పాపులర్ సెలబ్రిటీలు ఉపయోగించే టాప్ 2 లగ్జరీ కార్లు, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ వద్ద కూడా..

ఖరీదైన కార్లను కొనుగోలు చేయాలంటే అంతే ఖరీదైన జీవనశైలి కూడా ఉండాలి. సాధారణంగా, దేశంలోని అనేక మంది సెలబ్రిటీలు, ప్రముఖులు మరియు ధనికులు అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తుంటారు. వీటిలో చాలా కార్లను మనం రోడ్లపై అరుదుగా చూస్తుంటాం. వాటిలో కొన్నైతే పూర్తిగా విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండే మోడళ్లు కూడా ఉంటాయి. అలాంటి వాటిని దిగుమతి రూపంలో ఇండియాకు ఇంపోర్ట్ చేసుకుంటుంటారు.

పాపులర్ సెలబ్రిటీలు ఉపయోగించే టాప్ 2 లగ్జరీ కార్లు, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ వద్ద కూడా..

నిజానికి సెలబ్రిటీలకు లగ్జరీ కార్ అనేది ఓ స్టేటస్ సింబల్ లాటింది. మరికొందరికైతే కార్ కలెక్షన్ అనేది ఓ హాబీలా ఉంటుంది. ప్రత్యేకించి సినీ పరిశ్రమలో మనం చాలా మంది సెలబ్రిటీలను విలాసవంతమైన కార్లలో చూస్తుంటాం. సినిమా వసూళ్ల పరంగా మరియు నిర్మించిన చిత్రాల సంఖ్య పరంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చిత్ర పరిశ్రమ. ఈ పరిశ్రమ లక్షలాధి మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఈ పరిశ్రమలోని ప్రముఖులు వారు ఆదాయాలకు తగినట్లుగానే లగ్జరీ కార్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు.

పాపులర్ సెలబ్రిటీలు ఉపయోగించే టాప్ 2 లగ్జరీ కార్లు, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ వద్ద కూడా..

అంతేకాకుండా, బాలీవుడ్ తారలు తమ తోటి నటులు కొనుగోలు చేసిన అదే కారును తరచుగా కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటివరకు చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కొనుగోలు చేసిన అటువంటి రెండు అత్యుత్తమ లగ్జరీ కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

పాపులర్ సెలబ్రిటీలు ఉపయోగించే టాప్ 2 లగ్జరీ కార్లు, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ వద్ద కూడా..

1. మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్ 600 (Mercedes-Benz Maybach GLS 600)

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో ఒకటి మెర్సిడెస్ బెంజ్ మేబాక్ జిఎల్ఎస్ 600 (Mercedes-Benz Maybach GLS 600). తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ 2021 సంవత్సరంలో ఇప్పటికే 50 యూనిట్ల మేబాక్ కార్లను పూర్తిగా విక్రయించినట్లు సమాచారం. భారత మార్కెట్లో ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 2.43 కోట్లు. ఒకవేళ ఎవరైనా కస్టమర్లు దీనిని ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే, దాని ధర మరింత పెరిగే అవకాశం ఉంది.

పాపులర్ సెలబ్రిటీలు ఉపయోగించే టాప్ 2 లగ్జరీ కార్లు, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ వద్ద కూడా..

మన తెలుగు సినీ పరిశ్రమలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఇటీవల ఈ కారును కొనుగోలు చేశారు. అలాగే, బాలీవుడ్‌లో ఈ కారు యొక్క మొదటి యజమానులలో రణవీర్ సింగ్ కూడా ఒకరు, తన పుట్టినరోజు బహుమతిగా ఈ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను కొనుగోలు చేసిన కొన్ని నెలల తర్వాత అర్జున్ కపూర్ కూడా తన కలెక్షన్‌లో మెర్సిడెస్ బెంజ్ మేబాక్ జిఎల్ఎస్ 600 ఆల్ట్రా లగ్జరీ ఎస్‌యూవీని చేర్చుకున్నాడు. బాలీవుడ్ నటి కృతి సనన్ కూడా ఇలాంటి ఓ కారును కొనుగోలు చేశారు.

పాపులర్ సెలబ్రిటీలు ఉపయోగించే టాప్ 2 లగ్జరీ కార్లు, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ వద్ద కూడా..

మెర్సిడెస్ బెంజ్ మేబాక్ జిఎల్ఎస్ 600 కారులో లభించే లగ్జరీ ఫీచర్లను గమనిస్తే, ఈ ఎస్‌యూవీ బెస్పోక్ ఇంటీరియర్ మెటీరియల్స్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది. వెనుక సీట్లలో కూర్చునే ప్యాసింజర్ల కోసం ఫుల్లీ పవర్ ఆపరేటెడ్ రిక్లైనింగ్ లెథర్ సీట్లు ఉంటాయి. ఈ సీట్లపై వెంటిలేషన్‌తో పాటుగా మసాజింగ్ ఫంక్షన్‌ను కూడా ఉంటుంది. అలాగే, వెనుక సీటులోని ప్రయాణీకుల అనుభవాన్ని మరింత విలాసంగా మరియు వినోదాత్మకంగా మార్చేందుకు ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్స్ కూడా ఉంటాయి.

పాపులర్ సెలబ్రిటీలు ఉపయోగించే టాప్ 2 లగ్జరీ కార్లు, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ వద్ద కూడా..

ఫ్రంట్ సీట్ హెడ్‌రెస్ట్‌ల యొక్క వెనుక వైపు అమర్చిన టాబ్లెట్ స్క్రీన్ సాయంతో వెనుక సీట్లలోని ప్రయాణీకులను కారులోని వివిధ రకాల ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. ఇందులో ఆడియో, క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, సన్‌షేడ్స్ మరియు నావిగేషన్ మొదలైనవి చాలానే ఉన్నాయి. అంతేకాకుండా, వెనుక వరుసలో ఫోల్డింగ్ టాబ్లెట్స్ మరియు రిఫ్రిజిరేటర్ సౌకర్యం కూడా ఉంటుంది.

పాపులర్ సెలబ్రిటీలు ఉపయోగించే టాప్ 2 లగ్జరీ కార్లు, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ వద్ద కూడా..

ఇంకా ఇందులో పెద్ద పనోరమిక్ మూన్‌రూఫ్, 12.3 ఇంచ్ ఎమ్‌బియూఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 64 రంగులతో కూడిన ఎల్ఈడి ఆప్టికల్ ఫైబర్ యాంబియంట్ లైటింగ్ వంటి మరిన్నో ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఈ కారులో ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే, ఇందులో ఇ-యాక్టివ్ బాడీ కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇది కెమెరా ద్వారా రహదారిని స్కాన్ చేసి, దానికి అనుగుణంగా సస్పెన్షన్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. ఈ ఫీచర్ వలన ఈ ఆల్ట్రా-ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీలో డ్రైవింగ్ అనుభూతి చాలా అల్ట్రా స్మూత్‌గా అనిపిస్తుంది.

పాపులర్ సెలబ్రిటీలు ఉపయోగించే టాప్ 2 లగ్జరీ కార్లు, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ వద్ద కూడా..

ఇంజన్ మరియు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మెర్సిడెస్-మేబాక్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీలో శక్తవంతమైన 4.0-లీటర్ వి8 ఇంజన్ ఉంటుంది, ఇది గరిష్టంగా 550 బిహెచ్‌పి శక్తిని మరియు 730 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9 జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. మరియు ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ను కలిగి ఉంటుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మేబాక్ జిఎల్‌ఎస్ 600 కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

పాపులర్ సెలబ్రిటీలు ఉపయోగించే టాప్ 2 లగ్జరీ కార్లు, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ వద్ద కూడా..

2. లాంబోర్ఘిని ఉరస్ (Lamborghini Urus)

సెలబ్రిటీలు అధికంగా ఇష్టపడే మరో అద్భుతమైన మరియు శక్తివంతమైన లగ్జరీ కారు లాంబోర్ఘిని ఉరస్ (Lamborghini Urus). ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్ఘినీ తయారు చేసిన మొట్టమొదటి ఎస్‌యూవీ ఇది. లాంబోర్ఘిని ఉరస్ మార్కెట్లోకి రాక ముందు వరకూ ఈ కంపెనీ వేగవంతమైన సూపర్ కార్లను మాత్రమే తయారు చేసేది. ఉరస్ రాకతో, ఈ కంపెనీ ఎస్‌యూవీలను తయారు చేయడం కూడా ప్రారంభించింది. భారత మార్కెట్లో లాంబోర్ఘిని ఉరస్ ధర రూ.3 కోట్లకు పైమాటే.

పాపులర్ సెలబ్రిటీలు ఉపయోగించే టాప్ 2 లగ్జరీ కార్లు, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ వద్ద కూడా..

మన తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇటీవలే ఇలాంటి కారును కొనుగోలు చేశారు. బాలీవుడ్ పరిశ్రమలో కూడా ఇరువురు ప్రముఖల వద్ద లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌యూవీ ఉంది. వీరిలో కార్తీక్ ఆర్యన్ మరియు రణవీర్ సింగ్ ఉన్నారు. ఇది రణవీర్ సింగ్ యొక్క రెండవ లంబోర్ఘిని ఉరస్.

పాపులర్ సెలబ్రిటీలు ఉపయోగించే టాప్ 2 లగ్జరీ కార్లు, రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టిఆర్ వద్ద కూడా..

లాంబోర్ఘిని ఉరస్ సూపర్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఈ శక్తివంతమైన కారులో 650 హెచ్‌పి 4.0-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 641 బిహెచ్‌పి పవర్ ను మరియు 850 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ కారు కేవలం 3.6 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎస్‌యూవీ యొక్క గరిష్ట వేగం గంటకు 305 కిమీ లుగా ఉంటుంది.

Most Read Articles

English summary
Top 2 luxurious and most powerful suvs owned by many bollywood celebrities take a look
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X