ఆటోమొబైల్ ప్రపంచంలో టాప్ 10 కూలెస్ట్ జాబ్స్

By Ravi

ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగం చేయాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఫెరారీ, లాంబోర్గినీ, డ్యుకాటి, బుగాటి వంటి పేర్లు వినగానే ఆటోమొబైల్ ప్రియులకు ఓ ప్రత్యేకమైన కిక్కు ఎక్కుతుంది. ప్రస్తుతం ఆటో ప్రపంచం సువిశాలమైనది.

ఈ ఆటో ప్రపంచంలో మీరెప్పుడైనా, ఆటోమొబైల్ పరిశ్రమలో చేయదగిన టాప్ 10 కూలెస్ట్ జాబ్స్ గురించి ఆలోచించారా..? అసలు అవెలా ఉంటాయో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

10. సూపర్‌కార్ ఇంజన్ బిల్డర్

10. సూపర్‌కార్ ఇంజన్ బిల్డర్

సాధారణ కార్లను ఎవరైనా ఇంజన్లను బింగించగలరు. కానీ, ప్రపంచంలో కెల్లా అత్యంత అరుదైన, శక్తివంతమైన సూపర్‌కార్ల ఇంజన్లను కొందరే బిగించగలరు. మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి, నిస్సాన్ జిటి-ఆర్ వంటి పెర్ఫార్మెన్స్ కార్లకు ఉపయోగించే ఇంజన్లను చేతితోనే తయారు చేస్తారు. కొన్ని కార్లకే ఇంజన్‌పై దానిని తయారు చేసిన వారి సంతకం కూడా ఉంటుంది. మరీ అదీ స్పెషల్ అంటే.

9. వింటేజ్ కార్ రీస్టోరర్

9. వింటేజ్ కార్ రీస్టోరర్

పురాతన కార్లు చాలా విలువైనవి, అప్పటి చరిత్రను మరియు సాంకేతికతను భవిష్యత్ తరాలకు తెలియజేసేవి. అలాంటి పాడైన లేదా రిపేరుకు వచ్చిన పురాతన కార్లను తిరిగి యధాస్థానంలో తీసుకురావటం మాములు పని కాదు. ఆటోమొబైల్ పరిశ్రమలో వింటేజ్ వాహనాలను రీస్టోర్ చేసే వారికి ఎల్లప్పుడూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.

8. కస్టమర్ కార్ బిల్డర్

8. కస్టమర్ కార్ బిల్డర్

కంపెనీలు తయారు చేసిన కారును కొనుగోలు చేస్తే మజా ఏముంటుంది. మన కారును మనం తయారు చేసుకోవటంలోనే లేదా ఇతరుల కోసం అన్నింటికన్నా విశిష్టమైన కారును తయారు చేయటంలోనే మజా ఉంటుంది. అలాంటి జాబ్ ప్రొఫైలే కస్టమ్ కార్ బిల్డర్. ఒక కారును పూర్తిగా స్క్రాచ్ నుంచి కానీ లేదా ఏదైనా ప్రస్తుత కారును వేరే ఏ కారును పోలి ఉండకుండా విశిష్టంగా కనిపించేలా కస్టమైజ్ చేయటం వీరి ప్రత్యేకత.

7. రాయల్ ఫ్యామిలీ కోసం కార్లు తయారు చేయటం

7. రాయల్ ఫ్యామిలీ కోసం కార్లు తయారు చేయటం

రాజరికపు కుటుంబాలకు చెందిన వారు, ధనికులు కోసం కార్లను ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. ఇలాంటి కార్లు చాలా చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. నిపుణులైన, పేరుగాంచిన డిజైనర్లు ఈ కార్ల కోసం పనిచేస్తారు. ఆటోమొబైల్ రంగంలో ఎంతో గొప్ప పేరు సంపాధించుకుంటే కానీ ఇలాంటి జాబ్ దొరకదు.

6. బూత్ బేబ్స్

6. బూత్ బేబ్స్

మోడలింగ్ రంగంలో ఉండే అందమైన అమ్మాయిలకు ఇదొక అరుదైన అవకాశం. ఫ్యాషన్ షోలలో అందాల ప్రదర్శనను అతికొద్ది మంది మాత్రమే తిలకిస్తారు. కానీ, అదే అమ్మాయి ఏదైనా ఆటో షోలో కార్ల పక్కన నిల్చుకుంటే, ఆమె ప్రొఫైల్ కోసం ఏజెన్సీలు ఎగబడుతాయి.

5. ఆటోమొబైల్ కంపెనీ సీఈఓ

5. ఆటోమొబైల్ కంపెనీ సీఈఓ

అబ్బో.. ఇది కొంచెం కష్టమైన ఉద్యోగమే. ఈ జాబ్ పొందాలంటే ఆటోమొబైల్ పరిశ్రమలో దశాబ్దాల అనుభవమైనా ఉండాలి లేదంటే సుడి (అదేనండి లక్) అయినా ఉండాలి. ఈ ఉద్యోగానికి తగినట్లే ఇందులో బాధ్యతలు కూడా తలకు మించిన భారంగా ఉంటాయి. కానీ, సొసైటీలో మంచి గుర్తింపునిచ్చే ప్రొఫైల్ ఇది.

4. డైనో బెంచ్ టెస్టర్

4. డైనో బెంచ్ టెస్టర్

సూపర్‌కార్ల వేగాన్ని నిర్దేశించే జాబ్ ప్రొఫైల్ ఇది. కారు మనం ఎంత వేగంగా వెళ్లమంటే అంత వేగంగా వెళ్లదు. డైనో బెంచ్ టెస్టర్ నిర్దేశించిన లేదా ఫిక్స్ చేసిన స్పీడ్ ప్రకారం మాత్రమే కారు వేగం ఉంటుంది. ఇందుకోసం అతను వళ్లు వంచి శ్రమించడు. ఇదిగో ఇలా ఈ కారును ఓ రోలర్‌పై కట్టేసి, ల్యాప్‌టాప్‌తో స్పీడ్ సెట్ చేస్తాడు. ఈ జాబ్ ఏదో బాగుంది కదూ..!

3. ఫార్ములా వన్ సేఫ్టీ కార్ డ్రైవర్

3. ఫార్ములా వన్ సేఫ్టీ కార్ డ్రైవర్

ఫార్ములా వన్ రేస్ అంటే అందరికీ ఇష్టమే. అయితే, ఇలాంటి ఫార్ములా వన్ రేసుల్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు అందరికన్నా వేగంగా స్పందించేది ఫార్ములా వన్ సేఫ్టీ కార్ డ్రైవరే. ఇది కొంచెం రిస్కైన జాబే అయినప్పటికీ, సాటివారికి సాయపడటంలో ఉండే కిక్కే వేరు.

2. మోటోజిపి టెస్ట్ రైడర్

2. మోటోజిపి టెస్ట్ రైడర్

మోటోజిపిలో బైక్‌లు నడిపే రైడర్లే గొప్పవాళ్లు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే, వారి కన్నా ముందుగా ఆ బైక్‌లను మోటోజిపి టెస్ట్ రైడర్లు రైడ్ చేసి, అందులోని లోపాలను సరిచేసిన తర్వాతనే అభ్యర్థుల చేతికి ఇవ్వటం జరుగుతుంటుంది. ఈ టెస్టింగ్ సమయంలో మంచి జరిగినా చెడు జరిగినా ఆ క్రెడిట్ మాత్రం టెస్ట్ రైడర్‌కే దక్కుతుంది.

1. ఆటోమొబైల్ ఎడిటర్

1. ఆటోమొబైల్ ఎడిటర్

ఆటోమొబైల్ పరిశ్రమలో అన్నింటి కన్నా కూలెస్ట్ జాబ్ ఆటోమొబైల్ ఎడిటర్‌గా పనిచేయటం. పొలిటకల్ వార్తలు, క్రైం వార్తలు ఎవరైనా రాయగలరు. కానీ, ఆటోమొబైల్ న్యూస్‌ని అందరికీ అర్థమయ్యేలా, ప్రత్యేకించి స్థానిక భాషలలో రాయటం చాలా కష్టం. కానీ, ఈ పనిని మేము ఎంతో ఇష్టం, తెలుగు పాఠకుల ప్రయోజనం కోసం చేస్తున్నాం.

More from DriveSpark

Article Published On: Wednesday, March 25, 2015, 17:59 [IST]
English summary
Working in the auto world has always been a dream job to many. So has anyone ever wondered what the coolest job in the auto industry is? Well, here is our list of the 10 most coolest jobs in the auto industry. Nothing can get better than the number one job in our list!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+