సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఇలాంటి ల్యాండింగ్ ఎయిర్‌పోర్ట్‌లను చూశారా ?

By Anil

విమానం ప్రయాణం అనేది ఎంతో మంది కల. ఇక అందులో ప్రయాణించే అవకాశం లభిస్తే వారి ఆనందాలకు అవదులే ఉండవు. విమాన ప్రయాణంలో ల్యాండింగ్ మరియు టే కాఫ్ అనే రెండు ఘట్టాలు సరిగ్గా జరిగితేనే ప్రాణాలతో భయటపడగలం.

అయితే టే కాఫ్ కన్నా ల్యాండింగ్ అనే ఘట్టం ఇంకా ప్రమాదకరమైనది, కాస్త అటు ఇటు జరిగితే అంతే సంగతులు. ల్యాండింగ్ అంటేనే పై ప్రాణాలు పైకిళ్లిపోయే రీతిలో భీతిని కలిగించే విధంగా ప్రపంచ వ్యాప్తంగా పది ఎయిర్ పోర్ట్‌లు ఉన్నాయి. ప్రయివేట్‌ఫ్లై.కామ్ అనే వెబ్‌సైట్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ పది ఎయిర్‌పోర్ట్‌ల గురించి క్రింది కథనంలో అందించాము.

10. లండన్ సిటి ఎయిర్ పోర్ట్, యుకె

10. లండన్ సిటి ఎయిర్ పోర్ట్, యుకె

కాస్త అటు ఇటుగా ప్లైట్ ల్యాండ్ అయిందంటే నేల మీద కాదు సముద్రంలో ల్యాండ్ అయిపోతాం. ల్యాండ్ అయ్యేంతవరకు అధ్యంతం ఉత్కంఠతను రేపే ఈ ఎయిర్‌పోర్ట్ లండన్ సిటిలో కలదు.

Image Source

09. లాస్ ఏంజిల్స్ ఎయిర్‌పోర్ట్, అమెరికా

09. లాస్ ఏంజిల్స్ ఎయిర్‌పోర్ట్, అమెరికా

చుట్టూ బెవర్లీ కొండలు ఆ మధ్యలో లాస్ ఏంజిల్స్ నగరం అందులో రకరకాల విద్యుత్ కాంతులో ట్రాఫిక్ చప్పుళ్లతో ఈ ఎయిర్ పోర్ట్ గందరగోళంగా ఉంటుంది. కారణం నగరం నడిబొడ్డున ఎయిర్‌పోర్ట్ ఉండటం. అడ్వెంచర్‌ని ఆనందించే వారికి ఇక్కడ ల్యాండింగ్ ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రాణం భయం ఉన్నవారు ల్యాండ్ అవకుండానే హరీ అంటారు.

image Source - Wikimedia Commons

 08. ప్రిన్సెస్ జులియన్ అంతర్జాతీయ విమానాశ్రయం, సెయింట్. మార్టిన్

08. ప్రిన్సెస్ జులియన్ అంతర్జాతీయ విమానాశ్రయం, సెయింట్. మార్టిన్

ఇదో కొత్త రకంఎయిర్ పోర్ట్, బీచ్‌కు అర కిలోమీటర్ దూరంలోనే ఎయిర్ పోర్ట్‌లో ల్యాండింగ్ రన్‌వేను నిర్మించారు, ఇది చాలదు అన్నట్లుగా బీచ్ మరియు రన్‌వేకు మధ్యలో రహదారి ఒకటి నిర్మించారు. విమనాం లాండింగ్ ఎత్తు కాస్త అటు ఇటు అయితే విమానం ఇంజన్ ఫెన్సింగ్ తగిలి పేలిపోయే అవకాశం ఉంది.

Image Source - Wikimedia Commons

07. డొనిగల్ ఎయిర్‌పోర్ట్, ఐర్లాండ్

07. డొనిగల్ ఎయిర్‌పోర్ట్, ఐర్లాండ్

ఇది ఐర్లాండ్ లో కలదు. చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్న దీవులు సముదాయం, అన్ని కూడా ఒకే రంగులో ఉంటాయి. దీనికి ప్రక్కనే ఇదే రంగులో ఉండే రహదారి ఉంది, దీనిని రన్‌వేగా భావించి పైలట్ మహాప్రభు దీని మీద ల్యాండ్ చేస్తే సీదా సముద్రంలో దిగాల్సి వస్తుంది.

image source

 06. బిల్లీ బిషప్ టొరంటో సిటి ఎయిర్ పోర్ట్, కెనడా

06. బిల్లీ బిషప్ టొరంటో సిటి ఎయిర్ పోర్ట్, కెనడా

కెనడా నగరంలో అందమైన మరియు అత్భుతమైన ఎయిర్ పోర్ట్ బిల్లీ బిషప్ టొరంటో ఎయిర్‌పోర్ట్. పూర్తిగా నీటి మీద ఆధారంతో ఈ రన్‌వేను నిర్మించారు. ఇక్కడ కూడా అదే పరిస్థింతి. జాగ్రత్తగా ల్యాండ్ చేస్తే సరేసరి లేదంటే సముద్రమే గతి.

Image Source - Wikimedia Commons

05. సబా ఎయిర్‌పోర్ట్, కరేబియన్ నెథర్లాండ్స్

05. సబా ఎయిర్‌పోర్ట్, కరేబియన్ నెథర్లాండ్స్

ఇది కరేబియన్ ఐలాండ్‌లలో ఉన్న రాళ్ల పర్వతాలకు సముద్ర అంచులో నిర్మించారు. ఇందులో ఉన్న రన్‌‌వే పొడవు కేవలం 396 మీటర్లు మాత్రమే.

Image Source - Wikimedia Commons

04. బరా ఎయిర్‌పోర్ట్, స్కాట్లాండ్

04. బరా ఎయిర్‌పోర్ట్, స్కాట్లాండ్

వర్షాకాలంలో వరదలు వస్తే ఈ ఎయిర్ పోర్ట్‌ ఇలాగే ఉంటుంది మరియు విమానాలు ఇలాగే ల్యాండ్ అవుతాయి.

Image Source

03. క్వీన్స్‌టౌన్ ఎయిర్‌పోర్ట్, న్యూజిలాండ్

03. క్వీన్స్‌టౌన్ ఎయిర్‌పోర్ట్, న్యూజిలాండ్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ ఎయిర్‌పోర్ట్ ల్యాండ్ అయినా కూడా కలగని అనుభూతి దీని ద్వారా పొందుతారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే సమయంలో కొండలు, నదులు, వాగులు, జలపాతాలు వంటి అన్ని ప్రకృతి రమణీయ ప్రదేశాలను ఒకేసారి చూడగలం.

Image Source

2. నైస్ కోట్ డిఅజుర్ ఎయిర్‌పోర్ట్, ఫ్రాన్స్

2. నైస్ కోట్ డిఅజుర్ ఎయిర్‌పోర్ట్, ఫ్రాన్స్

ఫ్రాన్స్‌లో ఉన్న ఈ రమణీయమైన ఎయిర్ పోర్ట్ ఒక వైపు సముద్రం మరో వైపు నగరం ఈ రెండింటికీ దూరంలో నునుపు కొండలు. మొత్తానికి ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయ్యేటపుడు చక్కటి అనుభూతిని పొందవచ్చు. అయితే ఏమయినా కొంచెం తేడా జరిగితే.... అంతే సంగతులు.

Image Source - Wikimedia Commons

 01. మాల్టా ఎయిర్‌పోర్ట్ , మాల్టా

01. మాల్టా ఎయిర్‌పోర్ట్ , మాల్టా

ముందుగా ఈ ప్రదేశాన్ని చూస్తే ఇందులో రన్‌వే ఎక్కడుంది అనుమానం తప్పకుండా కలుగతుంది. ఇక్కడ తెల్లగా పెద్దగా రాతిబండల నిర్మాణంలో ఉన్న గోడల మీద ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే పెద్ద పెద్ద విమానాలు కాకుండా చిన్న జెట్ మరియు ఎయిర్ క్రాఫ్ట్‌లను ల్యాండ్ చేయవచ్చు.

Image Source

సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఇలాంటి ఎయిర్‌పోర్ట్‌లను చూశారా ?
  • ప్రపంచంలో కెల్లా అత్యంత భయంకరమైన ఎయిర్‌పోర్ట్ రన్‌వేస్

More from DriveSpark

Article Published On: Friday, April 22, 2016, 12:51 [IST]
English summary
World's Stunning Airport Approaches You've Never Seen Before – Pics
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+