మే నెలలో ఎక్కువగా అమ్ముడుపోయిన కార్లు ఇవే.. జనం వీటినే ఎందుకు కొంటున్నారో తెలుసా?
2023 మే నెల ముగియడంతో వాహన తయారీ సంస్థలన్నీ కూడా తమ అమ్మకాల నివేదికలను అధికారికంగా విడుదల చేశాయి. ఇందులో 2023 మే నెలలో అత్యధిక అమ్మకాలు పొందిన కంపెనీ ఏది, మరియు అతి తక్కువ అమ్మకాలను పొందిన కంపెనీ ఏది అనే మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి టాప్ 10 కంపెనీల అమ్మకాలను తప్పకుండా తెలుసుకోవాలి.
వెల్లడైన అమ్మకాల గణాంకాల ప్రకారం టాప్ 10 లో మారుతి సుజుకి తన బ్రాండ్ కార్ల సేల్స్‌తో మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. మే నెలలో కార్ల అమ్మకాల్లో టాప్ 10 స్థానాల్లో నిలిచిన కంపెనీలు ఏవి? ఏయే కంపెనీలు ఎన్ని యూనిట్ల వాహనాలను అమ్మగలిగాయి, అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో.

మారుతి సుజుకి : మారుతి సుజుకి ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. మారుతి సుజుకి బాలెనో అమ్మకాలు 2023 మే నెలలో 18,733 యూనిట్లు. గతేడాది ఇదే నెలలో బాలెనో అమ్మకాలు 13,970 యూనిట్లు. అంటే గతేడాదితో పోలిస్తే 34.09 శాతం వృద్ధి సాధించింది. 4,763 యూనిట్లు లాభపడి, ఈ జాబితాలో బాలెనో 13.34 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ 17,346 యూనిట్లతో 2 వ స్థానంలో నిలిచింది. గతేడాది మే నెలతో పోలిస్తే 3,213 యూనిట్లు లాభపడింది. 2022 మే నెల అమ్మకాలతో పోలిస్తే 22.73 శాతం వృద్ధిని సాధించింది. మారుతి సుజుకి మరో మోడల్ వ్యాగన్ R 16,258 యూనిట్ల సేల్స్‌తో మూడవ స్థానంలో నిలిచింది.
గతేడాది మే నెలలో 16,814 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసుకున్న వ్యాగన్ R.. ఈ ఏడాది అమ్మకాల్లో 3.31 శాతం క్షీణించింది. ఇంకా మారుతి ఇతర మోడళ్లు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, మారుతి సుజుకి ఎకో, మారుతి సుజుకి డిజైర్ వరుసగా సేల్స్‌లో 6,7, 8 స్థానాల్లో నిలిచాయి.
ఇంకా హ్యుందాయ్ క్రెటా 14,449 సేల్స్‌తో నాలుగవ స్థానం దక్కించుకుంది. గతేడాది మే నెలలో 10,973 అమ్మకాలను నమోదు చేసుకోగా.. 32 శాతం వృద్ధి సాధించింది. టాటా నెక్సాన్ 14,423 యూనిట్ల అమ్మకాలతో ఐదవ స్థానంలో నిలిచింది. గతేడాది అమ్మకాలను చూసుకుంటే 14,614 ఉండగా.. ఈ సారి ఒక శాతం క్షీణించింది.
బ్రెజ్జా గత నెలలో 13,398 యూనిట్లు విక్రయించగా.. మే 2022 లో 10,312 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. దీంతో బ్రెజ్జా 29.93 శాతం వృద్ధి సాధించింది. మారుతి ఈకో మే నెలలో 12,818 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 10,482 అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది 22 శాతం వృద్ధి సాధించింది.
మారుతి సుజుకి డిజైర్ 11, 315 యూనిట్ల అమ్మకాలతో 8 వ స్థానంలో ఉండగా.. గతేడాదితో పోలిస్తే 2 శాతం క్షీణించింది. టాటా పంచ్ గత నెలలో 11,124 యూనిట్లను విక్రయించడంతో గతేడాది కంటే 883 యూనిట్లు పెరిగి 8.62 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. మారుతి ఎర్టిగా 10,528 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసుకోగా గతేడాదితో పోలిస్తే వృద్ధిలో 14 శాతం క్షీణించింది.
మొత్తంగా చూసుకుంటే ఈ టాప్ 10 కార్లు గత నెలలో 1,40,392 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసుకున్నాయి. గతేడాది అదే నెలలో 1,25,368 విక్రయాలు జరగగా.. ఈ ఏడాది 11.98 శాతం వృద్ధిని సాధించాయి. 15,024 యూనిట్ల కార్లు అధికంగా సేల్స్‌ను నమోదయ్యాయి.
టాప్ 10 ఎస్‌యూవీలు : ఈ గ్రూప్‌లోకి ఇటీవల ప్రవేశించిన మారుతి సుజుకి ఫ్రాంక్స్.. ప్రారంభించిన రెండవ నెలలోనే 9,683 యూనిట్లను విక్రయించింది. స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో N కలిపి 9,318 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసుకుంది. గతేడాదితో పోలిస్తే 4,970 యూనిట్లు లాభపడి 114.31 శాతం వృద్ధిని సాధించింది.
క్రెటా మరియు నెక్సాన్ ఎస్‌యూవీలు వరుసగా 14,449 యూనిట్లు, 14,423 యూనిట్ల అమ్మకాలతో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక మారుతి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ చూసుకుంటే గత నెలలో 8,877 యూనిట్ల విక్రయాలను నమోదు చేసుకుంది. టాటా పంచ్, వెన్యూ 4, 5 స్థానాల్లో నిలిచాయి.
కియా సోనెట్ ఎస్‌యూవీ గత నెలలో 8,251 యూనిట్లను విక్రయించింది. గతేడాది 7,899 యూనిట్ల సేల్స్‌తో ఈసారి 4.46 శాతం వృద్ధిని సాధించంది. మహీంద్రా XUV 700 5,245 సేల్స్‌తో 3.47 శాతం నమోదు చేసుకుంది. మొత్తంగా టాప్ 10 ఎస్‌యూవీలు మే 2023 లో 46.30 శాతం వృద్ధితో 1,04,981 యూనిట్లను విక్రయించాయి.


Click it and Unblock the Notifications








