కార్లలో ఇవి తప్పక ఉండాల్సిందే.. ధర కేవలం రూ.500లోపే..!
మీకు సొంత కారు ఉందా.. ఎప్పుడు మీకారు శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నారా.. మెరుగైన, ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవం కోసం చూస్తున్నారా.. దాని కోసం మీ టూల్ కిట్‌లో ఏం ఉండాలో తెలుసా.. అవును ఈ కింది ఐదు వస్తువులు మీ కారు టూల్కిట్లో ఉంటే ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవం మీ సొంతమవుతుంది. అవి కూడా కేవలం 500 రూపాయల్లోపే మార్కెట్‌లో దొరుగుతాయి.
WD40 : మీ కారులో ఎప్పుడూ ఉండాల్సిన దానిలో WD40 ఒకటి. దీన్ని కారులో రకరకాల పనుల కోసం వినియోగించవచ్చు. క్లీనర్‌గాను, కారు బోల్టులు విప్పేందుకు, తుప్పు పట్టకుండా ఉండేందుకు, కారులోపల, బయట జిడ్డును వదిలించేందుకు ఈ టూబ్రికెంట్ ఉపయోగపడుతుంది. కారు టూల్‌కిట్‌లో ఉండాల్సిన ఈ WD40 ఆయిల్ కేవలం రూ. 500 లోపే మార్కెట్లు దొరుకుతుంది.

మైక్రోఫైబర్ క్లాత్ : మన కారు టూల్‌కిట్‌లో కచ్చితంగా ఉండాల్సిన మరో వస్తువు మైక్రోఫైబర్ క్లాత్. ఇది కారు లోపల, బయట క్లీన్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ క్లాత్ ఎన్నిసార్లైనా ఉపయోగించవచ్చు. మరియు సులభంగా వాష్ చేసుకోవచ్చు. ఇది కూడా కేవలం రూ. 500లోనే మనకు మార్కెట్లో లభిస్తుంది.
ఎలక్ట్రిక్ ఛార్జర్: మన కారులో కచ్చితంగా ఉండాల్సింది మరో వస్తువు.. ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ చేసేందుకు కావాల్సిన ఛార్జర్. ప్రస్తుత ప్రపంచంలో నిత్యం మన వెంటే ఉంటే ఎలక్ట్రానిక్ పరికరాలు ఛార్జింగ్‌లో ఉండడం అవసరం, అందువల్ల ఛార్జర్ కారులో ఉంటే, ప్రయాణం చేసే సమయంలోనే వాటిని సులభంగా ఛార్జింగ్ చేసుకొని, సమయం ఆదా చేసుకోవచ్చు. ఇది కూడా మనకు రూ.500లోపే మార్కెట్లో దొరుకుతుంది.

కారు ఫెర్ఫ్యూమ్ : మనం కారులో ప్రయాణిస్తున్నప్పుడు వాహనం లోపల భాగం కాస్తా తాజాగా ఆహ్లాదకరంగా ఉండేందుకు ఫెర్ఫ్యూమ్ తోడ్పతుంది. మార్కెట్‌లో చాలా రకాల ఫెర్ఫ్యూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చాలా వరకు కేవలం 500 రూపాయల కంటే తక్కువ ధరకే మనం కొనుగోలుచేయవచ్చు.
కారు బిన్ : మన కారు శుభ్రంగా ఉండేలా చూసేందుకు మనకు మరో వస్తువు అవసరం ఉంటుంది. అదే బిన్. అందులో కారులో ఉండే చెత్త సహా ఇతర అవసరం లేని వస్తువులను ఉంచేందుకు ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా చిన్న చిన్న వస్తువులను ఒకేదగ్గర దాచుకొనేందుకు సైతం బిన్ ఉపయోగపడుతుంది. దీన్ని కార్ డ్యాష్‌బోర్డు్ సహా డోర్ పాకెట్ దగ్గర అమర్చుకోవచ్చు.
పైన తెలిపిన ఐదు వస్తువులు మీ కారు టూల్కిట్లో ఉంటే మీకు ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవం మీ సొంతమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే పైన తెలిపిన ఐదు వస్తువులు మీ టూల్‌కిట్‌లో యాడ్ చేసుకోండి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








