భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ బాడీ టైప్ కార్లకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. సరసమైన ధరకే అందుబాటులో ఉండి, మొదటిసారిగా కారును కొనే చిన్న మరియు మద్యతరగతి కుటుంబాలకు హ్యాచ్‌బ్యాక్ కార్లు చాలా బెస్ట్ ఆప్షన్ గా ఉంటాయి. కాంపాక్ట్ డిజైన్, అద్భుతమైన సామర్థ్యం మరియు బెటర్ మైలేజ్ కోసం ఈ కార్లు అత్యంత ప్రసిద్ధి చెందినవి.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

అందుకే, దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీల మొత్తం అమ్మకాలలో ఎక్కువభాగం హ్యాచ్‌బ్యాక్‌లు మరియు ఎంట్రీ లెవల్ కార్ల నుండే వస్తుంటాయి. సాధారణంగా, హ్యాచ్‌బ్యాక్ కార్లు ఓవరాల్ ప్యాకేజ్ ఆధారంగా మెరుగైన ఫీచర్లను కలిగి ఉండి, చాలా ఆచరణాత్మకంగా ఉంటాయి మరియు ఇవి ధరకు తగిన విలువను కూడా కలిగి ఉంటాయి.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

ప్రస్తుతం, భారత కార్ మార్కెట్లోని ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ల విభాగంలో మారుతి సుజుకి (Maruti Suzuki) అత్యధిక నెలవారీ అమ్మకాలతో అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం, ఈ విభాగంలో అనేక హ్యాచ్‌బ్యాక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, గతంలో ఈ విభాగంలోకి కొన్ని మోడళ్లు భారీ ఆశలతో వచ్చి, మార్కెట్లో ఘోరంగా విఫలమయ్యాయి. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

రెనో పల్స్ (Renault Pulse)

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో (Renault) తమ జపనీస్ భాగస్వామి నిస్సాన్ (Nissan) తో కలిసి భారతదేశంలో కార్ల వ్యాపారం ప్రారంభించింది. ఇందులో భాగంగా నిస్సాన్ మైక్రా (Nissan Micra) యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ గా రెనో పల్స్ (Renault Pulse) కారును 2012 లో ప్రవేశపెట్టింది.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

నిస్సాన్ మరియు రెనో సంస్థలు సంయక్తంగా అభివృద్ధి చేసిన వి-ప్లాట్‌ఫామ్ ఆధారంగా, పల్స్ హ్యాచ్‌బ్యాక్ ను తయారు చేశారు. ఈ చిన్న కారు పెద్ద క్యాబిన్ స్పేస్ తో మెరుగైన హెడ్‌రూమ్ మరియు లెగ్ రూమ్ ని కలిగి ఉంటుంది. పెప్పీ లుక్ లో కనిపించే పెప్పీ ఈ చిన్న కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ ఆప్షన్లతో లభ్యమయ్యేది. కంపెనీ ఈ కారును మార్కెట్‌లో ప్రీమియం ఆఫర్‌గా ఉంచాలని భావించింది.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

కానీ, ఈ కారు విషయంలో రెనో ఆశలు అడియాశలే అయ్యాయి. రెనో పల్స్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్ మరియు ఫీచర్స్ పరంగా మంచి ప్యాకేజీని కలిగి ఉన్నప్పటికీ ఈ కారు మార్కెట్లో ఎక్కువ కాలం నిలువలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం రెనో బ్రాండ్ భారత మార్కెట్ కు కొత్తది కావటం, మరియు సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ మోడల్ అమ్మకాలు కూడా ఆశించిన రీతిలో సాగలేదు. దీంతో 2017 లో రెనో పల్స్ భారత మార్కెట్ నుండి వైదొలిగింది.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

స్కోడా ఫాబియా (Skoda Fabia)

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా 2009 లో తమ ఫాబియా హ్యాచ్‌బ్యాక్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రీమియం బ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి స్విఫ్ట్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు స్కోడా తమ ఫాబియా హ్యాచ్‌బ్యాక్‌ను భారత్‌కు తీసుకువచ్చింది. ఈ విభాగంలోని ఇతర కార్లతో పోల్చుకుంటే, ఫాబియా చాలా లగ్జరీ ఫీచర్లను మరియు గొప్ప ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉండేది.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

అప్పట్లో ఇది స్కోడా నుండి వచ్చిన ఏకైక హ్యాచ్‌బ్యాక్ కావడంతో అందరి దృష్టి ఫాబియాపై పడింది. అయితే, ఫాబియా విషయంలో ఉన్న అతిపెద్ద సమస్యలలో ఒకటి, ఈ కారును దిగుమతి చేసుకున్న విడిభాగాల ఆధారంగా అసెంబ్లీ చేయటం. ఈ కారు తయారీ కోసం కంపెనీ ఎక్కువగా విదేశాలపై ఆధారపడేది. ఫలితంగా, ఈ కారు మరమ్మత్తులు చాలా ఖరీదైనవిగా ఉండేవి. అధిక ధర, అధిక మెయింటినెన్స్, తక్కువ నెట్‌వర్క్ కారణంగా స్కోడా ఫాబియా భారత మార్కెట్ నుండి అదృశ్యమైంది.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

టొయోటా ఎటియోస్ లివా (Toyota Etios Liva)

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా నుండి అత్యంత పాపులర్ అయిన ఎటియోస్ సెడాన్ ఆధారంగా ప్రవేశపెట్టిన ఎటియోస్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో మంచి విజయాలను సాధించలేకపోయింది. ఇందులో సెడాన్ కి లభించినంత ఆధరణ ఈ హ్యాచ్‌బ్యాక్ కి లభించలేదు. చిన్న కార్ల విభాగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి టొయోటా 2011 లో ఎటియోస్ లివాను ప్రారంభించింది.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

ఈ చిన్న కారును కంపెనీ యొక్క ECF ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. కారు ధరకు తగిన ప్యాకేజీని కలిగి ఉన్నప్పటికీ, డిమాండ్‌లో మాత్రం గణనీయమైన పెరుగుదల కనిపించలేదు. మారుతున్న మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా ఈ కారులో కంపెనీ కొత్త ఫీచర్లను అందించడంలో విఫలమైంది. ఫలితంగా, దీని అమ్మకాలు ప్రతి ఏటా క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దేశంలో BS VI ఉద్గార ప్రమాణాలను ప్రవేశపెట్టిన తర్వాత కంపెనీ తమ ఎటియోస్ సిరీస్ ను మార్కెట్ నుండి ఉపసంహరించింది.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

షెవర్లే సెయిల్ యువా (Chevrolet Sail UVA)

అమెరికన్ కార్ బ్రాండ్ షెవర్లే ఒకప్పుడు భారత మార్కెట్లో స్పార్క్ (Spark) మరియు బీట్ (Beat) వంటి చిన్న కార్లతో ఈ విభాగంలో మంచి అగ్రెసివ్ ప్రణాళికతో సాగిపోతుండేంది. తమ హ్యాచ్‌బ్యాక్ శ్రేణికి కొనసాగింపుగా కంపెనీ 2012 లో సెయిల్ యువా కారును ప్రారంభించింది. సరసమైన ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు అమ్మకాలు ఆరంభంలో జోరుగానే సాగినప్పటికీ, తర్వాతి కాలంలో భారీగా తగ్గుతూ వచ్చాయి.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

ఈ కారు మార్కెట్లోకి వచ్చిన రెండేళ్లలోనే దీని పతనం ఆరంభమైంది. గత 2014 నుండి షెవర్లే సెయిల్ కార్ల అమ్మకాలు తగ్గడం ప్రారంభించాయి. దీంతో 2016 లో కంపెనీ ఈ హ్యాచ్‌బ్యాక్ కారుకు గుడ్‌బై చెప్పింది. భారతదేశంలో అతి తక్కువ జీవితకాలం కలిగిన కార్లలో సెయిల్ యువా కూడా ఒకటి.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

మారుతి సుజుకి జెన్ ఎస్టిలో (Maruti Suzuki Zen Estilo)

భారతదేశపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి చరిత్రలో కూడా కొన్ని విఫలమైన కార్లు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి మారుతి సుజుకి జెన్ ఎస్టిలో. కంపెనీ 2007 లో తమ లెజెండ్రీ జెన్ మోడల్ కి వారసుడిగా జెన్ ఎస్టిలో హ్యాచ్‌బ్యాక్ కారును ప్రారంభించింది. ప్రారంభంలో జెన్ ఎస్టిలో అత్యధికంగా అమ్ముడైన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ కార్లలో ఒకటిగా నిలిచింది.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

సరసమైన ధరతో వచ్చిన ఈ కారు ధరకు తగిన విలువను ఆఫర్ చేసేది. అయితే, డిజైన్ పరంగా మాత్రం ఎక్కువ అప్‌డేట్స్ ను పొందలేకపోయింది. ఫలితంగా, ఈ కారును ఆదరించే కస్టమర్లు కూడా కరువయ్యారు. కాలానుగుణంగా, ఈ మోడల్ అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో, మారుతి సుజుకి తమ జెన్ ఎస్టిలో ను మార్కెట్ నుండి తొలగించింది.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

హ్యుందాయ్ ఇయాన్ (Hyundai Eon)

భారత స్మాల్ కార్ మార్కెట్లో సాధారణంగానే హ్యుందాయ్ కార్లు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం హ్యుందాయ్ కార్లలో లభించే ప్రీమియం ఫీచర్లే. అయితే, ఎంట్రీ లెవల్ మార్కెట్లో కూడా తన సత్తా ఏంటో చాటుకోవాలని హ్యుందాయ్ ఇయాన్ అనే చిన్న కారును కంపెనీ దేశీయ విపణిలో విడుదల చేసింది. పరిమాణంలో ఇది మారుతి సుజుకి ఆల్టోతో సమానంగా ఉండేది.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

ఆరంభంలో, భారత ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో హ్యుందాయ్ ఇయాన్ అమ్మకాలు చాలా జోరుగా సాగాయి. ఈ కారు డబ్బు తగిన విలువ అందించే మోడల్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే, ఇదొక బేసిక్ కారు, ఇందులో సాధారణ భద్రతా ఫీచర్లు కూడా లభించేవి కావు. మారుతున్న కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఈ కారు మారలేకపోయింది. దీంతో 2018-19 లో కంపెనీ ఈ కారును మార్కెట్లో నిలిపివేసింది.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

డాట్సన్ గో (Datsun Go)

భారత ఎంట్రీ లెవల్ కార్ మార్కెట్లోని అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ తమ ఐకానిక్ కార్ బ్రాండ్ డాట్సన్ కు పునర్జీవం కల్పించి, భారతదేశం వేదికగా ప్రపంచానికి తిరిగి పరిచయం చేసింది. డాట్సన్ బ్రాండ్ తమ గో హ్యాచ్‌బ్యాక్ ని అత్యంత సరసమైన ధరతో మార్కెట్లో విడుదల అందరి దృష్టిని ఆకర్షించింది.

భారీ ఆశలతో మార్కెట్లోకి వచ్చాయి.. కానీ మార్కెట్ ముందు బొక్కబోర్లా పడ్డాయి..

సాధారణ ఎంట్రీ లెవల్ కారులో లభించే అన్ని రకాల ప్రయోజనాలు డాట్సన్ గో కారులో ఉన్నప్పటికీ, విజయం దాని డోర్ తలుపులు తట్టలేకపోయింది. భారతదేశంలో ఈ బ్రాండ్ యొక్క అస్థిరమైన చిత్రం కారణంగా, ఇది మార్కెట్లో పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. ఈ విభాగంలో పెరిగిన పోటీ ముందు డాట్సన్ గో నిలబడలేకపోయింది.

Most Read Articles

English summary
Top 7 hatchbacks came to market with bigger plans but failed in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X