మహిళలు అత్యధికంగా ఇష్టపడుతున్న టాప్ 10-కార్లు
ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కొత్త కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో కొన్ని బాగా పేరుగడిస్తున్నాయి మరికొన్ని ప్రజల మన్ననలను పొందలేక పోతున్నాయి.అయితే దీనికి ముఖ్య కారణం కొన్నింటి యొక్క డిజైన్ మరియు రూపము వారికి నచ్చకపోవడం వలన అని చెప్పవచ్చు.
ఆటో మొబైల్ తయారుదారులు మాత్రం ఎంతో సమయం వెచ్చించి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎప్పటికప్పుడు కొత్త వాటిని తయారు చేస్తూనే ఉన్నారు. అయితే ఇది ఎంతో శ్రమతో కూడుకున్నదని చెప్పాలి ఎందుకంటే ఇది అంత సులభంకాదు.
ఇక్కడ అసాధారణమైన మరియు విలాసవంతమైన ప్రపంచవ్యాప్త బ్రాండ్ల ఉన్నాయి. వీటిలో ఎక్కువ మంది మహిళలు ఉపయోగిస్తున్న టాప్ 10-కార్లు మీ కోసం.మరింత సమాచారం కోసం ఇక్కడ గల స్లైడ్స్ క్లిక్ చేయండి.

10.జీప్ రాంగ్లర్ :
ఈ మధ్య ఎక్కువ మంది మహిళలు ఆఫ్-రోడ్ వాహనాలను ఇష్టపడుతున్నారు కేవలం ఆఫ్-రోడ్ వాహనాలనే కాదు ఒపెన్ టాప్ వాహనాలను కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వాంగ్లర్ జీప్ ఇప్పటి వెహికల్ కాదు కాని దీనిని బాగా ఆధునీకరించిన తరువాత మార్కెట్‌లోకి విడుదల చేసినతరువాత ఎక్కువ మంది మహిళలు దీనిని ఇష్టపడుతున్నట్లు తెలిసింది.

9.హమ్మర్ :
కొన్ని సంవత్సరాలుగా హమ్మర్ తన వైవధ్యమైన మోడళ్లను మార్కెట్లోకి పరిచయం చేస్తూనే ఉంది. ఎవరయితే ఇతరుల మీద పెత్తనం మరియు ఆధిపత్యం చెలాయిస్తారో వారకి సంభందం లేకుండా ఉండే వ్యక్తుల కోసం దీనిని అభివృద్ధిపరిచినట్లు చెబుతున్నారు. హమ్మర్ వాహనం ఒక భారీ మరియు సంయుక్తంగా పోరాటాల కోసం దీనిని ఉపయోగిస్తారని తెలిసింది. బహుశా ఇన్ని కారణాలు ఉండటం వలన అనుకుంటాం మహిళలు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

8.బిఎమ్‌డబ్ల్యు ఎమ్6 క్యాబ్రియోలెట్ :
మహిళలు ఎక్కువగా రూఫ్ లేని కార్లను ఉపయోగిస్తారు ఎందుకంటే సూపర్ కార్ అని చెప్పుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం అయి ఉండవచ్చు. దీనికి బిఎమ్‌డబ్ల్యు నుండి వచ్చిన ఎమ్6 క్యాబ్రియోలెట్‌ను ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఫాస్ట్ కార్, పైకప్పు ఓపెన్‌లో , జుట్టు గాలిలో ఎగురుతూ ఉంటే నిజంగా ఒక దేశానికి రాణిలా ఉండే అనుభూతిని ఇస్తుంది.

7.మసెరటి :
మంచి జీవనశైలికి తగ్గట్లుగా కార్లను డిజైన్ చేయండి ఇటాలియన్స్‌కే బాగా తెలుసు అనుకుంటా. కొత్త కార్లను విడుదల చేసిన ప్రతిసారి తమ ఎదుర్కొంంటున్న పరీక్షలలో డిజైన్ పరంగా మసెరటి ఖచ్చితమైన విజయం సాధించుకుంటూ వస్తోంది. దీనిలో గల స్మూత్ లైన్‌లు మరియు చక్కని డిజైన్ చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. దీని బాహ్య నిర్మాణం ఎంతో సున్నితంగా ఉంటుంది బహుశా ఇందుకేమో ఎక్కువ మంది మహిళలు దీనిని ఎంచుకుంటున్నారు.

6.పోర్స్చే :
పోర్స్చే కార్లు దాదాపుగా ఒక విధమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. అందుకు నిదర్శణం సూపర్ కార్లు పోర్స్చే తన సూపర్ కార్ల తరహాలోనే మిగిలిన అన్ని రకాల మోడల్స్ ఉంటాయి. అయితే డిజైన్ పరంగా వాటి మధ్య కేవలం అతి తక్కువ మార్పులతో తయారు చేశారు. అయితే దీనిని ఇంజిన్ యొక్క సౌండ్ పరంగా మంచి వాహనం. ప్రస్తుతం మహిళలు పోర్శ్చే ఇచ్చే శబ్ధం గల కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

5.కాడిల్లాక్ ఎల్‌డోరాడొ :
మహిళలు ఎప్పుడూ ఒకింత నూతనత్వాన్ని కోరుకుంటారు అనడంలో ఏమాత్రం తప్పు లేదు ఎందుకంటారా. ఇంత వరకూ చెప్పుకుంటూ వచ్చిన కార్లలోకెల్లా ఎక్కువ లుక్కున్నది ఇదే కనుక. ఎన్ని కొత్త డిజైన్స్ వస్తున్నప్పటికి దీనికున్న డిమాండే వేరు.

4.డోడ్జి వైపర్ :
నాలుగవ స్థానంలో ఉన్న ఊ కారు అత్యంత శక్తివంతమైనది. ఇది పూర్తిగా శక్తివంతమైన సూపర్, ఇటువంటి సూపర్ కార్లను నడపడం కాని ఆపరేట్ చేయడానికి గాని మహిళలు ఎంతో ఇష్టపడతారు.

3.బుగాటి వేరాన్ :
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పేరుగాంచిన ఎక్సోటిక్ సూపర్ కార్ బుగాటి వేరాన్. దీనిని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు, అయితే పరిమితంగా అందుబాటులోకి తేవడం వలన దీనికి విపరీతమైన కొరత ఏర్పడింది. మహిళలు ఇతరులు వాడిన వాటిని వాడరు అవి బట్టలు కాని ఇంకా ఏవైనా ఇతర వస్తువుల కావచ్చు అవి వారికోసం మాత్రమే తయారు చేసినట్లు గా భావిస్తారు. ఈ కారు కొనడంలో బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు.

2.ఫెరారి జిటిఒ :
మహిళలు ఖచ్చితంగా ఎరుపు రంగు బుగాటి కార్లను ఇష్టపడతారు అదే మరి ఫెరారి జిటిఒ మోడల్ ఉందంటే వారి ఆశకు హద్దులే ఉండవు మరి. అయితే దీనిని మహిళలు పురుషులతో పోటి పడి మరి దక్కించుకుంటున్నారు. ఎందుకంటే దీనిని స్త్రీ, పురుషులను ఇద్దరిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. కాని ఏ మహిళ కూడా దీనిని వదులుకోలేదు.

1.లంబోర్గిని :
లంబోర్గిని ఈ మధ్యనే హురకెన్ సూపర్ కార్ మరియు అవెంతడోర్ అనే రెండు మోడల్లను విడుదల చేసింది. ఎక్కువ మంది మహిళలు లంబోర్గిని సూపర్ కార్‌ను ఇష్టపడుతున్నారు. మిగతా అన్ని సూపర్ కార్లతో పోలిస్తే లంబోర్గిని సూపర్ ఎంతో ఉత్తమమని పేర్కొన్నారు. దీనిని ఎంతో అత్బుతమైన డజైన్ మరియు ఎక్కువ వేగంతో నడిచేలా రూపొందించారు.


Click it and Unblock the Notifications








