ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే రైళ్లు
తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణికులను చేరవేసేది రైలు రవాణా వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రత్యామ్నాయ రవాణా మార్గాలున్నప్పటకీ, రైలుకున్న ప్రత్యేకతే వేరు. కొన్ని దేశాల్లో రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉండి, సాంప్రదాయ రవాణా వ్యవస్థల కన్నా వేగంగా గమ్యాన్ని చేరేందుకు సహకరిస్తాయి. అలాంటి రైలు నెట్‌వర్కే హైస్పీడ్ రైల్.
పేరుకు తగినట్లుగానే ఇవి అత్యంత వేగంతో పరుగులు పెడతాయి. కొన్ని దేశాల్లో వీటిని బుల్లెట్ ట్రైన్లని (బుల్లెట్ వేగంతో దూసుకుపోతుంటాయి కాబట్టి అలా అంటారు), మరికొన్ని హై స్పీడ్ రైల్ (హెచ్ఎస్ఆర్) అని అంటుంటారు. ఈ హైస్పీడ్ రైళ్లు చూడటానికి సాంప్రదాయ రైళ్లకు కన్నా చాలా భిన్నంగా ఉంటాయి. అత్యంత వేగంతో వెళ్లేటప్పుడు పట్టాలపై సరైన బ్యాలెన్స్ ఉండేలా వీటి ఏరోడైనమిక్స్‌ను డిజైన్ చేస్తారు.
ఈ హై స్పీడ్ రైళ్ల కోసం కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లను నిర్మిస్తారు. ఈ ట్రాక్‌లపై ఇవి సదరు ట్రైను గరిష్ట వేగం ఎంత ఉంటే అంత వేగంతో పరుగులు తీస్తాయి. 2012 వరకు ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా ప్రయాణించే రియల్ టైమ్ రన్నింగ్ రైలుగా స్పెయిన్ రైలు రికార్డు సృష్టించింది. దీని గరిష్ట వేగం గంటకు 310 కిలోమీటర్లు. అయితే, ఇటీవలే ఈ రికార్డును జపాన్ బద్దలు చేసింది.
మరి ప్రపంచంలోని టాప్ 10 హై స్పీడ్ రైళ్లు, వాటి విశేషాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

జపాన్
జేఆర్ మాంగ్లెవ్ లేదా ఎమ్ఎల్ఎక్స్01
హైస్పీడ్ రైళ్లలో ప్రస్తుతం ప్రపంచ రికార్డును కలిగి ఉన్న రైలు జపాన్ దేశంలో ఉంది.

ఇంటీరియర్
జేఆర్ మాంగ్లెవ్ లేదా ఎమ్ఎల్ఎక్స్01 పిలువబడే ఈ రైలు గరిష్ట వేగం గంటకు 581 కిలోమీటర్లు. ఇదొక మాగ్నటిక్ లెవియేషన్ ట్రైన్ సిస్టమ్.

ఫ్రాన్స్
ఫ్రాన్స్ టిజివి లేదా వి150
హై స్పీడ్ రైళ్లలో ఫ్రాన్స్‌ది రెండవ స్థానం.

ఇంటీరియర్
ఫ్రాన్స్ టిజివి లేదా వి150 గా పిలిచే ఈ హై స్పీడ్ రైలు గరిష్ట వేగం గంటకు 574.8 కిలోమీటర్లు.

జర్మనీ
సీమెన్స్ ట్రాన్స్‌ర్యాపిడ్
హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్‌లో జర్మనీది మూడవ స్థానం. ఇది మోనోరైల్ (సింగిల్ ట్రైక్‌పై నడుస్తుంది). ఎలక్ట్రిక్ లెవియేషన్ సిస్టమ్ ఆధారంగా ఇది నడుస్తుంది.

ఇంటీరియర్
సీమెన్స్ ట్రాన్స్‌ర్యాపిడ్‌గా పిలిచే ఈ హై స్పీడ్ రైలు గరిష్ట వేగం గంటకు 501 కిలోమీటర్లు.

చైనా
సిఆర్‌హెచ్3
హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్‌లో చైనా నాలుగో స్థానంలో ఉంది.

ఇంటీరియర్
సిఆర్‌హెచ్3 గా పిలువబడే ఈ హై స్పీడ్ రైలు గరిష్టంగా గంటకు 487.3 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

స్పెయిన్
ఏవిఈ క్లాస్ 103
హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్‌లో స్పెయిన్‌ది ఐదన స్థానం. అక్కడి ప్రభుత్వ రంగ రైల్వో సంస్థ రెన్ఫే ఏవిజి హై స్పీడ్ రైళ్లను నిర్వహిస్తుంది.

ఇంటీరియర్
ఏవిఈ క్లాస్ 103 హై స్పీడ్ రైలు గంటకు గరిష్టంగా 404 కిలోమీటర్ల వేగంతో తుర్రుమంటుంది.

తైవాన్
టిహెచ్ఎస్ఆర్ 700టి
హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్‌లో తైవాన్‌ది ఆరవ స్థానం. ఇది ఎలక్ట్రిక్ రైలు.

ఇంటీరియర్
టిహెచ్ఎస్ఆర్ (తైవాన్ హై స్పీడ్ రైల్) 700టి గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు.

ఐస్ (ఐసిఈ) వి
ఇంటర్‌సిటీ ఎక్స్‌పెరిమెంటల్ (ప్రస్తుతం ఐసిఈ వి గా పేరు మార్చారు) రైలును పరిశోధన నిమిత్తం తయారు చేశారు.

ఇంటీరియర్
ఐసిఈ వి హై స్పీడ్ రైలు గరిష్ట వేగం గంటకు 324 కిలోమీటర్లు.

చైనా స్టార్ (డిజెజె2)
ఈ ఎక్స్‌పెరిమెంటల్ హై స్పీడ్ రైలును చైనాలో తయారు చేశారు.

ఇంటీరియర్
చైనా స్టార్ (డిజెజె2) హై స్పీడ్ రైలు గరిష్ట వేగం గంటకు 321 కిలోమీటర్లు.

ఈటిఆర్ 500
ఈటిఆర్ 500 (ఎలట్రో ట్రెనో ర్యాపిడో 500)గా పిలువబడే ఈ హై స్పీడ్ రైలు ఇటలీకి చెందినది. 1993లోనే దీనిని పరిచయం చేశారు.

ఇంటీరియర్
ఈటిఆర్ 500 గరిష్టంగా గంటకు 319 కిలోమీటర్ల వేగంతోపరుగులు తీస్తుంది.

ఈఆర్200
ఈ జాబితాలో చివరిది ఈటిఆర్ 500. ఇది మొట్టమొదటి హై స్పీడ్ డైరెక్ట్ కరెంట్ ఇంటర్‌సిటీ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ విత్ రెస్టాటిక్ బ్రేక్ సిస్టమ్ కలిగిన రైలుగా చెబుతారు.

ఈఆర్200
ఈఆర్200 హై స్పీడ్ రైలు గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు.

భారత్‌లో హై స్పీడ్ రైళ్లు
ఇప్పటి వరకు విదేశాలకు మాత్రమే పరిమితమైన హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్ ఇక మన దేశంలో కూడా కనిపించనుంది. జపాన్ సాంకేతిక పరిజ్ఞానపు మద్ధతుతో భారతదేశంలో కూడా హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications








