భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు: వివరాలు

కార్లలో ఆల్-వీల్ డ్రైవ్ (ఫోర్-వీల్ డ్రైవ్ లేదా 4x4) ఆప్షన్ అనేది ఇప్పుడు చాలా ఖరీదైన మరియు అరుదైన ఫీచర్‌గా మారిపోయింది. ఒకప్పుడు, మనదేశంలో లభించే చిన్న కార్లలో కూడా ఈ ఫీచర్ లభించేంది. కానీ, ఇప్పుడు ఈ ఫీచర్ ఖరీదైన ప్రీమియం ఎస్‌యూవీలలో మాత్రమే లభిస్తోంది.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగిన వాహనాలు మంచి ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. వీటిని కేవలం సిటీ రోడ్లపై కాకుండా, రోడ్లు సరిగ్గా లేని ఆఫ్-రోడ్ పరిస్థితుల్లో కూడా నడపేందుకు వీలుగా ఉంటాయి. వీటిలో ఇంజన్ నుంచి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమాణంగా పంపిణీ అవుతుంది. ఫలితంగా, ఇవి ఎలాంటి రోడ్లపైనైనా సులువుగా ప్రయాణిస్తాయి.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

మనదేశంలో విక్రయించి, నిలిపివేయబడ్డ కొన్ని ఆల్-వీల్ డ్రైవ్ కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

1. రెనో డస్టర్

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో అందిస్తున్న డస్టర్ ఎస్‌యూవీ ఒకప్పుడు 4X4 డ్రైవ్ ఆప్షన్‌తో లభించేంది. అప్పట్లో ఇదే అత్యంత చవకైన ఆల్-వీల్ డ్రైవ్ కారు. ఈ కారు అత్యుత్తమ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కలిగి ఉండేది. బెటర్ కంఫర్ట్ కోసం రెనో డస్టర్ ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ వెనుక భాగంలో కంపెనీ మల్టీలింక్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేసింది.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

రెనో డస్టర్ 4x4 మోడల్ ఎలాంటి రోడ్లపై అయినా ప్రయాణించేందుకు వీలుగా డిజైన్ చేయబడింది. అయితే, ఈ వెర్షన్ ధర అధికంగా ఉండటం మరియు అమ్మకాలు కూడా తక్కువగా ఉండటంతో కంపెనీ ఫోర్-వీల్ డ్రైవ్ రెనో డస్టర్‌ను భారత మార్కెట్లో నిలిపివేసింది. రెనో ఎప్పటికైనా ఈ ఎస్‌యూవీని తిరిగి ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాము.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

2. మహీంద్రా స్కార్పియో

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియో. చూడటానికి గంభీరంగా మంచి రోడ్ ప్రజెన్స్‌ని కలిగి ఉండే ఈ ఎస్‌యూవీ గతంలో 4X4 డ్రైవ్ ట్రైన్‌తో లభించేంది. కానీ, ఎందుకో కంపెనీ ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్లను తొలగించి ప్రస్తుతం రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్లను మాత్రమే విక్రయిస్తోంది.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

మహీంద్రా స్కార్పియో 4X4 వెర్షన్‌లోని ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగలదు, ఇది చాలా తక్కువ ఆర్‌పిఎమ్ వద్ద ఇంజన్ నుంచి వచ్చే పవర్‌ను అన్ని చక్రాలకు సమానంగా పంపిణీ చేయగలదు. ఉత్తమ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీలలో ముందుండే పేరు స్కార్పియో. మరి మహీంద్రా ఇప్పటికైనా తమ కొత్త స్కార్పియోని 4X4 రూపంలో తిరిగి తీసుకువస్తుందా?

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

3. మారుతి సుజుకి గ్రాండ్ విటారా

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా 4X4 వాహనాలను విక్రయించిందని మీకు తెలుసా? మారుతి సుజుకి కార్లు మంచి రైడ్ క్వాలిటీతో శక్తివంతమైన మరియు నమ్మదగిన పెట్రోల్ ఇంజన్‌లకు ప్రసిద్ధి చెందినవి. గతంలో కంపెనీ విక్రయించిన గ్రాండ్ విటారా ఎస్‌యూవీ 4x4 డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యమయ్యేది.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

వర్సటైల్ డ్రైవ్‌ట్రెయిన్ కారణంగా, గ్రాండ్ విటారా ర్యాలీ రేసింగ్ మరియు ఆఫ్-రోడ్ ట్రయల్స్‌లో ఇప్పటికీ ఉపయోగించబడుతోంది. అలాగే, సుజుకి గ్రాండ్ విటారా ఇప్పటికీ మంచి కస్టమైజబల్ వెహికల్‌గా ఉంది. ఈ కారును యజమాని అవసరాలకు తగినట్లుగా మోడిఫై చేసుకోవచ్చు. ప్రస్తుతం, మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో ఎలాంటి ఆల్-వీల్ డ్రైవ్ మోడళ్లు లేవు.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

4. టాటా సఫారీ

మా అభిప్రాయం ప్రకారం, పెర్ఫార్మెన్స్ విషయంలో టాటా మోటార్స్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త 2021 టాటా సఫారీ పాత తరం సఫారీ కంటే ఒక అడుగు వెనుకబడి ఉందనే చెప్పాలి. టాటా సఫారీ భారతీయ కార్ కమ్యూనిటీలో ఒక ఐకానిక్ మోడల్. పాత తరం టాటా సఫారీ ఎస్‌యూవీని కంపెనీ ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో విక్రయించేంది.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

కస్టమర్లు కొత్తదనం కోరుకోవటంతో కంపెనీ ఈ పాత తరం మోడల్‌ని నిలిపివేసింది. ఆ తర్వాత ఇటీవలే కొత్తగా హారియర్ ఆధారంగా వచ్చిన సఫారీలో నైనా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ లభిస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ కొత్త 2021 టాటా సఫారీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

5. టాటా జెనాన్

దురదృష్టవశాత్తు, మార్కెట్లో అంతరించిపోతున్న తదుపరి వాహనం టాటా జెనాన్. ఈ వాహనం యొక్క కమర్షియల్ వెర్షన్ ఇప్పటికీ టాటా మోటార్స్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఉన్నప్పటికీ, ఇందులో 4X4 డ్రైవ్ ట్రెయిన్ లేదు. అన్ని ప్రాథమిక సౌకర్యాలతో లభించే భారతదేశపు మొట్టమొదటి ఫ్యామిలీ పికప్ ట్రక్కులలో టాటా జెనాన్ ఒకటిగా ఉంటుంది.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

6. మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఆటోమొబైల్ చరిత్రను తిరగరాసి, అమ్మకాల పరంగా కంపెనీని ఓ రేంజ్‌కు తీసుకువెళ్లిన మోడళ్లలో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటుంది. భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో మహీంద్రా పట్టు సాధించడానికి ఈ మోడల్ ఎంతగానో సహకరించింది. మొదట్లో ఈ మోడల్‌లో కంపెనీ ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను అందించేది.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

ఈ మోడల్ విషయంలో కంపెనీ చేసిన కొన్ని అప్‌గ్రేడ్స్ తర్వాత ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను మహీంద్రా నిలిపివేసింది. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ500 కేవలం ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. నిజానికి ఇందులోని ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ఓ మంచి మృదువైన ఆఫ్-రోడర్‌గా ఉండేది.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

7. మారుతి సుజుకి జిప్సీ

మారుతి సుజుకి జిప్సీ పేరు వినగానే ఇండియన్ ఆర్మీ మరియు ర్యాలీ రేసింగ్ అనేవి గుర్తుకు వస్తాయి. దీనికి కారణం మారుతి సుజుకి జిప్సీ వైవిధ్యమైన డిజైన్. ఒకప్పుడు కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభించే ఈ జీప్ తరహా వాహనాన్ని కస్టమర్లు అత్యధికంగా కొనుగోల చేసే వారు.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

అయితే, కాలక్రమేణా వచ్చిన మార్పుల కారణంగా కంపెనీ ఈ మోడల్‌ను మార్కెట్లో నిలిపివేయాల్సి వచ్చింది. మారుతి సుజుకి జిప్సీ కూడా ఆల్-వీల్ డ్రైవ్ ఫీచర్‌తో లభించేంది. అప్పట్లో ఈ వాహనాన్ని అత్యుత్తమ ఆఫ్-రోడర్‌గా పరిగణించేవారు. నిజానికి, ఇప్పటికీ కొన్ని జిప్సీ వాహనాలను మనం ర్యాలీ రేసుల్లో చూడొచ్చు. కాగా, కంపెనీ ఇప్పుడు జిప్సీ వారసుడిగా జిమ్నీ ఎస్‌యూవీని తీసుకురావచ్చని చెబుతున్నారు.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

8. స్కోడా యెటి

స్కొడా యెటి ఎస్‌యూవీని బహుశా భారతదేశపు మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీగా చెప్పొచ్చేమో. స్కొడా కార్లు అంతంత మాత్రంగా ఉండే ఆ రోజుల్లో యెటి తన ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో అందరినీ అబ్బురపరచింది. స్కొడా యెటి కూడా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించేంది, కానీ ఇది మార్కెట్లో ఎక్కువ కాలం నిలువలేకపోయింది.

భారత మార్కెట్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభించిన టాప్ 8 కార్లు..

స్కొడా యెటి కారును అసాధారణమైన జర్మన్ నిర్మిత ఇంజన్ మరియు అత్యుత్తమ ట్రాన్స్‌మిషన్‌తో అందించారు. అదనంగా, ఇందులో 4x4 డ్రైవ్ ఆప్షన్ ఇవ్వటంతో, ఆ సమయంలో ఈ కారును నడపటం చాలా సరదాగా ఉండేది. ఇప్పుడు స్కొడా అందిస్తున్న కుషాక్‌లో కూడా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు.

Most Read Articles

English summary
Top 8 cars in india that were offered with all wheel drive option
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X