ఈ నగరాల్లో కార్లు చూద్దామన్నా కనిపించవు..

By Ravi

ఆశ్చర్యంగా ఉందా..? కానీ ఇది ముమ్మాటికి నిజం. ఇప్పుడు ఈ కథనంలో మనం చెప్పుకోబోయే నగరాల్లో కార్లు చూద్దామన్నా కూడా కనిపించవు. వీటిని కార్ ఫ్రీ సిటీలు అని కూడా పిలుస్తుంటారు.

ప్రస్తుతం మానవ దైనందిన జీవితంలో కారు కూడా ఓ నిత్యావసర వస్తువుగా మారిపోతోంది. జనాభా పెరుగుతుండటం, సరమైన ధరకే వాహనాలు లభిస్తుండటంతో కొన్ని నగరాల్లో కార్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.

కానీ ఈ నగరాల్లో అస్సులు కార్లన్నవే మనకు కనిపించవు. మరి ఆ నగరాలు ఎక్కడున్నాయి.. వాటి విశిష్టలు ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

కార్ ఫ్రీ నగరాలు..

నిత్యం రోడ్లపై రయ్ రయ్ మని తిరిగే కార్లను చూసి, అవి చేసే శబ్ధాలను విని బోర్ కొట్టేసిందా..? అయితే, ఈసారి మీ నెక్స్ట్ వెకేషన్ కోసం ఈ కథనంలో మనం తెలుసుకోబోయే కార్ ఫ్రీ సిటీలకు ట్రిప్ ప్లాన్ చేసుకోండి..!

సార్క్ ద్వీపం

సార్క్ ద్వీపం

పశ్చిమ యూరప్‌లోని ఇంగ్లీష్ ఛానెల్‌లో దాదాపు 40 మైళ్ల మేర విస్తీర్ణంలో ఉంది ఈ సార్క్ ద్వీపం. ఈ ద్వీపంలో మనక ఎక్కడా కార్లు కనిపించవు. కేవలం గుర్రపు బండ్లు, సైకిళ్లు మరియు ట్రాక్టర్లు మాత్రమే దర్శనమిస్తాయి. వస్తువులు, సరుకులు కూడా షిప్పులు, పడవల ద్వారానే ఈ ద్వీపానికి వస్తాయి. ఇందులో ఎయిర్‌పోర్టు కూడా లేదు.

మాడ్రిడ్ (కార్ ఫ్రీగా మారబోతోంది)

మాడ్రిడ్ (కార్ ఫ్రీగా మారబోతోంది)

స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ కూడా త్వరలో కార్ ఫ్రీ సిటీగా మారబోతోంది. ఈ నగరంలో ఇప్పటికే కొన్ని సిటీ రహదారుల్లో ట్రాఫిక్‌ను బ్యాన్ చేశారు. ఈ విధంగా నగరంలో కార్-ఫ్రీ జోన్‌ను మరింత విస్తరించనున్నారు. ఈ వీధులలో నివసించేవారు, ఇరుగు పొరుగు వారు మాత్రమే కార్లను ఉపయోగించుకోవచ్చు. వేరే ఎవరైనా ఈ వీధుల్లోకి ప్రవేశిస్తే 100 డాలర్లకు పైగా జరిమానా విధించబడుతుంది.

ప్యారిస్ (కార్ ఫ్రీగా మారబోతోంది)

ప్యారిస్ (కార్ ఫ్రీగా మారబోతోంది)

అందాల నగరం, పర్యాటక ప్రాంతం అయిన ప్యారిస్ కూడా కార్ ఫ్రీ సిటీగా మారబోతోంది. నగరంలో కాలుష్య స్థాయి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్యారిస్‌లో కూడా కార్ల నిషేధానికి రంగం సిద్ధమైంది. స్థానికులు తప్ప, ఇతరులు ఈ ప్రాంతానికి కార్లలో రావటాన్ని నిషేధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.

చెంగ్డు (భవిష్యత్ కార్ ఫ్రీ సిటీ)

చెంగ్డు (భవిష్యత్ కార్ ఫ్రీ సిటీ)

సౌత్‌వెస్ట్ చైనాలో ఓ కొత్త శాటిలైట్ సిటీని ప్లాన్ చేస్తున్నారు. ఇది మోడ్రన్ సబర్బ్ కోసం ఓ చక్కటి మోడల్‌గా నిలువనుంది. ఈ నగరంలో డ్రైవ్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎవరైనా సరే 15 నిమిషాల నడకతో ఇంటికి చేరుకునేలా నిర్మాణం చేపడుతున్నారు.

హ్యామ్‌బర్గ్ (భవిష్యత్ కార్ ఫ్రీ సిటీ)

హ్యామ్‌బర్గ్ (భవిష్యత్ కార్ ఫ్రీ సిటీ)

హ్యామ్‌బర్గ్ తమ సిటీ సెంటర్‌లో కార్లను బ్యాన్ చేయటం ప్లాన్ చేయకపోయినప్పటికీ, ఈ సిటీలో కార్లను నడపాల్సిన అవసరం లేకుండా విధంగా మౌళిక వసతులను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటోంది. రానున్న 15-20 ఏళ్లలో పూర్తి కానున్న ఓ కొత్త గ్రీన్ నెట్‌వర్క్ ద్వారా సిటీలోని పార్కులను అనుసంధానం చేసుకుంటూ నడకకు లేదా సైక్లింగ్‌కి సులువుగా ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.

హెల్సింకి (భవిష్యత్ కార్ ఫ్రీ సిటీ)

హెల్సింకి (భవిష్యత్ కార్ ఫ్రీ సిటీ)

ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకి నగరంలో రానున్న కొన్ని దశాబ్ధాల కాలంలో అనేక మంది కొత్త వారు ఇక్కడ నివసించేందుకు వచ్చే అవకాశం ఉంది. కానీ, ఎక్కువ ప్రజలు వచ్చినప్పటికీ, తక్కువ కార్లను వీధులపై అనుమతించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

మిలన్ (కార్ ఫ్రీ కాబోతోంది)

మిలన్ (కార్ ఫ్రీ కాబోతోంది)

ఇటలీలో మిలన్ నగరం కూడా కార్ ఫ్రీ నగరంగా మారబోతోంది. రహదారుల కార్లను నియంత్రించేందుకు గాను అక్కడి ప్రభుత్వాలు ప్రజలకు బంపర్ ఆఫర్లను ఇస్తున్నాయి. ప్రజలు తమ వాహనాలను ఇంటి వద్దే ఉంచి, ప్రజా రవాణా వ్యవస్థను ఆశ్రయించినట్లయితే, వారికి ఉచిత రవాణా ఓచర్లను ఇవ్వాలని భావిస్తున్నారు. కారు డ్యాష్‌బోర్డుకు ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉన్న బాక్స్ ఆధారంగా చేసుకొని కారు లొకేషన్‌ను ట్రేస్ చేసి ఈ ఓచర్లను ఇస్తారు.

కోపెన్‌హ్యాగెన్ (కార్ ఫ్రీ కాబోతోంది)

కోపెన్‌హ్యాగెన్ (కార్ ఫ్రీ కాబోతోంది)

అమెరికాలోని కోపెన్‌హ్యాగెన్ నగరం కూడా త్వరలో కార్ ఫ్రీ సిటీగా మారబోతోంది. దశాబ్ధాల క్రితం ఇక్కడ కార్ల రద్దీ ఎక్కువగా ఉండేది. అయితే, అప్పటి అధికారులు కార్ ఫ్రీ జోన్‌ను ప్రవేశపెట్టడం, దానిని క్రమంగా విస్తరింపజేయటంతో అక్కడ కార్ల సైకిళ్లను ఉపయోగించే వారి సంఖ్య అధికమైంది.

మ్యాకినాక్ ద్వీపం (కార్ ఫ్రీ)

మ్యాకినాక్ ద్వీపం (కార్ ఫ్రీ)

అమెరికాలోని మిచిగాన్ ప్రాంతంలో ఉన్న ఈ మ్యాకినాక్ ద్వీపంలో దాదాపు 600కు పైగా కుటుంబాలున్నాయి. టూరిస్టులను ఆకట్టుకునే ఈ ద్వీపంలో 1898లోనే మోటారైజ్డ్ వాహనాలపై నిశేధం విధించారు. ఎమెర్జెన్సీ వాహనాల, కొన్ని రకాల స్నోమొబైల్స్‌ని మాత్రమే అనుమతిస్తారు. గమ్యం చేరాలంటే కాలినడక, గుర్రపుబండ్లు, సైకిళ్లే గతి.

 ది మెడినా ఆఫ్ ఫెస్-ఆల్-బలి (కార్ ఫ్రీ)

ది మెడినా ఆఫ్ ఫెస్-ఆల్-బలి (కార్ ఫ్రీ)

మొరాకోలో ఉన్న ది మెడినా ఆఫ్ ఫెస్-ఆల్-బలి ప్రాంతంలో దాదాపు 1,56,000 మందికి పైగా ప్రదలు నివసిస్తున్నారు. ప్రపంచంలో కెల్లా పట్టణ ప్రాంతాల్లో కార్లను ఎక్కువగా నిషేధించిన ప్రధనా నగరాల్లో ఇది కూడా ఒకటి. ఇదొక పురాతన నగరం, దాని ప్రాచుర్యాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నగరంలో కొన్నిచోట్ల రెండు అడుగుల వెడల్పు ఉండే రోడ్లు మాత్రమే ఉంటాయి.

హైడ్రా, సరోనిక్ ద్వీపం (కార్ ఫ్రీ)

హైడ్రా, సరోనిక్ ద్వీపం (కార్ ఫ్రీ)

గ్రీస్‌లో ఉన్న హైడ్రా, సరోనిక్ ద్వీపంలో కార్లు కనిపించవు. ఈ ప్రాంతం నుంచి రాకపోకలు జరపాలంటే పడవలే దిక్కు. ఇక్కడ గార్బేజ్ ట్రక్కులు మినగా ఇతర వాహనాలను అనుమతించరు. గుర్రాలు, గాడిదలు, వాటర్ టాక్సీలదే హవా.

లా కంబ్రెసిటా (కార్ ఫ్రీ)

లా కంబ్రెసిటా (కార్ ఫ్రీ)

అర్జెంటీనాలో ఉన్న లా కంబ్రెసిటాను పెడస్ట్రైన్ టౌన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రాంతంలో ఇళ్లను చేరేందుకు ప్రజలు కాలినడక పడుతుంటారు. చిన్న చిన్న రాళ్లతో ఏర్పాటు చేసిన వీధులపై వాహనాలను అనుమతించరు. ఎవరికైనా వాహనాలు ఉంటే రెసిడెన్స్ ఏరియాకు బయట ఉన్న పార్కింగ్ స్లాట్‌లో కారును వదలి, కిలోమీటర్ల దూరం నడవాల్సిందే.

లాము ద్వీపం (కార్ ఫ్రీ)

లాము ద్వీపం (కార్ ఫ్రీ)

కెన్యాలో ఉన్న లాము ద్వీపం ఒకప్పుడు బానిస వర్తకానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం, కానీ ఇప్పుడు అది పర్యాటక ప్రాంతంగా మారింది. ఈ ద్వీపంలో ఎలాంటి వాహనాలను అనుమతించరు. ఇక్కడ అత్యంత ప్రసిద్ధ చెందిన రవాణా సాధనం గాడిద స్వారీ. ఈ ద్వీపంలో దాదాపు 2-3 వేల గాడిదలు ఉంటాయి. అంటే, ఇక్కడ మనుషలకు బానిసతనం పోయింది కానీ గాడిదలకు పోలేదన్నమాట (సరదాగా).

వెనిస్ (కార్ ఫ్రీ)

వెనిస్ (కార్ ఫ్రీ)

ఇటలీలోని అత్యంత సుందరమైన నగరం వెనిస్. ఈ నగరంలోకి ప్రవేశించాక రవాణా చేయాలంటే కాలినడకన్నా పట్టాలి లేదా పడవలనైనా ఆశ్రయించాలి. ఇంకోమాటలో చెప్పాలంటో వెనెటియన్స్ శతాబ్ధాల పాటు పాటించిన రవాణా విధానం అన్నమాట. 118 చిన్న చిన్న దీవులను కలుపు 400 బ్రిడ్జ్‌లతో యూరప్‌లో కెల్లా అతిపెద్ద అర్బన్ కార్ ఫ్రీ నగరంగా ఇది ప్రసిద్ధి చెందింది.

కార్ ఫ్రీ నగరాలు..

ఇకపోతే చివరిగా ఈ ఫొటోలో కనిపిస్తున్నది మన భారతదేశం. మనదేశంలో కూడా వాహనాల సంఖ్య నానాటికి అధికమవుతూ ప్రమాదకర స్థాయిని చేరుతోంది. మరి మనదేశంలో కూడా కార్ ఫ్రీ జోన్‌లను ఏర్పాటు చేస్తే ఏలా ఉంటుందంటారు..? దీనిపై మీ అభిప్రాయం ఏంటి..?

More from DriveSpark

Article Published On: Tuesday, March 24, 2015, 17:50 [IST]
English summary
Fed up of pollution? Wondering where to go on your next vacation? Why don't you try one of these car-free cities, and let us know your experience. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+