Tata Tiago హ్యాచ్‌బ్యాక్‌లో మిస్ అయిన టాప్ ఫీచర్లు.. ఇవి కూడా ఉంటే బాగుండేది..!

భారత ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్(Tata Motors) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో (Tata Tiago). ఈ చిన్న కారు బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో డబ్బుకు తగిన విలువను అందించేలా ఉంటుంది. టాటా ఇండికా స్థానంలో వచ్చిన టాటా టియాగో ఈ విభాగంలోనే అద్భుతమైన కారుగా నిలిచింది.

Tata Tiago హ్యాచ్‌బ్యాక్‌లో మిస్ అయిన టాప్ ఫీచర్లు.. ఇవి కూడా ఉంటే బాగుండేది..!

ఇందుకు ప్రధాన కారణం, టాటా టియాగో కారు యొక్క మోడ్రన్ డిజైన్, లేటెస్ట్ టెక్ ఫీచర్లు అన్నింటి కన్నా మించి దాని ధృడమైన నిర్మాణం. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో టాటా టియాగో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకొని, దేశంలోనే అత్యంత సురక్షితమైన చిన్న కార్లలో ఒకటిగా నిలిచింది. భద్రత మరియు అద్భుతమైన నిర్మాణ నాణ్యత కారణంగా టాటా టియాగో భారీ విజయాన్ని సాధించింది.

Tata Tiago హ్యాచ్‌బ్యాక్‌లో మిస్ అయిన టాప్ ఫీచర్లు.. ఇవి కూడా ఉంటే బాగుండేది..!

బ్రిటిష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) ను టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత, భారతదేశంలో టాటా కార్ల ఫేట్ మరియు ఫేస్ పూర్తిగా మారిపోయింది. జెఎల్ఆర్ ఇంజనీర్లు మరియు టాటా ఇంజనీర్లు కలిసికట్టుగా పనిచేసి, అద్భుతమైన కార్లను తయారు చేయడం ప్రారంభించారు. అలా, జాగ్వార్ ల్యాండ్ రోవర్ స్ఫూర్తితో టాటా ప్రవేశపెట్టిన మొదటి వాహనమే ఈ టియాగో హ్యాచ్‌బ్యాక్.

ప్రస్తుతం, టాటా టియాగో దాని ధరకు తగిన విలువను అందిస్తున్నప్పటికీ, ఈ చిన్న కారులో మరికొన్ని ఫీచర్లు ఉంటే బాగుండదనేది మా అభిప్రాయం. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, టాటా టియాగో కోల్పోయిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

Tata Tiago హ్యాచ్‌బ్యాక్‌లో మిస్ అయిన టాప్ ఫీచర్లు.. ఇవి కూడా ఉంటే బాగుండేది..!

డీజిల్ ఇంజన్ లేకపోవడం

టాటా టియాగో 2016 మార్కెట్లోకి వచ్చినప్పుడు, కంపెనీ ఈ కారులో 1.05 లీటర్ (1047 సిసి) టర్బోచార్జ్డ్ రివోటార్క్ డీజిల్ ఇంజన్ ను ఆఫర్ చేసేది. ఈ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 69 బిహెచ్‌పి పవర్ ను మరియు 1800 ఆర్‌పిఎమ్ వద్ద 140 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేసేది. ఇది కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభ్యమయ్యేది. ఇది లీటరుకు 27.28 కిమీ సర్టిఫైడ్ మైలేజ్ ని అందించేది.

Tata Tiago హ్యాచ్‌బ్యాక్‌లో మిస్ అయిన టాప్ ఫీచర్లు.. ఇవి కూడా ఉంటే బాగుండేది..!

ఇది 3 సిలిండర్ యూనిట్ అయినప్పటికీ, ఈ డీజిల్ ఇంజన్ అద్భుతమైన పనితీరును కనబరచేది. అయితే, ఇటీవల బిఎస్-6 కాలుష్య నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, కంపెనీ ఈ చిన్న కారులో డీజిల్ ఇంజన్ ను ఆఫర్ చేయడం నిలిపివేసింది. దీంతో ఇది కేవలం పెట్రల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ కారులోని 1.2 లీటర్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

Tata Tiago హ్యాచ్‌బ్యాక్‌లో మిస్ అయిన టాప్ ఫీచర్లు.. ఇవి కూడా ఉంటే బాగుండేది..!

క్రూయిజ్ కంట్రోల్ లేకపోవడం

ధరకు తగిన విలువ పరంగా, టాటా టియాగో యొక్క డ్రైవిబిలిటీ మరియు ఓవరాల్ పెర్ఫార్మెన్స్ విశేషమైనవి. ఇందులోని 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ చాలా అధునాతనమైనది మరియు ఇది లీటరుకు 23.84 కిమీ సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

Tata Tiago హ్యాచ్‌బ్యాక్‌లో మిస్ అయిన టాప్ ఫీచర్లు.. ఇవి కూడా ఉంటే బాగుండేది..!

ఈ అన్ని ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే, టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ కారులో కంపెనీ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను జోడించడం అనేది ఓ గొప్ప నిర్ణయంగా చెప్పుకోవచ్చు. కానీ, ఇందులో ఆ ఫీచర్ అందుబాటులో లేదు. క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ సుదీర్ఘ హైవే ప్రయాణాలలో డ్రైవర్‌కి చాలా సహాయకారిగా ఉంటుంది.

Tata Tiago హ్యాచ్‌బ్యాక్‌లో మిస్ అయిన టాప్ ఫీచర్లు.. ఇవి కూడా ఉంటే బాగుండేది..!

ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు లేకపోవడం

టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడల్ భారతదేశంలో విడుదలైన తర్వాత, ఇది ఇక్కడి మార్కెట్లో లభిస్తున్న అత్యుత్తమ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటిగా మారింది. కానీ, ఈ కారులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు లేకపోవడం గమనార్హం. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మోడల్ యొక్క టాప్ ఎండ్ వేరియంట్లలో కూడా, కంపెనీ ఈ ఫీచర్‌ను అందించడం లేదు. ఇందులో లభించే సాంప్రదాయ H4 హాలోజెన్ బల్బులు బాగానే పనిచేస్తాయి కానీ, ఇది ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ల పనితీరును కోల్పోవడం ఓ లోపంగా చెప్పుకోవచ్చు.

Tata Tiago హ్యాచ్‌బ్యాక్‌లో మిస్ అయిన టాప్ ఫీచర్లు.. ఇవి కూడా ఉంటే బాగుండేది..!

రియర్ ఏసి వెంట్‌లు మరియు 12 వోల్ట్ పవర్ సాకెట్ లేకపోవడం

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అనేక బేసిక్ కార్లలో కూడా ఇప్పుడు రియర్ ఏసి వెంట్స్ ఫీచర్ లభిస్తోంది. ఏ కారులో అయినా సరే రియర్ ఏసి వెంట్స్ మరియు పవర్ సాకెట్లు అద్భుతమైన ప్రాక్టికాలిటీ మరియు సౌకర్యాన్ని అందిస్తాయి. టాటా టియాగో కోల్పోయిన అనేక ముఖ్యమైన ఫీచర్లలో ఇవి కూడా ఉన్నాయి.

Tata Tiago హ్యాచ్‌బ్యాక్‌లో మిస్ అయిన టాప్ ఫీచర్లు.. ఇవి కూడా ఉంటే బాగుండేది..!

దూర ప్రయాణాలు చేసేవారికి మరియు వేసవి సీజన్ లో వెనుక సీటులో కూర్చునే ప్రయాణీకుల సౌకర్యం కోసం రియర్ ఏసి వెంట్స్ ఫీచర్ చాలా అవసరం. అలాగే, ఈ రోజుల్లో మన జీవితం నిత్యం స్మార్ట్‌ఫోన్ చుట్టూ కనెక్ట్ అయి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో, ఫోన్ చార్జింగ్ అయిపోకుండా ఉండేందుకు రియర్ పవర్ సాకెట్ తప్పనిసరి. మరి తదుపరి అప్‌డేట్‌లో అయినా టాటా టియాగో కంపెనీ ఈ ఫీచర్లను జోడిస్తుందో లేదో చూడాలి.

Tata Tiago హ్యాచ్‌బ్యాక్‌లో మిస్ అయిన టాప్ ఫీచర్లు.. ఇవి కూడా ఉంటే బాగుండేది..!

వెనుక సీటులో సెంటర్ ఆర్మ్‌రెస్ట్ లేకపోవడం

కుటుంబంతో దూరం ప్రయాణాలు చేసే వారికి వెనుక సీటులో ఉండే ఆర్మ్‌రెస్ట్‌లు ఎంత ముఖ్యమో వేరే చెప్పనక్కర్లేదు. వెనుక సీటులో ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చుని ప్రయాణిస్తున్నప్పుడు, సీటు మధ్యలో ఉండే ఫోల్డబిల్ ఆర్మ్‌రెస్ట్ లు ప్రయాణీకులకు మరింత సౌకర్యాన్ని అందిస్తాయి. కాబట్టి, టాటా టియాగో కారులో ఇలాంటి ఓ ఫీచర్ ఉంటే బాగుండేది.

Tata Tiago హ్యాచ్‌బ్యాక్‌లో మిస్ అయిన టాప్ ఫీచర్లు.. ఇవి కూడా ఉంటే బాగుండేది..!

పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ లేకపోవడం

ఈ రోజుల్లో కార్లను కేవలం ఒక్క బటన్ సాయంతోనే స్టార్ట్ చేయవచ్చు మరియు స్టాప్ చేయవచ్చు. టాటా టియాగో ని ఆధునిక కార్లలో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఈ కారులో ఆధునిక కార్లలో ఉండే పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్ లేదు. నిజానికి ఈ ఫీచర్ చాలా సరళమైనదే అయినప్పటికీ, ఇది డ్రైవర్ కు గొప్ప సౌకర్యాన్ని అందిస్తుంది.

Tata Tiago హ్యాచ్‌బ్యాక్‌లో మిస్ అయిన టాప్ ఫీచర్లు.. ఇవి కూడా ఉంటే బాగుండేది..!

రిమోట్‌లో బూట్ రిలీజ్ బటన్ లేకపోవడం

ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని హై-ఎండ్ కార్లలో కేవలం కాలి సంజ్ఞలతో బూట్ డోరును ఓపెన్ చేయవచ్చు. అలాగే, కొంచెం తక్కువ ప్రీమియం కార్లలో రిమోట్‌లో ఉండే బూట్ బటన్ ను నొక్కడం ద్వారా బూట్ డోర్ ఓపెన్ చేయవచ్చు. కానీ, టాటా టియాగోలో మాత్రం బూట్ డోరును మ్యాన్యువల్ గానే ఓపెన్ చేయాలని మరియు మ్యాన్యువల్ గానే క్లోజ్ చేయాలి. ఈ కారు రిమోట్ కీలో కూడా ఇలాంటి ఓ ఫీచర్ అందించి ఉంటే, అది ప్రయాణీకులకు మరియు మరియు డ్రైవర్ కు కూడా ఎంతో సౌకర్యంగా ఉండేది.

Most Read Articles

English summary
Top features that are missing in tata tiago hatchback
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X