ప్రపంచంలో కెల్లా పది అత్యంత వేగవంతమైన రోడ్లు
వేగం అంటే కుర్రకారుకి చాలా ఇష్టం. మన దగ్గర ఎంత స్పీడ్‌గా వెళ్లే వాహనం ఉన్నప్పటికీ, దానికి అనుకూలమైన రోడ్డు లేకపోతే ఆ స్పీడ్ వాహనం వృధాగానే అనిపిస్తుంది. అందుకే, కొన్ని దేశాల్లో అత్యంత వేగవంతమైన రోడ్లు (ఫాస్టెస్ట్ రోడ్స్) వెలిశాయి.
ఈ రోడ్లపై కేవలం వేగంగా వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. నెమ్మదిగా వెళ్లే వాహనాలకు ఈ రోడ్లపై నో ఎంట్రీ. కొన్ని రకాల ఫాస్ట్ కార్లకు పబ్లిక్ రోడ్లపై ఎంట్రీ ఉండదు, వాటిని ప్రత్యేకమైన ట్రాక్స్/రోడ్స్‌పై మాత్రమే నడపాల్సి ఉంటుంది.
అయితే, ఇటీవలి కాలంలో వేగంగా వెళ్లే వాహనాల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో, ఫాస్టెస్ట్ రోడ్స్/ఎక్స్‌ప్రెస్ హైవేస్ వంటి ఏర్పాటవుతున్నాయి. ఈనాటి మన కథంలో ప్రపంచంలో కెల్లా పది అత్యుత్తమ మరియు అత్యంత వేగవంతమైన రోడ్ల గురించి తెలుసుకుందాం రండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో ప్రపంచంలో కెల్లా టాప్ 10 ఫాస్టెస్ట్ రోడ్స్ గురించి తెలుసుకోండి.

10. స్లోవేకియా
ఈ రోడ్డుపై గంటకు గరిష్ట వేగం 35 మైళ్లు మాత్రమే. అయితే, ఈ రోడ్డు టాప్ 10 ఫాస్టెస్ట్ రోడ్స్ లిస్టులోకి ఎలా వచ్చిందనుకుంటున్నారా? ఈ స్పీడ్ లిమిట్ మనకు కనిపించే బోర్డులపై మాత్రమే ఉంటుంది, అక్కడి ప్రజలు మాత్రం గంటకు 80 మైళ్ల వేగంతో ఈ రోడ్డుపై తమ వాహనాలను పరుగులు పెట్టిస్తుంటారు. మరి పోలీసులు పట్టుకోరా అని అడిగితే.. అక్కడ ఉండే లోకల్ రేడియో స్టేషన్లు పోలీసులు ఏ ప్రాంతంలో మాటు వేసి ఉన్నారో అనే సమాచారన్ని డ్రైవర్లకు రేడియో ద్వారా తెలుపుతుంటాయి. దీంతో ఆ ప్రాంతానికి చేరుకో డ్రైవర్లు కార్లను నెమ్మదిగా పోనిస్తుంటారు.
Picture credit: Wiki Commons
Wizzard

9. యూఏఈ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఈ రోడ్డుపై స్పీడ్ లిమిట్ గంటకు 75 మైళ్లు మాత్రమే, కానీ ఈ రోడ్డుపై గంటకు 87 మైళ్ల వేగంతో డ్రైవ్ చేసి ఛలాన్ పొందిన డ్రైవర్లు చాలా మందే ఉన్నారు. ఇసుక ఎడారుల మధ్యలో ఏర్పాటైన ఈ రోడ్డు నడపటానికే కాదు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ కామన్ ఏంటంటే, మీ దగ్గర బుగాటి వేరాన్, లాంబోర్గినీ గల్లార్డో వంటి కార్లుంటే అక్కడి పోలీసుల వద్ద కూడా అలాంటి కార్లు ఉంటాయి.

8. ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో కూడా చాలా మంచి రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్డుపై స్పీడ్ లిమిట్ గంటకు 81 మైళ్లు. ఈ నిర్మాణుష్య రోడ్లను పర్యవేక్షించడం కొంచెం కష్టమైన విషయమే. ఈ రోడ్లపై కంగారూలు అడ్డు రానంత వరకూ మీరు వేగంగా డ్రైవ్ చేసుకుంటూ పోవచ్చు.

7. ఆరిజోనా
సుమారు 39 మైళ్ల పొడవునా నేరుగా ఉండే ఈ రోడ్డు చాలా వరకు ఓపెన్ రోడ్. ఈ రోడ్డుపై రూట్ 79లో అత్యంత వేగంగా వెళ్లవచ్చు. దాదాపు గంటకు 90 మైళ్ల వేగంతో ఈ రోడ్డుపై వాహనాలు వెళ్తుంటాయి. కానీ ఈ రోడ్డుపై వాస్తవిక స్పీడ్ లిమిట్ గంటకు 88 మైళ్లు మాత్రమే.
Picture credit: aaroads.com
Kevin Trinkle

6. న్యూజిలాండ్
స్పీడ్ రికార్డ్స్‌కు ప్రయత్నించిన రోడ్లు ఈ దేశంలో ఉన్నాయి. ఇక్కడ గౌడీస్ రోడ్ చాలా అందంగా ఉంటుంది, ఈ రోడ్ అనేక ఓవెన్ ఈవాన్స్ జ్ఞాపకాలను కలిగి ఉంటుంది. ఓవెన్ ఈవాన్స్ ఈ రోడ్డుపై 1996లో స్పీడ్ రికార్డుకు ప్రయత్నించాడు. ఇతను ఈ రోడ్డుపై గంటకు 216 మైళ్ల వేగాన్ని చేరుకోగలిగాడు.

5. ఇటలీ
మిలాన్ మరియు రోమ్‌ను కలిపే ఈ రోడ్డు పేరు ఏ1. పేరుకు తగినట్లుగానే ఇది ఏ1 రోడ్. ఈ రోడ్డుపై వేగాన్ని గంటకు గరిష్టంగా 93 మైళ్లకు పరిమితం చేశారు. అయితే, మీ వద్ద ఓ ఫెరారీనో లేక లాంబోర్గినీ కారో ఉంటే మాత్రం స్పీడ్ లిమిట్‌కు లిమిట్ ఉండదు.
Picture credit: Wiki Commons
Paolo da Reggio

4. నర్‌బర్గ్ రింగ్
ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రమాదకరమైన మరియు అత్యంత అందమైన రోడ్లలో ఈ నర్‌బర్గ్ రింగ్ కూడా ఒకటి. ఈ రోడ్డు జర్మనీలో ఉంది. దీనిని ఎక్కువగా రేస్‌ల కోసం ఉపయోగిస్తుంటారు. అప్పుడప్పుడు పబ్లిక్ కోసం కూడా ఈ రోడ్డును ఓపెన్ చేసి ఉంచుతారు. అయితే, దీనిపై ప్రవేశం మాత్రం ఉచితం కాదు.

3. ఐసిల్ ఆఫ్ మ్యాన్
ఈ రోడ్డుపై స్పీడ్ లిమిట్స్ ఉండదు, స్పీడ్ అంటే ఇష్టపడే స్థానికులకు ఇదొక బెస్ట్ రోడ్. అందమైన ద్వీపంలో ఉండే ఈ అందమైన రోడ్లపై ప్రతి సంవత్సరం ఐసిల్ ఆఫ్ మ్యాన్ టిటి పేరుతో మోటార్‌సైకిల్ రేస్ జరుగుతూ ఉంటుంది. ఈ రోడ్డుపై అనేక వంపులు ఉంటాయి, అవే ఇందులో ట్విస్ట్.

2. పోలాండ్
పోలండ్‌లోని ఆటోస్ట్రాడా ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన హైవే. ఈ రోడ్డుపై స్పీడ్ లిమిట్ గంటకు 87 మైళ్లు.
Picture credit: Wiki Commons
Włodzimierz Wysocki

1. ఆటోబాన్
జర్మనీలోని ఆటోబాన్ ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన రోడ్డు. ఈ రోడ్డుపై స్పీడ్ లిమిట్ గంటకు 81 మైళ్లు. అయితే, అంతకు మించి వేగంగా వెళ్లాలనుకునే డ్రైవర్ ఆపడానికి అక్కెడవ్వరూ ఉండరు. కాబట్టి, ఈ రోడ్డుపై స్పీడ్ ఉన్నా లేనట్లే. ఈ రోడ్డుపై అత్యధిక స్పీడ్ రికార్డ్ 1968లో నమోదైంది. ఓ మెర్సిడెస్ బెంజ్ డబ్ల్యూ125 కారుతో గంటకు 268.8 మైళ్ల వేగాన్ని చేరుకున్నారు.
Picture credit: Flickr
Martin Gommel

బోన్‌విల్లే సాల్ట్ ఫ్లాట్స్
బోన్‌విల్లే సాల్ట్ ఫ్లాట్స్ పబ్లిక్ రోడ్ కాదు అలాగని ప్రత్యేకమైన రేస్ ట్రాక్ కూడా కాదు. ఇదొక ఉప్పు మేట. ఉప్పు గట్టిపడటం వలన ఏర్పడిన ధృడమైన మరియు చదునైన ఉపరితలం కలిగిన ప్రాంతం. అత్యధిక ల్యాండ్ స్పీడ్ రికార్డులను సాధించేందుకు చాలామంది ఈ ప్రాంతాన్నే ఎంచుకుంటుంటారు. స్పీడ్‌కి ఇది చాలా ఫేమస్ ప్లేస్.


Click it and Unblock the Notifications








