టాప్ 10 ఫ్యూచర్ మోటార్‌సైకిల్స్

By Ravi

ఆటోమొబైల్ రంగంలో రోజుకో కొత్త సాంకేతికత ఆవిష్కృతమవుతోంది. ఈ తరుణంలో చాలా మందికి భవిష్యత్తులో రవాణా వ్యవస్థ ఎలా ఉండబోతుందనే కుతూహలం కలగటం సహజమే. ఈ ఆలోచన మనకే కాదు, వాహనాలను తయారు చేయాలనుకునే కంపెనీలకు కూడా కలిగింది. అందుకే, భవిష్యత్తు కోసం కొన్ని అద్భుతమైన వాహనాలను కాన్సెప్ట్‌లుగా తయారు చేస్తున్నారు.

ఈ కాన్సెప్ట్ వాహనాల పరంపర ఆటోమొబైల్ రంగం ప్రారంభమైనప్పటి నుంచే జరుగుతోంది. అయితే, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతికతతో ఈ కాన్సెప్ట్ వాహనాలు మరింత అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఊహలకు నిజరూపం ఇవ్వటంలో ఇంజనీర్లు నూటికి నూరు శాతం విజయం సాధించగలుగుతున్నారు.

ఈనాటి మన ఆఫ్ బీట్ శీర్షికలో ఇలాంటి 10 అందమైన, అద్భుతమైన భవిష్యత్ మోటార్‌సైకిళ్లను చూద్దాం రండి.

టాప్ 10 ఫ్యూచర్ మోటార్‌సైకిల్స్

తర్వాతి స్లైడ్‌లలో టాప్ 10 ఫ్యూచర్ మోటార్‌సైకిళ్లకు సంబంధించిన ఫొటోలను చూడండి.

ఐ.కేర్

ఐ.కేర్

మోడ్రన్ టెక్నాలజీ ఈ ఐ.కేర్ కాన్సెప్ట్ బైక్ ఓ మంచి ఉదాహరణ. సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో, మంచి బ్యాలెన్సింగ్ కోసం వెడల్పాటి టైర్లతో స్పీడ్‌ని ప్రధానంగా చేసుకొని దీనిని డిజైన్ చేశారు. ఈ కాన్సెప్ట్ వాహనాన్ని ఫ్రాన్స్‌లో డిజైన్ చేశారు.

హోండా వి4

హోండా వి4

జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా తమ వి4 కాన్సెప్ట్ మోటార్‌సైకిల్‌ను తొలిసారిగా 2008లో జర్మనీలో నిర్వహించిన ఓ ఆటో షోలో ప్రదర్శనకు ఉంచింది. భవిష్యత్తులో మోటార్‌సైకిల్ ఇలా ఉండొచ్చనే ఊహకు నిజరూపం ఇస్తూ కంపెనీ ఈ కాన్సెప్ట్‌ను తయారు చేసింది.

బాంబార్డీర్ ఎంబ్రియో

బాంబార్డీర్ ఎంబ్రియో

బాంబార్డీర్ ఎంబ్రియో ఓ యునిబైక్ (ఒక్క చక్రంతో కూడిన బైక్) లాంటింది. సెల్ఫ్ బ్యాలెన్సింగ్‌తో కూడిన ఈ ఎలక్ట్రిక్ బైక్ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2003లో ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎంబ్రియో ఓ కాన్సెప్ట్ వాహనంగానే మిగిలిపోయింది. మరి ఈ ఫన్ టూ రైడ్ ఎంబ్రియో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కాలమే నిర్ణయించాలి.

కాన్ఫెడరేట్ రెనోవేషియో

కాన్ఫెడరేట్ రెనోవేషియో

ఈ కాన్ఫెడరేట్ రెనోవేషియో మోటార్‌సైకిల్ ఓ ర్యాడికల్ బైక్. దీనిని అమెరికాకు చెందిన ప్రముఖ డిజైనర్లు డిజైన్ చేశారు. ఫ్యూచరిస్టిక్ లుక్ కలిగిన ఈ బైక్ కేవలం ఓ కాన్సెప్ట్ మాత్రమే. భవిష్యత్తులో ఏమైనా ఈ తరహా డిజైన్ బైక్ అందుబాటులోకి రావచ్చేమో.

విక్టరీ విజన్ 800

విక్టరీ విజన్ 800

పోలారిస్ ఇండస్ట్రీస్‌‌కి చెందిన విక్టరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ తయారు చేసిన కాన్సెప్ట్ బైక్ ఇది. దీని పేరు విక్టరీ విజన్ 800. దాదాపు రియలిస్టిక్ లుక్ కలిగిన ఈ బైక్ అత్యంత శక్తివంతమైన బైక్. టూరింగ్, లీజర్ మోటార్‌సైకిల్‌గా దీనిని తీర్చిదిద్దారు.

పెరావెస్ మోనోట్రేసర్

పెరావెస్ మోనోట్రేసర్

పెరావెస్ మోనోట్రేసర్ కాన్సెప్ట్ ఓ అద్భుతమైన ఫ్యూచర్ మోటార్‌సైకిల్. అన్నిరకాల వాతావరణాల్లో రైడర్‌కు పూర్తిస్థాయి ప్రొటెక్షన్‌ను కల్పించేలా ఈ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు. నిజానికి ఇదొక రెండు చక్రాలపై కదిలే కార్ లాంటిదని చెప్పొచ్చు.

బ్యాట్‌పాడ్

బ్యాట్‌పాడ్

ఈ కాన్సెప్ట్ గురించి మిత్రులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బ్యాట్‌మ్యాన్ చిత్రంలో ఈ తరహా బ్యాట్‌పాడ్ వాహనాన్ని చూసే ఉంటారు. రాపిడ్ యాక్సిలరేషన్ కోసం వాటర్ కూలింగ్ టెక్నాలజీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో దీనిని తయారు చేశారు. ఇది చూడటానికి భారీగానే కనిపించినప్పటికీ, రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా తేలికగా అనిపిస్తుందట.

యమహా టెస్సెరాక్ట్

యమహా టెస్సెరాక్ట్

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా తయారు చేసిన ఈ టెస్సెరాక్ట్ కాన్సెప్ట్ వాహనం సాధారణ టూవీర్ల మాదిరిగా రెండు చక్రాలతో కాకుండా నాలుగు చక్రాలతో నడుస్తుంది. యమహా టెస్సెరాక్ట్ కాన్సెప్ట్ వాహనాన్ని తొలిసారిగా 2008 టోక్యో మోటార్ షోలో ఆవిష్కరించారు. వి-షేపులో ఉండే ఎలక్ట్రిక్ మోటార్‌తో దీనిని తయారు చేశారు.

డాడ్జ్ టోమాహాక్

డాడ్జ్ టోమాహాక్

యమహా టెస్సెరాక్ట్ మాదిరిగానే డాడ్జ్ టోమాహాక్ కూడా నాలుగు చక్రాలు కలిగిన బైక్. ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ డాడ్జ్ సృష్టించిన ఈ వాహనం ఓ రకమైన మోటో మొబిల్. దీని మ్యాడ్ లుక్స్‌కి గాను విండోమేకర్ డాడ్జ్ దీనికి టోమాహాక్ అనే పేరు పెట్టారు. ఈ బైక్‌ను తొలిసారిగా 2003 డెట్రాయిట్ ఆటో షోలో ప్రదర్శించారు.

సుజుకి జి-స్ట్రైడర్

సుజుకి జి-స్ట్రైడర్

మరో జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి ఫ్యూచర్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ కోసం ఈ ఫొటోలో కనిపిస్తున్న జి-స్ట్రైడర్ బైక్‌ను డిజైన్ చేసింది. సుజుకి జి-స్ట్రైడర్ చూడటానికి కొంచెం రియలిస్టిక్ కాన్సెప్ట్‌గా అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2003లో జరిగిన టోక్యో మోటార్ షోలో ప్రదర్శించారు. ఇది సగం స్కూటర్, సగం బైక్‌లా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 26, 2014, 17:25 [IST]
English summary
Here is the list of top 10 innovative bikes and though they can be used today.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+