెట్ నుంచి తొలగిపోయిన టాప్ 10 ఫ్లాప్ కార్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

10. మహీంద్రా వెరిటో వైబ్

10. మహీంద్రా వెరిటో వైబ్

చిన్న కార్లపై (పొడవులో 4 మీటర్ల కన్నా తక్కువగా ఉన్న కార్లపై) భారత ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న ఎక్సైజ్ రాయితీలను పొందాలనే ఉద్దేశ్యంతో మహీంద్రా అందిస్తున్న వెరిటో సెడాన్ తోకను (బూట్ స్పేస్)ని కత్తిరించి ఈ వెరిటో వైబ్‌ను తయారు చేశారు. అయితే, వెరిటో సెడాన్‌కు లభించిన ఆదరణ వెరిటో వైబ్‌కి లభించలేదు. దీని ఫ్లాప్‌‍కి ప్రధాన కారణంగా దీని డిజైన్ అని చెప్పవచ్చు.

9. మహీంద్రా క్వాంటో

9. మహీంద్రా క్వాంటో

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఆ సెగ్మెంట్లో కూడా తమ సత్తా ఏంటో చూపాలనే ఉద్దేశ్యంతో మహీంద్రా అందిస్తున్న జైలో ఎమ్‌పివిని ఆధారంగా చేసుకొని ఈ క్వాంటో అనే కాంపాక్ట్ ఎస్‌యూవీని డిజైన్ చేశారు. కానీ, ఇది కస్టమర్లను ఆకట్టుకోవటంలో భారీగా విఫలమైంది. దీని ఫ్లాప్‌కి కారణం డిజైన్, మైలేజ్, పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లేకపోవటంగా చెప్పుకోవచ్చు.

8. మారుతి సుజుకి కిజాషి

8. మారుతి సుజుకి కిజాషి

మారుతి సుజుకి అందిస్తున్న ఇంపోర్టెడ్ కారు సుజుకి కిజాషి కూడా కస్టమర్లను ఆకట్టుకోవటంలో విఫలమైంది. బడ్జెట్ కార్ మేకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతి ప్రీమియం కార్ మార్కెట్లో నిలబడలేకపోయింది. సుజుకి కిజాషిని విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించడంతో దీని ధర అధికంగా ఉండేది. అందుకే ఇప్పుడు ఇది మార్కెట్ నుంచి పూర్తిగా తొలగిపోయింది.

7. స్కొడా ఫ్యాబియా

7. స్కొడా ఫ్యాబియా

ఒకప్పుడు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అంటే ఆ సెగ్మెంట్లో ముందుగా గుర్తుకు వచ్చేది స్కొడా ఫ్యాబియానే. అప్పట్లో వరల్డ్ క్లాస్ ఇంటీరియర్స్‌తో లభ్యమయ్యే ఏకైక హ్యాచ్‌బ్యాక్ ఇదొక్కటే అనొచ్చు. స్కొడా కార్లంటేనే ప్రీమియం ఫీచర్లను అంతే ప్రీమియం ధరను కలిగి ఉంటాయి. భారత్‌లో స్కొడా ఫ్యాబియా వైఫల్యానికి కూడా ఇదే కారణం. ప్రస్తుతం మార్కెట్లో సరసమైన ధరకే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు లభిస్తుండటంతో ఆ పోటీని తట్టుకోలేక ఫ్యాబియా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే, ఇందులో ఓ కొత్త వెర్షన్ రావచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

6. టాటా సూమో గ్రాండ్

6. టాటా సూమో గ్రాండ్

టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ అండ్ రగ్గడ్ టాటా సుమోకి లభించిన ఆదరణ, ఆదే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన టాటా సుమో గ్రాండ్‌కి మాత్రం లభించలేదు. ఇప్పుడు కంపెనీ ఈ మోడల్‌ను టాటా మూవస్ అని పేరు మార్చి విక్రయిస్తోంది. పేరు మారినా సుమో గ్రాండ్ ఫేట్ మాత్రం మారలేదు. దీని ఫ్లాప్‌కి కారణం దీని డిజైన్ అని చెప్పుకోవచ్చు.

5. ఫోర్డ్ ఫ్యూషన్

5. ఫోర్డ్ ఫ్యూషన్

ఫోర్డ్ ఫియస్టా (పాత తరం) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఫోర్డ్ ఫ్యూజన్‌ను తయారు చేశారు. ఇది ఎస్టేట్-కమ్-ఎమ్‌పివి వాహనంలా అనిపిస్తుంది. విశిష్టమైన లుక్ విశాలమైన స్పేస్ కలిగి ఉన్నప్పటికీ, ఇది భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో సర్వైవ్ కాలేకపోయింది. బోరింగ్ డిజైన్ వల్లనే ఈ మోడల్ కూడా మార్కెట్ నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పొచ్చు.

4. షెవర్లే ఎస్ఆర్‌వి

4. షెవర్లే ఎస్ఆర్‌వి

షెవర్లే ఎస్ఆర్‌వి వాస్తవానికి ఓ పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్. అప్పట్లో 100 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్ కలిగి ఉన్న ఏకైక హ్యాచ్‌బ్యాక్ ఇదొక్కటే. అయితే, దీని ధర కూడా అధికంగా ఉండేది. ఇది 12.9 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేది. అయితే, దీని అధిక ధర, మైలేజ్ వంటి అంశాల కారణంగా ఇది మార్కెట్లో విజయం సాధించలేకపోయింది.

3. ఓపెల్ వెక్ట్రా

3. ఓపెల్ వెక్ట్రా

ఒకప్పట్లో ఓపెల్ కార్లు స్టేటస్ సింబల్‌గా ఉండేవి. కానీ ఓపెల్ వెక్ట్రా కారు డిజైన్ మాత్రం అంతగా ఆకట్టుకునేలా ఉండేది కాదు. పైపెచ్చు ఈ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించాల్సి రావటంతో దీని ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. ఈ రెండు కారణాల వలన ఇది మార్కట్ నుంచి తొలగి పోవాల్సి వచ్చింది.

2. మారుతి బాలెనో ఆల్టురా

2. మారుతి బాలెనో ఆల్టురా

మారుతి బాలెనో సెడాన్ సక్సెస్ అయినంతగా బాలెనో ఆల్టురా సక్సెస్ కాలేకపోయింది. బాలెనో సెడాన్‌కి ఎస్టేట్ వెర్షనే బాలెనో ఆల్టురా. వాస్తవానికి మారుతి బాలెనో ఆల్టురా ఎస్టేట్ విశాలమైన ఇంటీరియర్ స్పేస్ కలిగి ఉన్నప్పటికీ, దాని డిజైన్ మాత్రం కస్టమర్లకు నచ్చేది కాదు. బహుశా అందుకే ఇది మార్కెట్ నుంచి తొలగిపోవాల్సి వచ్చిందేమో.

1. ప్యూజో 309

1. ప్యూజో 309

ప్యూజో 309 కారుని మొదట్లో ఆదరించినప్పటికీ, ఆ కంపెనీ సర్వీస్, డీలర్ నెట్‌వర్క్ సరిలేని కారణంగా ఇది ఇండియన్ మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. ఇది 1.4 లీటర్, 70 బిహెచ్‌పి, 110 ఎన్ఎమ్ టార్క్ పెట్రోల్ ఇంజన్‌తోను మరియు 1.5 లీటర్, 57 బిహెచ్‌పి, 97 ఎన్ఎమ్ టార్క్ డీజిల్ ఇంజన్‌తోను లభించేంది.

భారత్‌లో టాప్ 10 ఫ్లాప్ కార్లు

ఇవి కాకుండా మీకు తెలిసిన ఫ్లాప్ కార్లు ఏవైనా ఉంటే, క్రింది కామెంట్ బాక్సులో మా పాఠకులతో మీ అభిప్రాయాన్ని పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, March 19, 2015, 18:34 [IST]
English summary
We take a look at 10 cars that have failed to make an impression in the country's automobile market over the years. That some of these cars saw poor success came as a surprise even to industry experts-let's get right into the (black) list.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+