భారతదేశంలో కెల్లా 10 పొడవైన జాతీయ రహదారులు

By Ravi

మన భారతదేశంలో జాతీయ రహదారులకు ఓ ప్రత్యేకత ఉంది. ఇవి దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలను కలుపుకుంటూ పోతాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సంస్కృతి, సాంప్రదాయలు మనకు పరిచయం అవుతుంటాయి. జాతీయ రహదారులలో కొన్ని సుందరంగా ఉంటే మరికొన్ని ప్రమాదకరంగా ఉంటాయి.

ఇది కూడా చూడండి: ప్రపంచంలో కెల్లా టాప్ 10 ఫాస్టెస్ట్ రోడ్స్

ఏదేమైనప్పటికీ, భారతీయులందరినీ ఏకం చేయటంలో ఈ జాతీయ రహదారులు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. మన దేశవ్యాప్తంగా రోడ్లు విస్తరించి ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం, ప్రస్తుతం మన దేశంలో 92,851.05 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు విస్తరించి ఉన్నట్లు సమాచారం. రోడ్ల విస్తరణ కారణంగా ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.

సరే అదంతా అటుంచితే.. ఈనాటి మన ఆఫ్ బీట్ శీర్షికలో భారతదేశంలో కెల్లా అత్యంత పొడవైన 10 జాతీయ రహదారుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

భారతదేశంలో కెల్లా 10 పొడవైన జాతీయ రహదారులు

తర్వాతి స్లైడ్‌లలో భారతదేశంలో కెల్లా అత్యంత పొడవైన 10 జాతీయ రహదారుల గురించి తెలుసుకోండి.

Picture credit: Wiki Commons

j929

10. ఎన్‌హెచ్ 31

10. ఎన్‌హెచ్ 31

ఈ జాబితాలో టాప్ 10 స్థానంలో ఉన్న ఎన్‌హెచ్ 31. ఈ రోడ్డు మొత్తం పొడవు 1125 కిలోమీటర్లు. జార్ఖండ్‌లోని బర్హి వద్ద ప్రారంభమయ్యే ఈ రోడ్డు గౌహతిలోని జాలుక్‌బరి వరకూ విస్తరించి ఉంది. ఈ రోడ్డు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సామ్ రాష్ట్రాలను కలుపుతూ పోతుంది. ఈ హైవేలోని ఓ సెక్షన్ ఈస్ట్-వెస్ట్ కారిడార్ క్రిందకు వస్తుంది.

Picture credit: Wiki Commons

Tanmoy Bhaduri

9. ఎన్‌హెచ్ 3

9. ఎన్‌హెచ్ 3

ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్న రోడ్డు ఎన్‌హెచ్ 3. దీనిని ఏబి రోడ్ అని కూడా పిలుస్తారు. ఇది అగ్రా, ముంబైలను కలుపుతుంది. దీని మొత్తం పొజవు 1190 కిలోమీటర్లు. ఆగ్రా మరియు గ్వాలియర్‌లోని రోడ్డు నార్త్-సౌత్ కారిడార్ క్రిందకు వస్తుంది. ముంబై వైపు ఉండే ఎన్‌హెచ్3ని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే అని, ముంబై నాసిక్ ఎక్స్‌ప్రెస్ హైవే అని కూడా పిలుస్తారు.

Picture credit: Wiki Commons

rajkumar1220

8. ఎన్‌హెచ్ 4

8. ఎన్‌హెచ్ 4

ఇకపోతే, ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్న రోడ్డు ఎన్‌హెచ్ 4. ఇది భారతదేశంలోని నాలుగు అత్యంత ప్రధాన నగరాలను కలుపుతుంది. దీని మొత్తం పొడవు 1235 కిలోమీటర్లు. ఈ రోడ్డు ముంబై, పూనే, బెంగుళూరు, చెన్నై నగరాలను కలుపుతుంది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల గుండా సాగిపోతుంది.

Picture credit: Wiki Commons

Ashwin Kumar

7. ఎన్‌హెచ్ 17

7. ఎన్‌హెచ్ 17

ఇందులో 7వ స్థానంలో ఉన్న రోడ్డు ఎన్‌హెచ్ 17. భారతదేశపు పశ్చిమ తీర ప్రాంతంలో ఉత్తరం నుంచి దక్షిణం వైపు సాగిపోయే ఈ రోడ్డు పశ్చిమ కనుమలకు సమాంతరంగా ఉంటుంది. ఈ రోడ్డు మహారాష్ట్రలోని పాన్‌వెల్ నుంచి కేరళలోని కొచ్చిన్ కలుపుతుంది. ఈ హైవే చాలా అందమైనది. మొత్తం 1269 కిలోమీటర్ల దూరం ఉండే ఈ రోడ్డు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలను కలుపుతుంది. ఈ రహదారి పొడవునా వెళ్తే మనకు ఆరు విభిన్న భాషలు మాట్లాడే వ్యక్తులు ఎదురవుతారు.

Picture credit: Wiki Commons

SBC-YPR

6. ఎన్‌హెచ్ 8

6. ఎన్‌హెచ్ 8

ఈ జాబితాలో 6వ స్థానంలో ఉన్న రోడ్డు ఎన్‌హెచ్ 8. మొత్తం 1428 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రోడ్డు ఢిల్లీ మరియు ముంబై నగరాలను కలుపుతుంది. ఇంకా ఈ రోడ్డు గుర్గావ్, ఆజ్మర్, ఉదయ్‌పూర్, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, వడోదరా నగరాలను కలుపుకుంటూ పోతుంది. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టులో కూడా ఈ హైవే భాగమే.

Picture credit: Wiki Commons

Vssun

5. ఎన్‌హెచ్2

5. ఎన్‌హెచ్2

ఎన్‌హెచ్2 లేదా ఢిల్లీ-కలకత్తా రోడ్డుగా పిలిచే హైవే ఈ జాబితాలో 5వ స్థానంలో ఉంది. భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే హైవేలలో ఇది కూడా ఒకటి. మొత్తం 1465 కిలోమీటర్ల మేర ఉండే ఈ రోడ్డు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాళ్ ప్రాంతాల గుండా సాగిపోతుంది. ఏషియన్ రోడ్ నెటవర్క్, ఏహెచ్1లో భాగమైన ఈ రోడ్డు దాదాపు 34 నగరాలను కలుపుతూ పోతుంది.

Picture credit: Wiki Commons

Atishtiwari18

4. ఎన్‌హెచ్ 15

4. ఎన్‌హెచ్ 15

ఇక ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్న రోడు ఎన్‌హెచ్ 15. ఈ ఎన్‌హెచ్ 15 రోడ్డు గుజరాత్‌లోని సమఖియలి నుంచి పంజాబ్‌లోని పథన్‌కోట్ వరకూ ఉంటుంది. దీని మొత్తం పొడవు 1526 కిలోమీటర్లు. ఇది పంజాబ్, గుజరాత్, రాజస్థాన్‌ల గుండా సాగిపోతుంది.

Picture credit: BCMTouring

KurtRules

3. ఎన్‌హెచ్ 5

3. ఎన్‌హెచ్ 5

టాప్ 3 రోడ్డు ఎన్‌హెచ్ 5, దీని మొత్తం పొడవు 1533 కిలోమీటర్లు. ఇది ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ సాగిపోతుంది. ఇది ఒడిషాలోని జార్పోఖరియా నుండి ప్రారంభమై తమిళనాడులోని చెన్నై వద్ద ముగుస్తుంది. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టులో ఈ రోడ్డు కూడా ఓ భాగం.

Picture credit: Wiki Commons

Adityamadhav83

2. ఎన్‌హెచ్ 6

2. ఎన్‌హెచ్ 6

టాప్ రోడ్డు ఎన్‌హెచ్ 6, దీని మొత్తం పొడవు 1949 కిలోమీటర్లు. ఇది దేశంలో కెల్లా రెండ అత్యంత పొడవైన జాతీయ రహదారి. అతి రద్దీగా ఉండే రోడ్డు కూడా ఇదే. పశ్చిమం నుంచి తూర్పుకు సాగిపోయే ఈ రోడ్డు గుజరాత్‌లోని హాజిరా వద్ద ప్రారంభమై పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా వద్ద ముగుస్తుంది. ఇది గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాళ్ రాష్ట్రాలను కలుపుతూ పోతుంది.

Picture credit: Wikimapia

1. ఎన్‌హెచ్ 7

1. ఎన్‌హెచ్ 7

దేశంలో కెల్లా అత్యంత పొడవైన జాతీయ రహదారి ఎన్‌హెచ్ 7. ఇది దేశంలో 21 ప్రధాన నగరాలను కలుపుతూ సాగిపోతుంది. ఈ హైవేని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తుంటుంది. ఇది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వద్ద ప్రారంభమై తమిళనాడులో కన్యాకుమారి వద్ద ముగుస్తుంది. ఈ రోడ్డు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను కలుపుకుంటూ పోతుంది.

Picture credit: Wiki Commons

j929

More from DriveSpark

Article Published On: Thursday, July 17, 2014, 15:48 [IST]
English summary
The Indian National Highway system is a complex system of roads that connects every major city in India. Not just major cities but it also runs across the length and breadth of our country. This road system measures over 92,851.05 km and is growing day by day. Here are the top 10 longest highways in India:
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+