ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

సాధారణంగా కారు కొనడం అనేది చాలామందికి ఒక కల. అయితే ఈ కలను కొంతమంది సహకారం చేసుకుంటారు. మరి కొందరికి ఆ కల కలగానే మిగిలిపోయింది. అది చిన్న కారు కావొచ్చు లేదా లగ్జరీ కారు కావచ్చు. ఏదైతే ఎమ్ కల సహకారం కావడానికి. మనదేశంలో కారు కొనడానికి సాహసం చేస్తుంటే, కొన్ని దేశాల్లోని సంపన్నులు అత్యంత ఖరీదైన కార్లను కొనడానికి కూడా వెనుకాడటం లేదు. ఆ కారణంగానే ప్రపంచ మార్కెట్లో చాలా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.

మనం ఈ ఆర్టికల్ లో ప్రపంచ మార్కెట్లో ఉన్న అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లను గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

01. రోల్స్ రాయిస్ బోట్ టైల్ (Rolls-Royce Boat Tail):

మనం చెప్పుకుంటున్న టాప్ 10 ఖరీదైన కార్లలో మొదటి స్థానంలో ఉన్న కారు 'రోల్స్ రాయిస్' (Rolls-Royce) కంపెనీ యొక్క బోట్ టైల్ (Boat Tail). దీని ధర ఒక కోటి, రెండు కోట్లు కాదు. ఏకంగా 28 మిలియన్ డాలర్లు. ఇది భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ. 214.59 కోట్లు. ధర వింటేనే మనం షాక్ అవుతాము, కదా. అయితే ఇంత ఖరీదైన కారు కూడా ప్రపంచ మార్కెట్లో ఉంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

కేవలం ధర మాత్రమే కాదు ఈ బోట్ టెయిల్ లగ్జరీ కారులో కనిపించే ఫీచర్స్ కూడా రోల్స్ రాయిస్ కంపనీ ఇప్పటివరకు మరే ఇతర కారులోనూ ప్రవేశపెట్టలేదు. కావున ఈ కారుని కంపెనీ యొక్క వెరీ స్పెషల్ కారుగా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది ఇతర రోల్స్ రాయిస్ కార్లకంటే కూడా చాలా స్పెషల్.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

ఈ రోల్స్ రాయిస్ కారులోని అత్యంత ఆకర్షనీయమైన ఫీచర్, దాని వెనుక డెక్‌లో కనిపించే కాక్టెయిల్ స్టోర్. ఇందులో అనేక రకాలైన డ్రింక్స్ నిల్వచేసుకోవచ్చు. దీనితో పాటు, కన్వర్టిబుల్‌ టేబుల్స్ మరియు కుర్చీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇందులో ఉండటం వల్ల పిక్నిక్ లేదా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు చాలా ఉపయోగపడుతుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

2. బుగట్టి లా వోయిచర్ నోయిర్ (Bugatti La Voiture Noire):

మన జాబితాలో అత్యంత ఖరీదైన రెండవ కారు ఈ 'బుగట్టి లా వోయిచర్ నోయిర్' (Bugatti La Voiture Noire). దీని ధర 13.4 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని ధర రూ. 102.74 కోట్లు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

'బుగట్టి లా వోయిచర్ నోయిర్' చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది అద్భుతమైన పనితీరుని కూడా అందిస్తుంది. ఇది బుగట్టి కంపెనీ యొక్క డివో మాదిరిగానే క్వాడ్-టర్బో డబ్ల్యు16 8.0-లీటర్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 1,500 హెచ్‌పి పవర్ మరియు 1,600 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

03. రోల్స్ రాయిస్ స్వెప్‌టైల్ (Rolls-Royce Sweptail):

ప్రపంచంలో మూడవ అత్యంత ఖరీదైన లగ్జరీ కారు రోల్స్ రాయిస్ యొక్క స్వెప్ట్ టైల్. దీని ధర 12.8 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 98.14 కోట్లు. ఈ లగ్జరీ కారు 6.75-లీటర్ వి12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 453 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. రోల్స్ రాయిస్ స్వెప్‌టైల్ ప్రపంచంలోనే చేతితో నిర్మించిన ఏకైక మరియు అత్యంత ఖరీదైన కారుగా ప్రసిద్ధి చెందింది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

04. బుగట్టి సెంటోడీసీ (Bugatti Centodieci):

ప్రపంచ మార్కెట్లో 'బుగట్టి సెంటోడీసీ' కారు ధర 9 మిలియన్ డాలర్లు. అంటే భారతదేశపు కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 69 కోట్లు. బుగట్టి అనేది ప్రెంచ్ కార్ మేకర్. ఇది 8.0-లీటర్ డబ్ల్యు16 ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 1,600 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.4 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కావున ఇది అత్యంత వేగవంతమైన కారు కూడా. దీని గరిష్ట వేగం గంటకు 378 కిమీ వరకు ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

05. మెర్సిడెస్ మేబ్యాచ్ ఎగ్జిలోరో (Mercedes-Maybach Exelero):

మెర్సిడెస్ మేబ్యాచ్ ఎగ్జిలోరో ధర 8.0 మిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 61.34 కోట్లు. ఈ లగ్జరీ కారు ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 690 బిహెచ్‌పి పవర్ ఉతప్పటి చేస్తుంది. అంతే కాకుండా ఈ కారు కేవలం 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 349 కిలోమీటర్లు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

06. ఎస్‌పి ఆటోమోటివ్ ఖోస్ (SP Automotive Chaos):

ఎస్‌పి ఆటోమోటివ్ ఖోస్ అనేది ప్రపంచ మార్కెట్లో మరియు మనం చెప్పుకుంటున్న ఈ జాబితాలో 6 వ ఖరీదైన కారు. దీని ధర ప్రపంచ మార్కెట్లో 6.4 మిలియన్ డాలర్లు కాగా, భారతీయ కరెన్సీ ప్రకారం 49.07 కొట్ల రూపాయలు. ఈ లగ్జరీ కారు 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి10 ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

07. బుగట్టి డివో (Bugatti Divo):

బుగట్టి కంపెనీ యొక్క డివో అనేది ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన మరో కారు. దీని ధర 5.8 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీ ప్రకారం రూ. 44.5 కోట్లు. ఈ కారు చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి పనితీరుని అందిస్తుంది. అంతే కాకుండా అత్యధిక వేగంతో ప్రయాణించే కార్ల జాబితాలో 'బుగట్టి డివో' కూడా ఒకటి.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

08. కోయినిగ్సెగ్ సిసిఎక్స్ఆర్ ట్రెవిటా (Koenigsegg CCXR Trevita):

కోయినిగ్సెగ్ సిసిఎక్స్ఆర్ ట్రెవిటా ధర భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 36.8 కోట్లు కాగా, ప్రపంచ మార్కెట్లో దీని ధర 4.8 మిలియన్ డాలర్లు. ఈ ఆధునిక సూపర్ కారు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. కావున మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

09. బుగట్టి బోలిడే (Bugatti Bolide):

బుగట్టి కంపెనీ యొక్క బోలిడే ధర 4.7 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 36 కోట్లు). కంపెనీ ఈ సూపర్ కారుని కేవలం 40 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. ఇది అత్యధిక పనితీరుని కనపడిచే కార్ జాబితాలో ఒకటిగా ఉంది. ఇది అద్భుతమైన పనితీరుని కూడా అందిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

10. లంబోర్ఘిని వెనెనో (Lamborghini Veneno):

మనం చెప్పుకుంటున్న అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో తక్కువ ధర కలిగిన కారు 'లంబోర్ఘిని వెనెనో' దీని ధర 4.5 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 34.5 కోట్లు. ఇది మొదటిసారి 2013 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించబడింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

లంబోర్ఘిని వెనెనో (Lamborghini Veneno) అనేది 6.5-లీటర్ వి12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 740 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటి.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 కార్లు..ఇవే: తప్పకుండా ఒక్క సారైనా చూడాల్సిందే

చూసారు కదా ఇవే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కారు. ఇందులో మీకు నచ్చిన కారు ఉందేమో చూడండి. ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, April 28, 2022, 17:00 [IST]
English summary
Top 10 world most expensive cars bugatti bolide rolls royce sweptail boat tail details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+