గంటకు 74,00 కిమీ.ల వేగంతో ప్రయాణించగలరు- ఎలాగో మీరే చూడండి.

By Anil

ఈ మధ్య కాలంలో విమాన రంగం బాగా వినియోగంలోకి వస్తోంది. నానాటికీ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి అనుగుణంగా విమాన తయారీ సంస్థలు అధునాతన విమానాలను మరియు ఎయిర్ క్రాఫ్ట్‌లను అభిృద్ది చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే భవిష్యత్తు మొత్తం విమానాలే ఉంటాయనవచ్చు. అయితే మరి భివిష్యత్తు విమానాలు ఎలా ఉంటాయని ఆలోచిస్తున్నారా...? మీ ఆలోచనలకు అడ్డుకట్ట వేయండి. ఎందుకంటే గంటకు 7,400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విమానాలు రానున్న రోజుల్లో రానున్నాయి. ఇలాంటి పది విమానాలను క్రింది కథనంలో అందిస్తున్నాము.

10. ఏరోస్‌క్రాఫ్ట్ డిరిజిబుల్ ఎయిర్‌షిఫ్

10. ఏరోస్‌క్రాఫ్ట్ డిరిజిబుల్ ఎయిర్‌షిఫ్

ఒక ఎకరా విస్తీర్ణానికి సరిపోయేంత పెద్దది ఇది. దీని బరువు సుమారుగా 400 టన్నుల వరకు ఉంటుంది. దీని కోసం ప్రత్యేకించి ఎటువంటి రన్‌వేలు అవసరం లేదు. ఎటువంటి ప్రదేశాలోనైనా సురక్షితంగా ల్యాండ్ అవ్వగలదు. ఇందులో క్రింది వైపుకు అమరి ఉండే హీలియమ్ ఇంజన్‌ను కలదు.

09. లాక్‌హీడ్ మార్టిన్ స్కై‌టగ్ హైబ్రిడ్ ఎయిర్‌షిప్

09. లాక్‌హీడ్ మార్టిన్ స్కై‌టగ్ హైబ్రిడ్ ఎయిర్‌షిప్

ఈ హైబ్రిడ్ ఎయిర్‌షిఫ్ క్రితం స్లైడర్‌లో ఉన్న దానిని పోలి ఉంటుంది. అందులో ఉన్నట్లుగా ఇందులో కూడా క్రింది వైపుకు మళ్లి ఉండే జెట్ ఇంజన్‌లు కలవు. దీని నిర్మాణం పరంగా చూస్తే ఏరోడైనమిక్ రూపంలో ఉంటుంది. తద్వారా ఎక్కువ బరువులను కూడా ఇది మోయగలుగుతుంది.

08. పారదర్శకపు ఎయిర్‌బస్ విమానం 2050

08. పారదర్శకపు ఎయిర్‌బస్ విమానం 2050

భవిష్యత్తు విమానాలలో ఇలాంటి పారదర్శక విమానం కూడా ఒకటుంది. దీనిని ఎయిర్ బస్ సంస్థ రూపొందింస్తోంది. 2050 నాటికి ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. విమానం పై బాగాన్ని పారదర్శకంగా ఉంటే పదర్థంతో తయారు చేస్తున్నారు. తద్వారా రాత్రుళ్లలో విశ్వాన్ని పగటి వేళల్లో ఆకాశాన్ని చూడవచ్చు.

07.ఐకాన్ ఎ5- ఆంపిబియస్ ప్లేన్

07.ఐకాన్ ఎ5- ఆంపిబియస్ ప్లేన్

ఈ ఐకాన్ ఎ5 స్పోర్ట్స్ తరహా ప్లేన్ ద్వారా ఇప్పుడు మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో దీనిని భూమి మరియు నీటి మీద కూడా ల్యాండ్ చేయవచ్చు. ఇందులో 1,211సీసీ గలల రోటాస్912 ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్‌ కలదు. ఇది 100 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. దీని ధర 139,000 డాలర్లుగా ఉంది. అంటే 92.35 లక్షలు రుపాయలు.

06. బోయింగ్ డిస్క్‌రోటర్

06. బోయింగ్ డిస్క్‌రోటర్

దీని రూపాన్ని చూసి పచ్చి రూపొందించారా లేక తెలివిగా రూపొందించారా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే హెలికాఫ్టర్ వంటి రెక్కలు మరియు విమానం వంటి రూపం రెండింటిని ఇందులో కలబోసి రూపొందించారు. ల్యాండింగ్ మరియు టేకాఫ్ సమయంలో హెలికాఫ్టర్ రెక్కలు సహాయపడితే. ప్రయాణించే సమయంలో మాత్రం రెండు వైపులా ఉన్న విమాన ఇంజన్‌లు స్టార్ట్ అవుతాయంట . భలే ఉంది కదూ వీరి ఐడియా.

05.QUEIA 2058 కాన్సెప్ట్ ఎయిర్‌ క్రాఫ్ట్

05.QUEIA 2058 కాన్సెప్ట్ ఎయిర్‌ క్రాఫ్ట్

దీనిని మియామి యూనినవర్శిటి విద్యార్థులు 2008 లో నాసా నిర్విహించిన ఏరోనాటిక్స్ పోటీల్లో దీనిని ప్రదర్శించారు. QUEIA అనగా క్విట్ అల్ట్రా ఎఫిషియంట్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ అని అంటారు. అయితే 2058 తరువాత విమానాలు అన్ని కూడా ఇలాంటి రూపంలో ఉంటాయి అని భావిస్తున్నారు.

04. మ్యాగ్‌లెవ్ ఎయిర్ అర్భన్ ట్రాన్స్‌పోర్ట్

04. మ్యాగ్‌లెవ్ ఎయిర్ అర్భన్ ట్రాన్స్‌పోర్ట్

అయస్కాంత లెవిటేషన్ మరియు స్క్రామ్‌జెట్ ఇంజన్ మిళతంతో రూపొందుతున్న మొదటి విమానం ఇది. ఎంతటి దూరాలనైనా ఛేదించే సామర్థ్యం ఉన్న ఈ విమానాన్ని జార్జ్ మిల్డి, డెనిస్ ఒరస్ మరియు లియోని లావింక్‌జక్ అనే ముగ్గురు డిజైన్ చేశారు.

03. టైమ్ మిషన్ కాదు

03. టైమ్ మిషన్ కాదు

దీనిని చూడగానే ఆధిత్య 369 అనే సినిమాలో ఉన్న టైమ్ మిషన్ గుర్తుస్తోంది కదా. కాని ఇది టై మిషన్ కాదు భవిష్యత్తు విమానాలు ఇలా గోళాకారంగా ఉంటాయి. విమానాల నుండి విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఇలా గోళాకార విమానాలను తయారు చేస్తున్నట్లు తెలిసింది.

02. ఆకాశం నుండి ఖగోళంలోకి

02. ఆకాశం నుండి ఖగోళంలోకి

సాదారణంగా విమానాలు ఆకాశంలోప్రయాణించడానికి మాత్రమే వినియోగిస్తారు. అయితే ఈ ప్లేన్ ద్వారా ఆకాశంలో నుండి అలాగే భూమి ఆవళి వైపున ఉన్న అంతరిక్షంలోకి వెళ్లిపోవచ్చు. పాలపుంతలను మరియు ఖగోళ వింతలను చూసి తిరిగి భూమి మీద ల్యాండ్ అవ్వొచ్చు. ఇందులో ఒక మల్టీ జెట్ ఇంజన్ కలదు. గాలిలో ఉన్న ఆక్సిజన్ ‌ను గ్రహించి ఇందులోని ఇంధనం ద్వారా కలిసి శక్తిగా మారుతుంది. విశ్వంలో గాలి ఉండదు కాబట్టి ఇందులో కొంతమేర ఆక్సిజన్‌ను నింపుకుని వెళుతుంది.

01 .లాక్ హీడ్‌ మార్టిన్ ఎస్‌ఆర్-72

01 .లాక్ హీడ్‌ మార్టిన్ ఎస్‌ఆర్-72

ఎస్‌ఆర్-71 బ్లాక్ బర్డ్ ఎయిర్‌ క్రాఫ్ట్‌ను కన్నా అత్యంత వేగవంతమైనది ఈ ఎస్‌ఆర్-72. ఎస్‌ఆర్-71 విమానం గంటకు మ్యాక్ 3.4 (4,198 కిలోమీటర్ల) వేగంతో పరుగులు పెడుతుంది. అయితే ఈ ఎస్‌ఆర్-72 ఎయిర్ క్రాఫ్ట్ దానికన్నా గరిష్టంగా మ్యాక్ 6 అంటే గంటకు 7,400 కిలోమీటర్ల వేగంతో నింగిలో పరుగులు పెట్టగలదు. ఢిల్లీ నుండి న్యూయార్క్ వరకు ఈ విమానంలో కేవలం గంటా 35 నిమిషాల్లో చేరుకోవచ్చు.

గంటకు 74,00 కిమీ.లు వేగంతో ప్రయాణించే విమానాలు

శబ్దానికన్నా 6 రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్‌ సోనిక్ ప్లేన్

ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమమైన పది అంతర్జాతీయ విమానాశ్రయాలు

గంటకు 74,00 కిమీ.లు వేగంతో ప్రయాణించే విమానాలు

నార్త్ కొరియాను బయపెడుతున్న అమెరికన్ బోయింగ్ బి-52 బాంబర్

More from DriveSpark

Article Published On: Thursday, April 28, 2016, 10:40 [IST]
English summary
You'll Soon Be Able Fly At 7,400Km/h — Find Out How
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+