ప్రపంచంలో కెల్లా టాప్ 10 వరస్ట్ ట్రాఫిక్ జామ్ సిటీలు

By Ravi

పెరుగుతున్న జనాభాతో పాటే రోడ్లపై వాహనాల రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ప్రధానంగా భారతదేశం వంటి దేశాల్లో కొన్ని వర్గాల ప్రజల ఆర్థికస్థితి మెరుగు పడుతుండటం మరియు వారి కొనుగోలు శక్తి పెరుగుతుండటం కూడా వాహనాల రద్దీకి కారణమవుతోంది. ఒకప్పుడు ప్రజలు ప్రయాణాలు చేయాలంటే ప్రజా రవాణా వ్యవస్థ (ప్రభుత్వ బస్సులు, రైళ్లు మొదలైనవి) మాత్రమే ప్రధానంగా అందరికీ అందుబాటులో ఉన్న మార్గం.

కానీ, ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థను ఆశ్రయించే వారి సంఖ్య కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆర్థిక స్థితి కొంచెం మెరుగ్గా ఉన్న వాళ్లు సొంత వాహనం కొనుక్కొని (బైక్ లేదా కారు) దానిపై సంచరిస్తున్నారు. అలాగే ఆర్థిక పుష్కలంగా ఉండే కుటుంబాలకు చెందిన వారి ఇళ్లలో ఎంత మంది ఉంటే, అంత మందికి ఒక్కొక్క వాహనం ఉంటున్న సందర్భాలను కూడా మనం నిత్యం గమనిస్తూనే ఉన్నాం.

ఏదేమైనప్పటికీ, మొత్తమ్మీద చూసుకుంటే రోడ్లపై వాహనాల సంఖ్య పెరగుతుండటంతో ట్రాఫిక్ జామ్‌లు కూడా ఎక్కువ అవుతున్నాయి. ట్రాఫిక్ జామ్‌లకు వాహనాలే ప్రధాన కారణం అని చెప్పడానికి లేదు. ఇరుకుగా, అస్తవ్యస్తంగా ఉండే రోడ్లు, సరైన సిగ్నల్ సిస్టమ్ లేకపోవటం, వాహనం నడిపే వారిలో రోడ్డు నిబంధనల గురించి అవగాహన లేకపోవటం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు భారీ ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నాయి.

ఈ కథనంలో మనం ప్రపంచంలో కెల్లా టాప్ 10 వరస్ట్ ట్రాఫిక్ జామ్ సిటీల గురించి తెలుసుకుందాం రండి (ఇందులో మనదేశం కూడా ఉందడోయ్).

బ్యాంకాక్, థాయ్‌లాండ్

బ్యాంకాక్, థాయ్‌లాండ్

బ్యాంకాక్‌లో ట్రాఫిక్ సమస్య నానాటికీ పెరుగుతోంది. ఇందులో ప్రధాన కారణం, అక్కడి ప్రభుత్వం మొదటిసారిగా కారు కొనుగోలు చేసే వారికి పన్నును తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించడంతో వాహనాలను కొనుగోలుచేసే వారి సంఖ్య పెరగటమే. దీనికితోడు అక్కడి ప్రజలు కారును కలిగి ఉండటమంటే, స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. అందుకే ఇప్పుడు ఈ నగరంలో 50 లక్షలకు పైగా వాహనాలు సంచరిస్తున్నాయి.

జకార్తా, ఇండోనేషియా

జకార్తా, ఇండోనేషియా

ఇండోనేషియాలో ట్రాఫిక్ జామ్ గంటల పాటు సాగుతుంది. విస్తీర్ణంలో చిన్న దేశమైన ఇండోనేషియా రాజధాని రోడ్లు నిత్యం వాహనాలు చేసే మ్రోతతో మార్మోగిపోతుంటాయి. ఈ నగరంలో కొద్ది దూరం ప్రయాణించడానికి కూడా గంటల సమయం పడుతుంది. ఇందుకు ప్రధాన కారణం ఇండోనేషియాలో ప్రజా రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోవటమే అనేది అక్కడి ప్రజల వాదన.

నైరోబి, కెన్యా

నైరోబి, కెన్యా

ఇది కూడా జనాభా పరంగా చిన్న దేశమే, కానీ ట్రాఫిక్ జామ్‌ల జాబితాలో మాత్రం ఇది ఇతర దేశాల కన్నా ముందుంది. నైరోబి రోడ్లపై గుండ్రటి మలుపులు ఎక్కువగా ఉంటాయి, అక్కడ ట్రాఫిక్ జామ్‌లు కావటానికి ఇవే ప్రధాన కారణం. మరోవైపు చిన్న పాటి వర్షం పడినా లేదా ప్రతి శుక్రవారం గమనించినా ఈ నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది.

మనీలా, ఫిలిప్పీన్స్

మనీలా, ఫిలిప్పీన్స్

ఫిలిప్సీన్స్‌లోని మనీలా నగరంలో కూడా ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ రద్దీని కంట్రోల్ చేసేందుకు అక్కడ అధికారులు ఓ వినూత్న సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. సరి/బేసి సంఖ్యలతో కూడిన రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉన్న కార్లను నగరంలో తిప్పేందుకు ప్రత్యేక రోజులను కేటాయించారు. ఉదాహరణకు, వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ 1 లేదా 2వ నెంబరుతో ముగిస్తే, అలాంటి వాహనాలను సోమవారం రోడ్డుపై తిప్పటానికి అనుమతి ఉండదు. అలాగే, 3 లేదా 4వ నెంబరుతో ముగిస్తే, మంగళవారం నడపటానికి అనుతి ఉండదు. అయితే, వారాంతాల్లో మాత్రం ఈ సిస్టమ్ వర్తించదు. ఆ రోజుల్లో ఏ వాహనాన్నైనా రోడ్లపై తిప్పుకోవచ్చు.

ముంబై, ఢిల్లీ (ఇండియా)

ముంబై, ఢిల్లీ (ఇండియా)

దేశ రాజధాని మరియు వాణిజ్య రాజధాని నగరాల్లో వాహనం నడపటమంటే గగనమే. ఈ నగరాల్లో ట్రాఫిక్ జామ్ అయితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతాయి. ఈ రద్దీలో అంబులెన్స్ వాహనం నడిపే డ్రైవర్ కష్టాలను మాటల్లో చెప్పలేం. వీటన్నింటికి తోడు రోడ్డుపైకి అడ్డంగా వచ్చే బర్రెలు/గేదెలు, కారును చుట్టుముట్టేసే బిచ్చగాళ్లు ఇలా రోడ్డంతా చిందరవదంర గందరగోళంగా అనిపిస్తుంది. ఇక హారన్ మ్రోగించే వాళ్లయితే, లెక్కే ఉండదు. వీళ్లు తమ వాహనాన్ని పెట్రోల్ కన్నా హారన్‌తోనే ముందుకు నడుపుతుంటారు.

కంపాలా, యుగాండా

కంపాలా, యుగాండా

కంపాలాలో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ సమయాల్లో వర్షం కనిపిస్తే, ఇళ్ల నుంచి ఆఫీసులకు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు పడే కష్టాలు ఆ భగవంతుడికే తెలుసు. ఇందుకు ప్రధాన కారణం అక్కడ రోడ్లు సరిగ్గా లేకపోవటమే. దీనికితోడు అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కూడా ట్రాఫిక్ జామ్‌లకు మరో పెద్ద కారణం.

లెక్సింగ్టన్, కెంటుకీ, యూఎస్

లెక్సింగ్టన్, కెంటుకీ, యూఎస్

కార్ ఓనర్‌షిప్ పెరగటంతో అమెరికాలోని లెక్సింగ్టన్, కెంటుకీ నగరంలో ట్రాఫిక్ సమస్య కూడా పెరిగింది. పేరుకు అగ్రరాజ్యమైన అమెరికాలోని మరికొన్ని నగరాల్లో (ఆస్టిన్, టెక్సాస్) కూడా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటోంది.

సియోల్, దక్షిణ కొరియా

సియోల్, దక్షిణ కొరియా

దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, ప్రత్యేకించి రెడ్ లైట్ వెలుగుతున్నప్పటికీ దూసుకొని వెళ్లిపోటవంలో వీరికి సాటి మరెవ్వరూ రారు. చాలా మంది ఇలా చేస్తుంటడం వలనం గ్రీన్ లైట్ వెలిగే లోపు కార్లు రోడ్డుపై ఆగిపోయి మరింత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంటోంది. సియోల్ ప్రతి సిగ్నల్ వద్ద ఈ డ్రామా కనిపిస్తుంటేనే ఉంటుంది.

ఢాకా, బంగ్లాదేశ్

ఢాకా, బంగ్లాదేశ్

మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ట్రాఫిక్ ఇక్కట్లు వర్ణనాతీతం. అతి తక్కువ స్థలంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం కావటంతో, ఈ నగరంలో ఆటోరిక్షాలో 15 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవటానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుందంటే, అక్కడి ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.

చైనా

చైనా

చైనా దేశం జనాభా పరంగానే కాదు ట్రాఫిక్ జామ్‌ల పరంగా కూడా నెంబర్ వన్నే. చైనాలో పెరుగుతున్న జనాభాతో పాటే ట్రాఫిక్ సమస్య కూడా విపరీతంగా పెరుగుతోంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 7, 2013, 15:26 [IST]
English summary
As demand approaches the capacity of a road (or of the intersections along the road), extreme traffic congestion sets in. When vehicles are fully stopped for periods of time, this is colloquially known as a traffic jam or traffic snarl-up. Traffic congestion can lead to drivers becoming frustrated.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+