ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగవంతమైన టాప్-10 కార్లు

By N Kumar

ఆటోమొబైల్స్ రంగం అవతరించి ఇప్పటికి మూడు శతాబ్దాల కాలం గడిచిపోయింది. ప్రారంభంలో వాహనాలు గంటకు కేవలం 19 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడిచేవి. అయితే నేడు వాహనాలు ఏకంగా గంటకు 400 కిలోమీటర్లకు పైగా వేగంతో పరుగులుపెడుతున్నాయి. ఆటోమొబైల్స్ అభివృద్దిలో వేగం అనే అంశం పరంగా వాహనాలు ఎంతగానో అభివృద్ది చెందాయి. ఈ ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగవంతమైన కార్ల గురించి క్రింది కథనంలో అందిస్తున్నాము.

10. గంపెర్ట్ అపోలో

10. గంపెర్ట్ అపోలో

గరిష్ట వేగం గంటకు 359 కిలోమీటర్లు

పదవ స్థానంలో ఉన్న ఈ గంపెర్ట్ కారులో ఆడి సంస్థకు చెందిన 4.2-లీటర్ ట్విన్ టర్బో వి8 ఇంజన్ కలదు. ఇది సుమారుగా 641 బిహెచ్‌పి పవర్‍‌‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.1 సెకండ్ల కాలంలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

 09. నోబుల్ ఎమ్600

09. నోబుల్ ఎమ్600

గరిష్ట వేగం గంటకు 362 కిలోమీటర్లు

బ్రిటీష్‌కు చెందిన సంస్థ ఈ నోబుల్ ఎమ్600 కారును 2010 అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 4.4-లీటర్ కెపాసిటి గల ట్విన్ టర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు ఇది సుమారుగా 650 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

08. జన్వో ఎస్‌టి1

08. జన్వో ఎస్‌టి1

గరిష్ట వేగం గంటకు 375 కిలోమీటర్లు

గరిష్ట వేగం గల కార్ల జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉన్న ఈ జన్వో ఎస్‌టి1 కారును స్వీడిష్‌ ఆధారిత సంస్థ తయారు చేసింది. ఇందులో 110 బిహెచ్‌పి పవర్ మరియు 1430 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 6.8-లీటర్ వి8 టర్బో ఛార్జ్‌‌డ్ ఇంజన్ ‌కలదు. కేవలం 3 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

07. మెక్‌లారెన్ ఎఫ్1

07. మెక్‌లారెన్ ఎఫ్1

గరిష్ట వేగం గంటకు 386 కిలోమీటర్లు

మెక్‍‌లారెన్ ఎఫ్1 కారు ఈ మధ్య కాలంలో వేగం పరంగా బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో 6.2-లీటర్ సామర్థ్యమున్న వి12 ఇంజన్ కలదు. ఇది సుమారుగా 618 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును. కేవలం 3.2 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మెక్‌లారెన్ ఎఫ్1 కార్లు కేవలం 106 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి.

06. కోయినిగ్‌సెగ్ సిసిఎక్స్

06. కోయినిగ్‌సెగ్ సిసిఎక్స్

గరిష్ట వేగం గంటకు 395 కిలోమీటర్లు

కోయినిగ్‌సెగ్ వారి సిసిఎక్స్ కారు ఈ టాప్-10 జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది. ఈ కారులో 4.7-లీటర్ సామర్థ్యం ఉన్న వి8 ఇంజన్ కలదు. ఇది కేవలం 3.2 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇప్పటి వరకు కోయినిగ్‌సెగ్ సంస్థ ఆ సిసిఎక్స్ కార్లను కేవలం 49 వరకు మాత్రమే ఉత్పత్తి చేసింది.

 05. సలీన్ ఎస్7 ట్విన్ టుర్బో

05. సలీన్ ఎస్7 ట్విన్ టుర్బో

గరిష్ట వేగం గంటకు 399 కిలోమీటర్లు

ఐదవ స్థానంలో ఉన్న సలీన్ ఎస్7 యొక్క అప్‌డేటెడ్ మోడల్ సలీన్ ఎస్7 ట్విన్ టుర్బో. ఇందులో 7.0-లీటర్ సామర్థ్యం ఉన్న టర్బో ఛార్జ్‌డ్ వి8 ఇంజన్ కలదు, ఇది సుమారుగా 750 బిహెచ్‌‌పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.8-సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

 04. ఎస్ఎస్‌సి అల్టిమేట్ ఏరో

04. ఎస్ఎస్‌సి అల్టిమేట్ ఏరో

గరిష్ట వేగం గంటకు 412 కిలోమీటర్లు

2006 లో దీనిని అధికారికంగా విడుదల చేసినపుడు దీని గరిష్టం వేగం 412 కిలోమీటర్లుగా ఉంది. అయితే ఆ తరువాత గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించుకుంది. ఇందులో 6.4-లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్‌‌డ్ వి8 ఇంజన్ కలదు. ఇది సుమారుగా 1183 బిహెచ్‌పి పవర్ మరియు 1483 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 03. కోయినిగ్‌సెగ్ అగెరా ఆర్

03. కోయినిగ్‌సెగ్ అగెరా ఆర్

గరిష్ట వేగం గంటకు 418 కిలోమీటర్లు

కోయినిగ్‌సెగ్ వారి మరొక కారు ఈ టాప్-10 జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ అగెరా ఆర్‌లో 5.0-లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్ టర్బో ఛార్జ్‌‌డ్ వి8 ఇంజన్ కలదు. ఇది సుమారుగా 1124 బిహెచ్‌పి పవర్‌‌‌ను ఉత్పత్తి చేయగలదు. కేవలం 2.8-సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

02.హెన్నెస్సే నెనమ్ జిటి

02.హెన్నెస్సే నెనమ్ జిటి

గరిష్ట వేగం గంటకు 435 కిలోమీటర్లు

ప్రపంచంలోనే రెండవ అత్యంత వేగవంతమైన కారు ఈ హెన్నెస్సే వెనమ్ జిటి. ఇందులో 7.0-లీటర్ సామర్థ్యం ఉన్న టర్బో ఛార్జ్‌డ్ వి8 ఇంజన్ కలదు, ఇది సుమారుగా 1244 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 13.63 సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

 01. బుగట్టి చిరాన్

01. బుగట్టి చిరాన్

గరిష్ట వేగం గంటకు 463 కిలోమీటర్లు

బుగట్టి చిరాన్ కారు గరిష్టంగా గంటకు 463 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. కాని ఇందులో విద్యుత్‌ వేగం నియంత్రిక ద్వారా దీని వేగాన్ని 420 కిలోమీటర్లు పరిమితం చేశారు. ఇందులో 8.0-లీటర్ కెపాసిటి గల డబ్ల్యూ16 క్వాడ్ టర్బో ఛార్జ్‌‌డ్ ఇంజన్ కలదు. ఇది కేవలం 2.4-సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగవంతమైన టాప్-10 కార్లు

గంటకు 74,00 కిమీ.లు వేగంతో ప్రయాణించే విమానాలు

లక్షల కోట్లకు అధిపతి కాని ఆటోల్లో ప్రయాణిస్తాడు: అజీమ్ ప్రేమ్‌‌జీ

Article Published On: Saturday, May 14, 2016, 12:22 [IST]
English summary
Top 10 Fastest Cars In The World – How Fast Is Fastest?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+