మీ కారులో ఇవి ఉన్నాయా.. లేకుంటే వెంటనే ఏర్పాటుచేసుకోండి..!
ఇన్నాళ్లు ఎండలకు విలవిలలాడిన ప్రజలకు రుతుపవనాల రాక చల్లని కబురు చెప్పినట్లయింది. కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దీంతో కారు కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇతర సమయాల్లాగే వర్షాకాలంలోనూ కారు కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తిగా వర్షాలు కురిసే మందే సర్వీస్ చేయించుకోవాలి. మరియు కారు పొడిగా మరియు శుభ్రంగా ఉంచేందుకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవాలి. ఈ కింది ముఖ్యమైన 5 ఉపకరణాలను అందుబాటులో ఉంచుకోవాలి.

విండో విజర్ : వర్షం కురుస్తున్న సమయంలో కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లోపలికి వానచినుకులు వస్తుంటే చిరాకుగా అనిపిస్తుంది. అలాగని పూర్తిగా కారు కిటికీలను తెరిచి ఉంచలేం. అలాంటి సమయాల్లో AC ఆప్ చేసి ఉంచడం వల్ల కారులోపల తేమగా మారిపోతుంది. విండ్‌షీర్డ్, కిటికీలు అస్పష్టంగా తయారవుతాయి.
డోర్ విజర్ లేదా విండో విజర్ అనే కారు ఉపకరణం వర్షాకాలంలో చాలా ఉపయోగంగా ఉంటుంది. విండో విజర్ ఏర్పాటు అనంతరం సగం వరకు కిటికీలు తెరిచినా వాన చినుకులు కారు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా చల్లని వాతావరణాన్ని ఆశ్వాదించవచ్చు.

ఫాగ్ ల్యాంప్: వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం సహా దట్టమైన పొగమంచు కురుస్తుంటుంది. అడవులు, ఘాట్ రోడ్ల ప్రాంతాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆధునిక లేదా హైఎండ్ కార్లలో ఫాగ్ ల్యాంప్‌లు అమర్చబడి వస్తున్నాయి. పాత మరియు తక్కువ ధర కలిగిన కార్లలో వీటిని ఏర్పాటుచేసుకోవాలి. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఫాగ్‌ల్యాంప్ కొనుగోలు చేసి కార్లకు అమర్చుకోవచ్చు. వీటి వల్ల వర్షాకాలంలో మరింత భద్రతను పొందవచ్చు.

వైపర్ బ్లేడ్ : కారు వైపర్ బ్లేడ్‌లను గత వర్షాకాలం నుంచి సరిగా వినియోగించకపోవచ్చు. అయితే రుతుపవనాలు ప్రవేశంతో రానున్న రోజుల్లో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉంది. అందువల్ల వైపర్ బ్లేడ్‌లు సరిగా పనిచేస్తున్నాయో లేదో ఓసారి చెక్ చేసుకోండి. వైపర్ బ్లేడ్ రబ్బరు సరిగా లేకుంటే వెంటనే మార్చుకోండి. లేకుంటే వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.

కారు కవర్: ఈ వర్షాకాలంలో కారును పూర్తిగా కప్పేందుకు కవర్ ఎంతో అవసరం. అయితే కారును షేడ్ లేదా ఇంటి లోపల ప్రాంతాల్లో పార్కింగ్ చేసినట్లయితే కవర్ అవసరం ఉండకపోవచ్చు. అదే ఇంటి బయట పార్క్ చేసినట్లయితే కవర్ తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే నేరుగా వర్షం నీరు కారుపై పడి మరకలు ఏర్పడే అవకాశం ఉంది. మరియు దుమ్ము పేరుకుపోవచ్చు.

మడ్ ఫ్లాప్: ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఉండాల్సిన మరో ఉపకరణం మడ్ ఫ్లాప్. దీన్ని కారు ముందు, వెనుక చక్రాల వద్ద అమర్చుతారు. కారు కింద ఉన్న భాగాల్లోకి మట్టి, బురద వెళ్లకుండా నివారిస్తుంది. వర్షాకాలంలో కారు టైర్ల నుంచి మట్టి ఇతర భాగాల్లోకి వ్యాపించకుండా మడ్ ఫ్లాప్ అడ్డుకుంటుంది. ఇది మార్కెట్‌లో అందుబాటు ధరలకే లభిస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








