ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాయని మీకు తెలుసా?

భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ మరియు ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే, భారత మార్కెట్లో ఏ ఆటోమొబైల్ కంపెనీ అయినా నిలదొక్కుకోవాలంటే, అందుకు సరైన ప్రణాళిక అవసరం. ఏ చిన్న విషయంలో పొరపాటు చేసినా, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

అమెరికన్ కార్ బ్రాండ్ Ford India (ఫోర్డ్ ఇండియా) ఇటీవల భారతదేశం నుండి వెళ్లిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. వ్యాపారంలో భారీగా వచ్చిన నష్టాలు, అమ్మకాలు సరిగ్గా లేకపోవటం వంటి పలు కారణాల వలన ఈ కంపెనీ భారత్ విడిచి వెళ్లిపోతోంది. త్వరలోనే భారతదేశంలో కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

ఇలా మనదేశం నుండి వెళ్లిపోయిన ఆటోమొబైల్ కంపెనీలలో ఫోర్డ్ మొదటిదేం కాదు. గడచిన దశాబ్ద కాలంలో, భారతదేశంలోని అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని మూసివేసాయి. గత కొన్ని సంవత్సరాలలో భారతదేశాన్ని విడిచిపెట్టిన ఆటోమొబైల్ కంపెనీల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

1. General Motors (జనరల్ మోటార్స్)

ప్రపంచంలోనే అతి పెద్ద ఆటోమొబైల్ గ్రూప్ మరియు అమెరికాలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన జనరల్ మోటార్స్ (GM) కూడా భారదేశంలో నష్టాల బాట పట్టి, దేశాన్ని విడిచి వెళ్లిపోయింది. జనరల్ మోటార్స్ 1996 లో ఒపెల్‌ (Open) తో కలిసి భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత ఈ కంపెనీ 2003 లో షెవర్లే (Chevrolet) బ్రాండ్ ను ప్రారంభించింది.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

అయితే, ఈ రెండు బ్రాండ్ లు భారతదేశంలో ఎక్కువ కాలం నిలువలేకపోయాయి. సరైన డీలర్‌షిప్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ లేకపోవటం మరియు తక్కువ అమ్మకాల కారణంగా కంపెనీ ఓపెల్ బ్రాండ్ ను నిలిపివేసింది. మరోవైపు, దేశంలో మారుతి సుజుకి, హ్యుందాయ్ మరియు హోండా కంపెనీల నుండి పెరిగిన పోటీ కారణంగా షెవర్లే బ్రాండ్ అమ్మకాలు తగ్గాయి. దీంతో 2017 లో, జనరల్ మోటార్స్ భారత మార్కెట్ నుండి పూర్తిగా నిష్క్రమించినట్లు ప్రకటించింది.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

2. Fiat (ఫియట్)

అమెరికన్ కార్ కంపెనీలే కాదు, పాపులర్ ఇటాలియన్ కార్ బ్రాండ్ ఫియట్ (Fiat) కూడా గత ఏడాది (2020) లో అమ్మకాల పనితీరు సంతృప్తికరంగా లేనందున భారతదేశంలో తమ కార్యకలాపాలను నిలిపివేసింది. భారతదేశంలో ఫియట్ పుంటో, లీనియా, పుంటో ఎవో వంటి ప్రముఖ మోడళ్లను ఈ కార్ కంపెనీ విక్రయించేది. దేశంలో 1990 ల కాలంలో ఫియట్‌ కు మంచి స్పందన లభించింది. అయితే, కాలక్రమేణా పోటీ పెరగడంతో, ఫియట్ దేశీయ మార్కెట్లో తన పట్టును కోల్పోవడం ప్రారంభించింది.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

కాలం చెల్లిన డిజైన్, తక్కువ మైలేజ్ మరియు పేలవమైన ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ వంటి పలు అంశాల కారణంగా, ఫియట్ కార్ భారత మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. ఆధునిక ఫీచర్లు మరియు మెరుగైన డిజైన్ కార్లను ప్రవేశపెట్టిన తరువాత కూడా ఫియట్ అమ్మకాలు పడిపోతూనే ఉన్నాయి. భారత మార్కెట్లో కొత్త మోడళ్లను తీసుకురావడానికి వాహన తయారీదారు ఆసక్తి చూపకపోవడం దాని అమ్మకాల పనితీరును ప్రభావితం చేసిన మరో అంశం. దీంతో ఈ బ్రాండ్కార్ మార్చి 2020 లో భారతదేశంలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది, జనవరి 2019 లోనే వాహనాల ఉత్పత్తిని నిలిపివేసింది.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

3. UM Motorcycles (యూఎమ్ మోటార్‌సైకిల్స్)

అమెరికాకు చెందిన యునైటెడ్ మోటార్స్ (UM) 1990 లో ఇండియా లోహియా ఆటో (Lohia Auto) తో కలిసి భాగస్వామ్యంగా ఏర్పడి దేశంలో మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయటం ప్రారంభించింది. ఇది రెనెగేడ్ కమాండో, రెనెగేడ్ స్పోర్ట్ ఎస్ మరియు రెనెగేడ్ క్లాసిక్‌తో సహా కొన్ని గొప్ప క్రూయిజర్ మోటార్‌సైకిళ్లను భారతదేశానికి తీసుకువచ్చింది.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

ఈ మోటార్‌సైకిళ్లు చూడటానికి ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, వాటి నాణ్యత విషయంలో విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా, అదే సమయంలో దేశీయ మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) చౌకైన మరియు మెరుగైన మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టడంతో UM మోటార్‌సైకిళ్ల మార్కెట్ మరింత దెబ్బతినింది.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

ఈ కంపెనీ భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కి గట్టిగా పోటీగా నిలవాలని కోరుకుంది. కానీ, ఈ సంస్థ వద్ద నెట్‌వర్క్ ను విస్తరించడానికి సరైన మూలధనం మరియు సాంకేతికత లేనందున, ఇది అక్టోబర్ 2019 లో భారత మార్కెట్ నుండి నిష్క్రమించింది. ఈ విషయంలో ప్రస్తుతం, UM ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్స్ (FADA) నుండి చట్టపరమైన వ్యాజ్యాన్ని కూడా ఎదుర్కొంటోంది.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

4. Harley Davidson (హార్లే-డేవిడ్సన్)

ఒక రకంగా చూస్తుంటే, అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీలకు భారతదేశం అంతగా కలిసొచ్చినట్లు కనిపించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన అమెరికన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ Harley Davidson (హార్లే-డేవిడ్సన్) భారత మార్కెట్లో భారీ ప్రణాళికలతో వచ్చి బొక్కబోర్లా పడింది. ఖరీదైన ఉత్పత్తులు, పేవలమైన నెట్‌వర్క్ కారణంగా ఈ కంపెనీ భారత మార్కెట్ స్వతంత్ర బ్రాండ్ గా నిష్క్రమించింది.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

భారతదేశం నుండి హార్లే డేవిడ్సన్ నిష్క్రమణ భారతీయ మోటార్‌సైకిల్ ఔత్సాహికులకు మరియు ఆటో పరిశ్రమ వాటాదారులకు పెద్ద దెబ్బగా మారింది. ఈ అమెరికన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ సెప్టెంబర్ 2020 లో తమ భారతీయ కార్యకలాపాలను మూసివేసింది. భారతదేశంలోని అధిక దిగుమతి సుంకాలు మరియు తక్కువ అమ్మకాల కారణంగా కంపెనీ భారీ నష్టాలను చవిచూసింది.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

భారత టూవీలర్ మార్కెట్లో ఇతర ఆటోమొబైల్ కంపెనీలు చౌకైన క్రూయిజర్ మోడళ్లను ప్రవేశపెట్టడం వల్ల కంపెనీ హై-ఎండ్ బైక్‌ల అమ్మకాలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ బ్రాండ్ తమ స్వంత దేశానికి చెక్కేసింది. అయినప్పటికీ, మనదేశంలో ఇప్పుడు కూడా హ్యార్లీ డేవిడ్‌సన్ అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశపు అగ్రగామి టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp)తో హార్లే డేవిడ్సన్ చేతులు కలిపి వ్యాపారం చేస్తోంది.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

ఈ ఒప్పందం ప్రకారం, హీరో మోటోకార్ప్ ఇప్పుడు హార్లే-డేవిడ్సన్ మోటార్‌సైకిళ్ల అమ్మకాలు మరియు సేవలను నిర్వహిస్తోంది. హీరో మోటోకార్ప్ ఎంపిక చేసిన డీలర్‌షిప్‌ల ద్వారా మరియు ప్రస్తుతం ఉన్న హార్లే డేవిడ్సన్ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా హార్లే బైక్‌లను మరియు విడిభాగాలు, యాక్ససరీలను విక్రయిస్తోంది.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

5. Premier Automobiles (ప్రీమియర్ ఆటోమొబైల్స్)

భారత ఆటోమొబైల్ చరిత్రలో Premier (ప్రీమియర్) బ్రాండ్ కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతదేశంలో అత్యంత విజయవంతమైన మరియు ప్రసిద్ధ ఆటోమొబైల్ బ్రాండ్‌లలో ఇది కూడా ఒకటి. అయితే, దేశంలో తక్కువ అమ్మకాల కారణంగా ఈ బ్రాండ్ తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ బ్రాండ్ నుండి వచ్చిన కార్లలో రియో మరియు పద్మిని కార్లకు అత్యంత ప్రసిద్ధి చెందినవి.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

ప్రీమియర్ పద్మిని కార్లు ఇప్పటికీ ముంబైలో ప్రధానంగా టాక్సీలుగా పనిచేస్తున్నాయి. ఈ బ్రాండ్ 1940 ల చివరలో భారతదేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది ప్రఖ్యాత అంతర్జాతీయ బ్రాండ్‌లైన ప్లైమౌత్, డాడ్జ్, ఫియట్, ప్యుజో మొదలైన వాటి నుండి లైసెన్స్ పొందిన వాహనాలను విక్రయించింది.

ఫోర్డ్ మాదిరిగానే ఈ కంపెనీలు కూడా భారత్ నుండి వెళ్లిపోయాని మీకు తెలుసా?

అయితే, భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణతో, పోటీ పెరిగింది మరియు ప్రీమియర్ కు ఇక్కడ కార్యకలాపాలను కొనసాగించడం కష్టంగా మారింది. చివరికి, ఈ ఆటోమొబైల్ కంపెనీ దేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రీమియర్ ఆటోమొబైల్స్ డిసెంబర్ 2018 లో దివాలా తీసినట్లు ప్రకటించబడింది.

Most Read Articles

English summary
Top 5 automobile companies those who left india and closed their operations in last decade
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X