Highest Range Electric Cars అత్యధిక రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు..!!
ఆటోమొబైల్ రంగంపై కొంచెం పట్టున్న వారిని.. భవిష్యత్ వాహనాలు ఏంటని అడిగితే.. వెంటనే వారి నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) అని సమాధానం వస్తుంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన రంగం గణనీయమైన అభివృద్ధి కనిపిస్తోంది. భవిష్యత్‌లో ఈ సంఖ్య భారీగా పెరగనుంది. చాలా మంది ప్రముఖులు కూడా ఈవీలపై మనసు పారేసుకుంటున్నారు.
ప్రస్తుతం భారత్ మార్కెట్ అనేక ఈవీలు అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనాలు కొనుగోలు చేసేవారు ప్రధానంగా రేంజ్‌ను దృష్టిలో పెట్టుకుంటారు. అలాంటి వారి కోసం టాప్ 5 రేంజ్ ఎలక్ట్రిక్ కార్లుపై ప్రత్యేక కథనాన్ని అందిస్తున్నాం.

మెర్సిడెస్ బెంజ్ EQS : ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లలో మెర్సిడెస్ బెంజ్ EQS అత్యధిక రేంజ్‌ను కలిగి ఉంది. ఈ ఈవీ ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు 107.8 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటాయి.
బేస్ వేరియంట్ '580 4Matic' గరిష్ఠంగా 516 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. '53 4Matic ప్లస్ ఏఎంజీ' 751 bhp శక్తిని అందిస్తుంది. ఈ రెండు వేరియంట్లు మంచి కంఫర్ట్, లగ్జరీని అందిస్తాయి. మెర్సిడెస్ బెంజ్ EQS ధర రూ.1.59 కోట్లు నుంచి 2.45 కోట్ల రూపాయల మధ్య అందుబాటులో ఉంది.

కియా EV6 : భారత్‌లో EV6 కియో యొక్క ఏకైన ఎలక్ట్రిక్ కారు. ఈ ఈవీ అనేక మంచి ఫీచర్లను కలిగి ఉంది. ఆకర్షణీయమైన డిజైన్ కియా EV6 సొంతం. ఈవీ6 కారు GT Line మరియు GT Line AWD రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఈవీ6 రెండు వేరియంట్లు 226 bhp మరియు 320 bhpలో అందుబాటులో ఉంటాయి. మరియు 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటాయి. ఈ కారు 708 కి.మీ రేంజ్‌ను ఇస్తుందని సంస్థ తెలిపింది. మరియు ధర రూ.60.95 లక్షల నుంచి 65.95 లక్షలుగా ఉంది.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 : ఐయోనిక్ 5 హ్యుందాయ్ ఇండియా యొక్క రెండో ఎలక్ట్రిక్ కారు. అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. 72.6 kWH లిథియం ఐయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. మరియు 215 bhp మోటర్‌తో వస్తుంది. ఈ కారు ధర రూ.45.95 లక్షలు. మరియు 631 రేంజ్‌ను అందిస్తుందని సంస్థ వెల్లడించింది.

BMW i7 : BMW ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువగా దృష్టిపెట్టింది. కొన్ని వాహనాలను కూడా విడుదల చేసింది. ఇందులో బీఎండబ్ల్యూ i7 అత్యధిక రేంజ్‌ను కలిగి ఉంటుంది. మరియు 101.7 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. మరియు 536 bhp గరిష్ఠ శక్తిని అందిస్తుంది. ఈ ఈవీ మంచి పనితీరుని కనబరుస్తుంది. BMW i7 కారు ధర రూ.1.95 కోట్లు. మరియు ఈవీ 625 కి.మీ రేంజ్ అందిస్తుంది.

ఆడీ e-Tron GT Quattro : ఆడీ e-Tron GT Quattro ఎలక్ర్టిక్ కారు మంచి పనితీరును కనబరుస్తుంది. 93.4 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 523 bhp రెండు ఎలక్ట్రిక్ మోటార్లు (యాక్సిల్‌కు ఒకటి) ఉంటాయి. ఈ కారు ధర రూ.1.70 కోట్లు మరియు 500 కి.మీ రేంజ్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








