గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

గత వారం భారతీయ మార్కెట్లో కొత్త కార్లు మరియు స్కూటర్లు లాంచ్ అయ్యాయి. ఇందులో మారుతి సుజుకి యొక్క ఆల్టో కె10, మహీంద్రా స్కార్పియో యొక్క క్లాసిక్, హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్, బిఎండబ్ల్యు యొక్క టూరింగ్ బైక్స్ మరియు ఓలా ఎస్1 వంటివి విదుడయ్యాయి.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

ఈ కొత్త వాహనాలు గురించి మరిన్ని వివరాలు సంక్షిప్తంగా ఈ ఒకే కథనంలో తెలుసుకుందాం.. రండి.

గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

మారుతి ఆల్టో కె10 (Maruti Alto K10) విడుదల:

మారుతి సుజుకి ఇటీవల తన అప్డేటెడ్ హ్యాచ్‌బ్యాక్‌ ఆల్టో కె10 విడుదల చేసింది. ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‌ మొత్తం నాలుగు వేరియట్స్ లో విడుదలైంది. అవి స్టాండర్డ్, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ మరియు విఎక్స్ఐ+ వేరియంట్స్. ఇందులో స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 3.99 లక్షలు కాగా, టాప్ వేరియంట్ (విఎక్స్ఐ+) ధర రూ. 5.84 లక్షలు.

గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

కంపెనీ ఈ కొత్త కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించబడింది. కావున కొనుగోలుదారులు రూ. 11,000 చెల్లించి కంపెనీ యొక్క డీలర్‌షిప్‌లో లేదా వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇది ఆధునిక ఫీచర్స్ కలిగి కొత్త డిజైన్ పొందుతుంది.

గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

ఇది కంపెనీ యొక్క పాపులర్ K10C డ్యూయెల్ జెట్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ 998సీసీ, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 66 బిహెచ్‌పి శక్తిని మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఆల్టో కె10లోని ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇది లీటరుకు 24.9 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ (Mahindra Scorpio Classic) లాంచ్:

మహీంద్రా కంపెనీ ఇప్పటికే ఆగష్టు 12 న తన స్కార్పియో క్లాసిక్ ఆవిష్కరించింది. అయితే నిన్న ధరలను అధికారికంగా వెల్లడించింది. కంపెనీ ఈ SUV ని ఎస్ మరియు ఎస్11 అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ. 11.99 లక్షలు మరియు రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 'పెర్ల్ వైట్, నాపోలి బ్లాక్, రెడ్ రేజ్, డి'సాట్ సిల్వర్ మరియు గెలాక్సీ గ్రే' అనే ఐదు కలర్స్ లో అందుబాటులో ఉంది. కావున కస్టమర్లు తమకు నచ్చిన కలర్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇందులో కొత్త లోగో, రిఫ్రెష్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ , ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, అప్‌డేట్ చేయబడిన ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, ఇరువైపులా డ్యూయల్-టోన్ క్లాడింగ్ మరియు రీడిజైన్ చేయబడిన టెయిల్-ల్యాంప్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో డ్యూయెల్ టోన్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి.

గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 2.2-లీటర్, టర్బో-డీజిల్, mHawk ఇంజిన్‌ తో వస్తుంది. ఇది 132 హెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా దాదాపు 55 కేజీలు తక్కువ బరువును పొందుతుంది. కావున ఈ కారణంగా 14 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్ (Honda Activa Premium Edition) లాంచ్:

భారతీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన 'హోండా మోటార్‌సైకిల్స్ మరియు స్కూటర్స్ ఇండియా' ఇటీవల తన యాక్టివా ప్రీమియం ఎడిషన్‌ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త ఎడిషన్ ధర రూ. 75,400 (ఎక్స్-షోరూమ్).

గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్ ఇప్పుడు కొత్త కలర్ లో అందుబాటులో ఉంది. అదే సమయంలో మరింత ప్రీమియం టచ్ ఇవ్వడానికి ముందు భాగంలో గోల్డెన్ ఇన్‌సర్ట్‌లను అమర్చారు. ముందువైపు డ్యూయల్ వింగ్-టైప్ డిజైన్ ఇప్పుడు గోల్డెన్ షేడ్‌లో ఉంది. దీనితోపాటు ముందు మరియు వెనుక వీల్స్ గోల్డెన్ పెయింట్ షేడ్‌లో ఉన్నాయి.

గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

యాక్టివా ప్రీమియం ఎడిషన్ ఇంజిన్ విషయానికి వస్తే, ఈ ప్రీమియం ఎడిషన్‌లో కూడా కొత్త BS6 109.51సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ ఉంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.68 బిహెచ్‌పి పవర్‌ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.84 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

బిఎండబ్ల్యు టూరింగ్ బైక్స్ (BMW Touring Bikes) లాంచ్:

బిఎండబ్ల్యూ ఇటీవల మార్కెట్లో నాలుగు టూరింగ్ బైక్స్ లాంచ్ చేసింది. అవి ఆర్ 1250 ఆర్‌టి (రూ. 23.95 లక్షలు), కె 1600 జిటిఎల్ (రూ. 32 లక్షలు), కె 1600 బాగర్ (రూ. 29.90 లక్షలు), కె 1600 గ్రాండ్ అమెరికానా (రూ. 33 లక్షలు), (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇవన్నీ అద్భుతమైన పనితీరుని అందిస్తాయి.

గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

బెన్లింగ్ బిలీవ్ (Benling Believe) ఎలక్ట్రిక్ స్కూటర్:

బెన్లింగ్ ఇండియా ఇటీవల దేశీయ మార్కెట్లో 'బెన్లింగ్ బిలీవ్' అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధరను రూ. 97,520 (ఎక్స్-షోరూమ్). ఇది లాంగ్ రేంజ్ మరియు హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.2 kW వాటర్‌ప్రూఫ్ BLDC ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది కేవలం 5.5 సెకన్లలో గంటకు 40 కిమీ వరకు వేగవంతమవుతుంది. కావున దీని గరిష్ట వేగం గంటకు 75 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు 250 కేజీలు.

గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

ఓలా ఎస్1 (Ola S1) లాంచ్:

ఓలా ఎలక్ట్రిక్ సోమవారం (ఆగష్టు 15 న) తన ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎస్1' విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపైనా ప్రస్తుతం అందుబాటలో ఉన్న FAME-2 సబ్సిడీ కూడా అందుబాటులో ఉంటుంది. కావున కేవలం రూ. 1 లక్ష కంటే వద్ద దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ మరియు కెపాసిటీ కలిగి ఉంటుంది.

గత వారం టాప్ కార్ & బైక్ న్యూస్.. ఆల్టో కె10 నుంచి ఓలా ఎస్1 వరకు

ఓలా ఎస్1 స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు రూ. 499 చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ (https://book.olaelectric.com/) నుండి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తరువాత 2022 సెప్టెంబర్ 2 నుండి స్కూటర్ కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. డెలివరీలు అదే సెప్టెంబర్ 7 నుంచి హోమ్ డెలివరీ ప్రారంభమవుతాయి.

More from DriveSpark

Article Published On: Sunday, August 21, 2022, 8:00 [IST]
English summary
Top car news of the week maruti alto k10 scorpio classic ola electric car details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+