మెర్సిడెస్ బెంజ్ మ్యూజియం‌లో ఉన్న టాప్-10 కార్లు: తప్పకుండా చూడవలసినవి

By N Kumar

మెర్సిడెస్ బెంజ్ ప్రపంచ వ్యాప్తంగా అతి పురాతనమైన కార్ల తయారీ సంస్థలలో ఒకటి. ఈ సంస్థం వివిధ దశలలో ప్రపంచం అంతటా సుధీర్ఘ ప్రావీణ్యం సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు ఆటో మొబైల్ ప్రపంచంలోకి కొత్త వాహనాలన ప్రవేశపెడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద కార్ల తయారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది.

ఈ స్థానం మెర్సిడెస్ బెంజ్ సంస్థకు తరతరాల వరకు ఖ్యాతిని మరియు చరిత్రను మిగిల్చింది, మెర్సిడెస్ బెంజ్ తన చరిత్రకు మరియు తరతరాల నుండి వస్తున్న తమ అన్ని రకాల మోడళ్లకు ప్రతీకగా అతి పెద్ద మ్యూజియంను నిర్మించింది. జర్మనీకి చెందిన అతి పురాతన కార్ల సంస్థ ఇందులో అన్ని రకాల కార్ల నమూనాలను ఇక్కడ ప్రవేశపెట్టింది.

అయితే అక్కడ మ్యూజియంలో ఉన్న అన్ని కార్లను మీరు చూడలేరు. అందుకే డ్రైవ్‌స్పార్క్ మీకు అందులో టాప్-10 కార్లను చూసే అవకాశం కల్పింస్తోంది. క్రింది గల స్లైడర్‌లలో ఒక్కొక్కదాని గురించి వివరించాము చూడండి.

 మెర్సిడెస్ బెంజ్ మ్యూజియం

మెర్సిడెస్ బెంజ్ మ్యూజియం

ఈ భూ ప్రపంచం మీద అతి పురాతనమైన కార్ల తయారీ సంస్థం మెర్సిడెస్ బెంజ్ ఇది జర్మనీలో ఉంది. 125 సంవత్సరాల ఆటోమొబైల్ చరిత్ర గల మెర్సిడెస్ బెంజ్ తన మ్యూజియంలో దాదాపుగా 160 కార్ల మోడళ్లను సందర్శనకు ఉంచింది. ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు దాదాపుగా 1,500 ప్రదర్శనలు ఇవ్వబడ్డాయి.

10. మెర్సిడెస్ బెంజ్ యమ్‌యల్ 320 (1997)

10. మెర్సిడెస్ బెంజ్ యమ్‌యల్ 320 (1997)

మెర్సిడెస్ బెంజ్ యొక్క మొదటి తరం యస్‌యువి యమ్‌యల్ క్లాస్ మొదటి సారిగా జురాసిక్ పార్క సినిమాలో కనువిందు చేసింది. అలా సినిమాలో ఇది కనబడతుందని దీనికి మరిన్ని పరికరాలు ఫిట్ చేశారు . అంతే ఆ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా ఇది తీవ్ర ప్రజాదరణను పొందింది.

 09. మెర్సిడెస్ బెంజ్ కాన్సెప్ట్ 2000 (1981)

09. మెర్సిడెస్ బెంజ్ కాన్సెప్ట్ 2000 (1981)

1980 సంవత్సరంలో పశ్చిమ జర్మనీ ప్రభుత్వం లోకల్‌గా కార్లను తయారు చేస్తున్న వారికి ఒక సవాల్ విసిరింది. 900 పౌండ్లు బరువును మోయగల, పిల్లలు మరియు పెద్దలు అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా కారును తయారుచేయాలని అప్పట్లో అక్కడ ఉన్న కార్ల తయారి సంస్థలను కోరింది. అప్పట్లో 1981 లో జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో మోర్సిడెస్ బెంజ్ ఈ 200 కాన్సెప్ట్ కారును ప్రవేశపెట్టింది. ఈ కారులో మెర్సిడెస్ బెంజ్ 3.8-లీటర్ వి8 మరియు 3.3-లీటర్ ట్విన్ టుర్భోఛార్జడ్ ఇంజన్ వేరియంట్స్‌ను అందించింది.

 08. మెర్సిడెస్ బెంజ్ ఇ 280 ర్యాలీ కారు (డబ్ల్యూ123)

08. మెర్సిడెస్ బెంజ్ ఇ 280 ర్యాలీ కారు (డబ్ల్యూ123)

మెర్సిడెస్ బెంజ్ ఈ ఇ 280 కారును అత్యంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. ఇందులో భోజనాలు చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మరియు మంచి సస్పెన్షన్‌ కోసం అప్‌గ్రేడెడ్ సస్పెన్షన్‌ పరికరాలను ఇందులో ఏర్పాటు చేశారు. మరియు ఇందులో భద్రత కోసం చివరలా స్కిడ్ ప్లేట్లను అమర్చారు. ఈ మెర్సిడెస్ బెంజ్ ఇ 280 ర్యాలీ కారు 1977 సంవత్సరానికి చెందినది.

07. మెర్సిడెస్ బెంజ్ ఇయస్‌యఫ్ 22

07. మెర్సిడెస్ బెంజ్ ఇయస్‌యఫ్ 22

మెర్సిడెస్ బెంజ్ తన ఇయస్‌యఫ్ 22 కారును పూర్తిగా భద్రతను ఉద్దేశించుకుని రూపొందించింది. ఇందులో డ్రైవర్ కు మరియు ఇతర ప్రయాణికులకు ఎయిర్ బ్యాగ్‌లను అందించారు. యాంటి బ్రేక్ లాగింక్ సిస్టమ్‌ను కూడా కల్పించారు. మరియు అందరూ ఆశ్చర్యపోయే విధంగా దీనిని యస్-క్లాస్ మోడల్ కారు కన్నా 631 పౌండ్లు అధిక బరువు ఉండే విధంగా తయారు చేశారు. ఇది 1973 సంవత్సరానికి చెందిన మోడల్ కారు.

06.మెర్సిడెస్ బెంజ్ సి111 కాన్సెప్ట్ కారు.

06.మెర్సిడెస్ బెంజ్ సి111 కాన్సెప్ట్ కారు.

1969లో దీనిని మొదటిసారిగా ప్రదర్శించారు. తరువాత 1979 లో దీనిని ప్రవేసపెట్టారు. ఈ కాన్సెప్ట్ కారులో త్రీ కోస్ట్‌లైన్ ఇంజన్ కలదు ఇది అత్యధికంగా 330 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కాన్సెప్ట్ కారు కేవలం 5 సెకండ్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

05.మెర్సిడెస్ బెంజ్ 300 యస్‌యల్ కూపె

05.మెర్సిడెస్ బెంజ్ 300 యస్‌యల్ కూపె

1954 జరిగిన న్యూయార్క మోటార్ షోలో దీనిని మొదటి సారిగా ప్రదర్శించారు. అయితే 1950 లోనే దీని రూపకల్పనకు బీజం పడింది. అప్పట్లో అత్యధిక వేగంవంతమైన కారు అంటే ఇదే అనేవారు. ఈ కారులో అత్యంత శక్తివంతమైన 3.0-లీటర్ ఇంజన్ కలదు ఇది 212 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. 1954 నుండి 1957 సంవత్సరం మధ్య కాలంలో దాదాపుగా 1,400 కార్లను తయారు చేశారు.

 04. మెర్సిడెస్ బెంజ్ రెన్‌ట్రాన్స్‌పోర్టర్ (1954)

04. మెర్సిడెస్ బెంజ్ రెన్‌ట్రాన్స్‌పోర్టర్ (1954)

సగం ట్రక్ మరియు సగం కారులా ఉండే ఈ కారు 1954 సంవత్సరానికి చెందినది. ఇందులో 3.0-లీటర్, ఆరు సిలిండర్లు గల ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ఇందులో కలదు. దీని అత్యధిక వేగం గంటకు 105 కిలోమీటర్లు. ఇందులో ఉన్న ఇంజన్ 192 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

03.మెర్సిడెస్ బెంజ్ 260డి పుల్‌మ్యాన్ సెడాన్

03.మెర్సిడెస్ బెంజ్ 260డి పుల్‌మ్యాన్ సెడాన్

మెర్సిడెస్ బెంజ్ వారి మొదటి డీజల్ ఇంజన్ గల కారు 260 డి పుల్‌మ్యాన్ సెడాన్. దీనిని 1936 లో విడుదల చేశారు. విడుదల సమయంలో ఇందులో 2.5-లీటర్, నాలుగు సిలిండర్లు గల ఇంజన్ ఉండేది. ఇది 44 హార్స్‌పవర్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని అత్యధిక వేగం గంటకు 96 కిలోమీటర్లు. అయితే 1940 కాలం నాటికి దీని ఉత్పత్తిని నిలిపివేశారు. 2,000 కన్నా తక్కువ కార్లను ఉత్పత్తి చేసి ఉంటారని తెలుసుస్తోంది.

02. మెర్సిడెస్ బెంజ్ యస్‌యస్‌కె స్పోర్ట్స్

02. మెర్సిడెస్ బెంజ్ యస్‌యస్‌కె స్పోర్ట్స్

ఈ మెర్సిడెస్ బెంజ్ యస్‌యస్‌కె స్పోర్ట్స్ కారును ప్రత్యేకంగా కొండ ప్రాంతాల్లో రేస్‌లకు వెళ్లే వరికోసం రూపొందించినట్లు చెబుతున్నారు. దీనిని 1928 మొదటి సారిగా విడుదల చేశారు. యస్‌యస్‌కె మోడల్ కారులో 7.1-లీటర్ గల ఆరు సిలిండర్ల ఇంజన్‌ను అందించారు. ఈ ఇజన్ దాదాపుగా 221 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే దీనిని విడుదల చేసిన తరువాత కేవలం 35 కార్లను మాత్రమే తయారుచేశారు.

01. మెర్సిడెస్ బెంజ్ సింప్లెక్స్

01. మెర్సిడెస్ బెంజ్ సింప్లెక్స్

మెర్సిడెస్ బెంజ్ చరిత్రలో ఈ కారు ఎంతో ముఖ్యమైనది. ఈ కారులో 6.8-లీటర్ ఇంజన్ను అందించారు ఇది దాదాపుగా 38 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని అత్యధిక వేగం గంటకు 80 కిలోమీటర్లు. అంతే కాదు ఈ కారును నడపడం కూడా ఎంతో సులువు అని కొందరు అంటున్నారు.

 మరిన్ని ఆశక్తికరమైన విశేషాలు.

More from DriveSpark

Article Published On: Friday, November 13, 2015, 12:35 [IST]
English summary
Top 10 Classic Cars From Mercedes Benz Museum
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+