కారులో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన 7 సేఫ్టీ ఫీచర్లు.. !
మీరు కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే కారులో అదనపు హంగులతో పాటు కచ్చితంగా ఉండాల్సిన కొన్ని సేప్టీ ఫీచర్లు ఉన్నాయని మీకు తెలుసా.. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటి. అందువల్ల ప్రమాదాల బారిన పడకుండా, ఒకవేళ ప్రమాదం జరిగినా క్షేమంగా బయటపడేందుకు ఈ సేఫ్టీ ఫీచర్లు కారులో ఉండాల్సి ఉంటుంది. అవేంటో.. అవి ఎలా పనిచేస్తాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
సీట్ బెల్ట్: కార్లలో కచ్చితంగా ఉండాల్సిన సేఫ్టీ ఫీచర్ ఏంటని ఎవరిని అడిగితే వెంటనే సీట్ బెల్ట్ అని వెంటనే చెప్పేస్తారు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో క్షేమంగా బయటపడేందుకు లేదా చిన్న గాయాలతో తప్పించుకొనేందుకు ఇది సహకరిస్తుంది. ఎదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహనాల్లోని ప్రయాణికులు బయటకు పడిపోకుండా సీట్లలోనే ఉంచేలా సీట్‌బెల్ట్ ఉపయోగపడుతుంది. అందువల్ల కార్లలో ప్రయాణిస్తు్న్నప్పుడు తప్పనిసరిగా అందరూ సీట్‌బెల్ట్ ధరించాలి.

యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ : కార్లలో ఉండాల్సిన మరో సేఫ్టీ ఫీచర్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS). ఈ ఫీచర్ గత కొంతకాలంగా అందుబాటులో ఉంది. క్లిష్టమైన పరిస్థితిల్లో కారు టైర్లు లాక్ కాకుండా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. హార్డ్ బ్రేకింగ్ సమయాల్లో కారును నియంత్రించేందుకు డ్రైవర్‌కు సహకరిస్తుంది. ప్రమాద సమయాల్లో కారు స్కిడ్ కాకుండా ఈ వ్యవస్థ సాయం చేస్తు్ంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫీచర్ చాలా కీలకంగా పనిచేస్తుంది.

ఎయిర్‌బ్యాగ్స్ : భారీ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా క్షేమంగా బయటపడ్డామంటే ఆ కారులో ఎయిర్‌బ్యాగ్ తెరుచుకున్నాయని అర్థం. ఎందుకంటే కార్లు ఏదైనా వాహనాన్ని ఢీకొట్టినా, ఆ ప్రభావం వాహనాల్లోని ప్రయాణికులపై పడకుండా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అందువల్ల ఈ ఫీచర్‌కు కార్ల తయారీ కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తాయి. కారు కొనుగోలు చేయాలనుకున్న వారు సైతం ఈ ఫీచర్‌పై ప్రత్యేక దృష్టిపెడతారు. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న కార్లు ఫ్రంట్, సైడ్, కర్టన్ ఎయిర్‌బ్యాగ్‌లతో లాంచ్ అవుతున్నాయి. ఫలితంగా ఏవైపు నుంచి ప్రమాదం జరిగినా అందులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడే అవకాశం ఉంటుంది.

ఎలక్ట్రానికి స్టేబిలిటీ కంట్రోల్ (ESC): కార్లలో ఉండాల్సిన మరో ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్ ఎలక్ట్రానికి స్టేబిలిటీ కంట్రోల్. అనుకోని విధంగా లేదా అకస్మాత్తుగా కారు నియంత్రణ కోల్పోయిన పరిస్థితుల్లో వాహనాన్ని అదుపుచేసేందుకు ఈ సాంకేతిక వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. అత్యవసర సమయాల్లో సెన్సార్ల ద్వారా పరిస్థితిని అంచనా వేసి కార్ల టైర్లకు బ్రేకులు వేస్తుంది, ఫలితంగా కారు జారిపోకుండా కాపాడుతుంది. తడి లేదా రోడ్లపై మంచు కురిసినప్పుడు ఈ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.

బ్లైండ్స్ స్పాట్ మానిటరింగ్ : ఈ వ్యవస్థ ఇటీవల కాలంలో మంచి సెఫ్టీ ఫీచర్‌గా పేరుపొందింది. సెన్సార్ల ద్వారా పనిచేసే ఈ ఫీచర్.. దారిలోని ఇతర వాహనాలను, లేదా వస్తువులను గుర్తించేందుకు డ్రైవర్‌కు సహకరిస్తుంది. మరియు ఆడియో లేదా వీడియో హెచ్చరికల ద్వారా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. రహదారుల్లోని మలుపుల వద్ద ఇతర వాహనాలను డ్రైవర్ గుర్తించకుండా వెళ్తున్నప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ ఫీచర్ పనిచేస్తుంది. ప్రత్యేకంగా భారతదేశంలో ఈ ఫీచర్ భాగా పనికొస్తుంది. అంటే కారు చుట్టుపక్కన వెళ్తున్న ద్విచక్రవాహనాలను గుర్తించి. ప్రమాదాల బారినపడకుండా ఈ ఫీచర్ కాపాడుతుంది.

లేన్ డిపాచర్ వార్నింగ్ సిస్టమ్ : రహదారుల్లో ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ఈ ఫీచర్ బాగా పనిచేస్తుంది. సిగ్నల్ ఇవ్వకుండా డ్రైవర్ లైన్ నుంచి బయటకువెళ్తున్నప్పుడు, కారుకు ఉన్న కెమెరాలు, సెన్సార్లతో ప్రమాదాన్ని గుర్తించి డ్రైవర్‌కు హెచ్చరికలు జారీచేస్తుంది. ఆడియో లేదా వీడియో ద్వారా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. డ్రైవర్ అప్రమత్తంగా లేని సమయాల్లో ప్రమాదాల నివారణకు ఈ ఫీచర్ బాగా పనిచేస్తుంది.

రోల్ ఓవర్ మిటిగేషన్ (ROM) : సాధారణ కార్లు సహా SUV లాంటి వాహనాలు ప్రమాదాల బారిన పడకుండా ఈ ఫీచర్ సాయం చేస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇంజిన్ సామర్థ్యం తగ్గించడం, టైర్లకు బ్రేకులు వేయడం ద్వారా కారు బోల్తా పడకుండా ఈ రోల్ ఓవర్ మిటిగేషన్ ఫీచర్ పనిచేస్తుంది. సెన్సార్లు మరియు ఆల్గారిథమ్‌ను ఉపయోగించి ప్రమాదాన్ని గుర్తించి, చర్యలు తీసుకుంటుంది. SUV సహా పొడవైన వాహనాలు ప్రమాదబారిన పడకుండా ఈ ఫీచర్ సాయం చేస్తుంది.

అందువల్ల మనం ఏదైనా కారు కొనుగోలుచేయాలి అని అనుకున్నప్పుడు ఆధునిక హంగులు సహా కీలక భద్రతా ఫీచర్లు ఉండేలా చూసుకోవాలి. సీట్ బెల్ట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మోనిటరింగ్, లేన్ డిపాచర్ వార్నింగ్ సిస్టమ్ మరియు రోల్ ఓవర్ మిటిగేషన్ ఫీచర్లు బాగా పనిచేస్తున్న వాహనాలనే ఎంచుకోవడం ఉత్తమం. ఫలితంగా ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైనా క్షేమంగా బయటపడేందుకు ఈ సేఫ్టీ ఫీచర్లు మనకు సాయపడతాయి.


Click it and Unblock the Notifications








