టాప్ 10 ఫుట్‌బాల్ ప్లేయర్స్ మరియు వారి సూపర్ కార్స్

By Ravi

ప్రస్తుతం ప్రపంచమంతా ఫుట్‌బాల్ ఫీవర్ నడుస్తోంది. క్రికెట్ కన్నా ఎక్కువ క్రేజ్ ఉన్న గేమ్ ఇది. ఫిఫా 2014 ఫుట్‌బాల్ పోటీలు బ్రెజిల్‌లో జరుగుతున్నాయి. ఈసారి ప్రపంచ కప్‌ను ఏదేశం కైవసం చేసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

క్రికెట్ ఆటగాళ్ల మాదిరిగానే ఫుట్‌బాల్ ఆటగాళ్లకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. వారికి చెల్లించే పారితోషకం వింటే, ఔరా! అని ఆశ్చర్యపోవాల్సిందే. ఫుట్‌బాల్ ప్లేయర్స్‌కి కూడా విలాసవంతమైన, ఖరీదైన, శక్తివంతమైన కార్లంటే క్రేజ్ ఎక్కువ.

ఈనాటి ఆఫ్‌బీట్ శీర్షికలో ప్రపంచంలో టాప్ 10 బెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ మరియు వారి విలాసవంతమైన మెషీన్స్ (కార్స్) గురించి తెలుసుకుందాం రండి.

మరింత సమచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫుట్‌బాల్ ప్లేయర్స్ అండ్ కార్స్

తర్వాతి స్లైడ్‌లలో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన టాప్ 10 ఫుట్‌బాల్స్ ప్లేయర్స్ మరియు వారు ఉపయోగించే కార్ల గురించి తెలుసుకోండి.

1. మైల్ జెడినాక్, మెర్సిడెస్ బెంజ్ సి63 ఏఎమ్‌జి

1. మైల్ జెడినాక్, మెర్సిడెస్ బెంజ్ సి63 ఏఎమ్‌జి

ఆస్ట్రేలియా జట్టుకు చెందిన మైల్ జెడినాక్ వద్ద మెర్సిడెస్ బెంజ్ పెర్ఫార్మెన్స్ డివిజన్ ఏఎమ్‌జి ట్యూన్ చేసిన పవర్‌ఫుల్ సి63 ఏఎమ్‌జి కూపే ఉంది. ఈ కారు గరిష్టంగా 336 కి.వా. శక్తిని ఉత్పత్తిని చేస్తుంది.

మైల్ జెడినాక్ ప్రస్తుతం ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

2. టిమ్ కెహిల్, లాంబోర్గినీ గల్లార్డో

2. టిమ్ కెహిల్, లాంబోర్గినీ గల్లార్డో

టిమ్ కెహిల్ కూడా ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఆటగాడే. ఇతని వద్ద శక్తివంతమైన లాంబోర్గినీ గల్లార్డో కారు ఉంది.

ప్రస్తుతం లాంబోర్గినీ తమ గల్లార్డో ఉత్పత్తిని నిలిపివేసింది. లాంబోర్గినీ చరిత్రలో అత్యంత సక్సెస్‌ఫుల్ కార్లలో గల్లార్డో కూడా ఒకటి. ఇప్పటి వరకు దాదాపు 14,022కు పైగా లాంబోర్గినీ గల్లార్డో కార్లు అమ్ముడుపోయాయి. మొదటి తరం గల్లార్డో కారులో 5.0 లీటర్, వి10 ఇంజన్‌ను ఉపయోగించేవారు. ఇది రెగ్యులర్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ మరియు అడ్వాన్స్డ్ 6-స్పీడ్ ఎలక్ట్రో-హైడ్రాలికల్లీ-కంట్రోల్డ్ ప్యాడల్ షిఫ్ట్ లేదా ఈ-గేర్ ట్రాన్సిమిషన్‌తో లభ్యమయ్యేది.

3. లైనెల్ మెస్సీ, మాసేరటి గ్రాన్ తురిస్మో ఎమ్‌సి స్ట్రాడల్

3. లైనెల్ మెస్సీ, మాసేరటి గ్రాన్ తురిస్మో ఎమ్‌సి స్ట్రాడల్

అర్జెంటీనా జట్టుకు చెందిన లైనెల్ మెస్సీ వద్ద మాసేరటి గ్రాన్ తురిస్మో ఎమ్‌సి స్ట్రాడల్ మోడల్ కారు ఉంది.

2013లో జరిగిన జెనీవా మోటార్ షోలో మాసేరటి తమ సరికొత్త 2014 గ్రాన్ తురిస్మో ఎమ్‌సి స్ట్రాడల్ మోడల్‌ను ఆవిష్కరించింది. ఇందులో 4.7 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు.
4. క్రిస్టియానో రొనాల్డో, లాంబోర్గినీ అవెంటేడర్

4. క్రిస్టియానో రొనాల్డో, లాంబోర్గినీ అవెంటేడర్

ప్రపంచంలో కెల్లా అత్యంత ఫేమస్ ఫుట్‌బాల్ క్రీడాకారులలో క్రిస్టియానో రొనాల్డో కూడా ఒకరు. పోర్చుగల్ సాకర్ జట్టుకు చెందిన రొనాల్డో వద్ద పవర్‌ఫుల్ లాంబోర్గినీ అవెంటేడర్ కారు ఉంది.

ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గినీ అందిస్తున్న అవెంటేడర్‌ను తొలిసారిగా 2011 ఆరంభంలో విడుదల చేశారు. ఈ మోడల్ అనతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకుంది. 700 హార్స్ పవర్, వి12 ఇంజన్, ఆల్-వీల్ డ్రైవ్ కలిగిన ఈ ఇటాలియన్ రేసింగ్ ఎద్దు (రేసింగ్ బుల్‌)ను సగటున రోజు 5 యూనిట్లను మాత్రమే కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.

5. నేమర్, పోర్షే పనామెరా టర్బో ఎస్

5. నేమర్, పోర్షే పనామెరా టర్బో ఎస్

బ్రెజిల్ జట్టుకు చెందిన నేమర్ డా సిల్వా శాంటోస్ వద్ద పోర్షే పనామెరా టర్బో ఎస్ కారు ఉంది.

పోర్షే పనామెరా టర్బో ఎస్ కారులో శక్తివంతమైన 4.8 లీటర్ వి8 ట్విన్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 570 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పోర్షే పనామెరా ఎస్ టర్బో కేవలం 3.5 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 310 కిలోమీటర్లు.

6. డేవిడ్ విల్లా, పోర్షే 911 టర్బో

6. డేవిడ్ విల్లా, పోర్షే 911 టర్బో

స్పెయిన్ సాకర్ జట్టుకు చెందిన ఆటగాడు డేవిడ్ విల్లా వద్ద పోర్షే 911 టర్బో స్పోర్ట్స్ కారు ఉంది.

పోర్షే 911 టర్బో కారులో 3800సీసీ, 6-సిలిండర్, పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 520 బిహెచ్‌పిల శక్తిని, 710 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది.

7. వేన్ రూనీ, రేంజ్ రోవర్ ఓవర్‌ఫించ్

7. వేన్ రూనీ, రేంజ్ రోవర్ ఓవర్‌ఫించ్

ఇంగ్లాండ్ జట్టుకు చెందిన వేన్ రూనీ వద్ద రేంజ్ రోవర్ ఓవర్‌ఫించ్ మోడల్ ఉంది.

రెగ్యులర్ రేంజ్ రోవర్ మోడల్‌ను ఓవర్‌ఫించ్ సంస్థ అధనపు హంగులు జోడించి కస్టమైజ్ చేస్తుంది. రూనీ కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన ఈ మోడల్‌లో 22-ఇంచ్ బెస్పోక్ వీల్స్‌ను అమర్చారు. ఇదొక ఫుల్లీ లోడెడ్ కారు. ఇందులో రెగ్యులర్ వెర్షన్ రేంజ్ రోవర్ కన్నా మరిన్ని అదనపు ఫీచర్లు లభిస్తాయి.

8. రాబిన్ వాన్ పెర్సీ, పోర్షే కయూన్ టర్బో

8. రాబిన్ వాన్ పెర్సీ, పోర్షే కయూన్ టర్బో

నెథర్లాండ్స్ జట్టుకు చెందిన రాబిన్ వాన్ పెర్సీ వద్ద పోర్షే కయూన్ టర్బో కారు ఉంది.

పోర్షే కయూన్‌లో అమర్చిన శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 405 కి.వా. శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎయిర్-ఫిల్డ్ సస్పెన్షన్‌తో కూడిన ఈ కారు ప్రయాణికులకు మంచి కంఫర్ట్ లెవల్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది కేవలం ఈ లగ్జరీ కారు కేవలం 1.6 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని, 20 సెకండ్లలోనే 0-160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.
9. మారియో బలోటెల్లీ, ఫెరారీ ఎఫ్12

9. మారియో బలోటెల్లీ, ఫెరారీ ఎఫ్12

ఇటలీ జట్టుకు చెందిన మారియో బలోటెల్లీ ఇటాలియన్ సూపర్‌కారునే ఎంచుకున్నాడు. అతని వద్ద ఫెరారీ ఎఫ్12 కారు ఉంది.

ఫెరారీ ఎఫ్12 బెర్లినెట్టా గంటకు 340 కి.మీ.కు పైగా వేగంతో ప్రయాణిస్తుంది. ఇదివరకు ఈ మోడల్ ఫెరారీ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన రోడ్ కారుగా ఉండేది. ఇందులో శక్తివంతమైన 6262సీసీ 65 డిగ్రీ వీ12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 730 బిహెచ్‌పిల శక్తిని, 590 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ ఎఫ్1 డ్యూయెల్-క్లచ్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 3.1 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని, 8.5 సెకన్లలో 0-200 కి.మీ. వేగాన్ని పుంజుకుంటుంది.

10. మిసట్ ఓజిల్, ఫెరారీ 458

10. మిసట్ ఓజిల్, ఫెరారీ 458

జర్మనీ జట్టుకు చెందిన మిసట్ ఓజిల్ వద్ద పవర్‌ఫుల్ ఫెరారీ 458 కారు ఉంది.

ఫెరారీ 458 కారులో 562 హార్స్ పవర్, 4.5 లీటర్, వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 590 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.0 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని, 9.1 సెకండ్ల వ్యవధిలోనే 0-200 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.

ఫుట్‌బాల్ ప్లేయర్స్ అండ్ కార్స్

ఇవీ టాప్ 10 ఫుట్‌బాల్ సెలబ్రిటీలు, వారి కార్ల విశేషాలు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే, దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాతో పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, June 26, 2014, 12:09 [IST]
English summary
Take a look at top 10 football players and their cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+