కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

మనదేశంలో చాలా మంది తమ కార్లను తమకు నచ్చిన విధంగా మోడిఫై చేయించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే, ఇతరులతో పోల్చుకుంటే తమ కారు ఎంతో ప్రత్యేకంగా, భిన్నంగా కనిపించేలా ఉండాలని కోరుకుంటుంటారు. ఇందుకోసం కస్టమర్లు కార్ మోడిఫైయర్లను ఆశ్రయిస్తుంటారు.

కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

అయితే, కస్టమర్లు తమ వాహనాల విషయంలో ఇలా చేసే మోడిఫికేషన్ల వలన వారికి తెలియకుండానే చిక్కుల్లో పడుతుంటారు. చట్టవిరుద్ధమైన మోడిఫికేన్ల కారణంగా, భారీ మొత్తాల్లో ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే, అధికారులు సదరు వాహనాలను సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

మరి కారులో ఎలాంటి మోడిఫికేషన్లను చేస్తే చట్టవిరుద్ధం కాదు, ఎలాంటి మోడిఫికేషన్లకు అనుమతి ఉంది అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

MOST READ:పాత వాహనాలను స్క్రాప్ చేస్తే ఇన్సెంటివ్స్; త్వరలోనే నోటిఫికేషన్

కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

1. బాడీ రీపెయింటింగ్

పాత కార్లను రీపెయింట్ చేయించుకోవటం లేదా కొత్త కార్లపై వినైల్ వ్రాప్ వేయించుకోవటం చట్టవిరుద్ధం కాదు. కారును రీపెయింట్ చేయటానికి లేదా వినైల్ వ్రాప్ అంటించడానికి ఆర్టీఓ నుంచి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. అయితే, కారును రీపెయింట్ చేయించేటప్పుడు లేదా వినైల్ వ్రాప్ చేయించేటప్పుడు అది పాత కార్ కలర్‌లోనే ఉండాలి.

కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

అంటే, ఉదాహరణకు మీ దగ్గర రెడ్ కలర్ కార్ ఉందనుకుంటే, దానిని రీపెయింట్ చేయించేటప్పుడు తిరిగి రెడ్ కలర్‌లోనే రీపెయింట్ చేయించాలి. అంతేకానీ, వేరే ఏ ఇతర కలర్‌లోనూ రీపెయింట్ చేయకూడదు. అలా చేస్తే, చట్ట విరుద్ధం అవుతుంది. ఒకవేళ మీరు మీ కారును మీకు నచ్చిన కలర్‌లో పెయింట్ చేయించుకోవాలనుకుంటే, ఆర్టీఓ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త పెయింట్ కోసం అనుమతి పొందిన తర్వాత, దాని సమాచారం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో కూడా అప్‌డేట్ చేయబడుతుంది.

MOST READ:డ్రైవింగ్ టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఎలా.. ఇది చూడండి

కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

2. రిమ్ మరియు టైర్ మోడిఫికేషన్

కారులోని రిమ్ మరియు టైర్‌ను సరైన విధానంలో మోడిఫై చేయాలి. అనుమతికి మించిన పరిమాణంలో టైరును లేదా చక్రాలను మోడిఫై చేయటం చట్టవిరుద్ధం అవుతుంది. అంటే, ఉదాహరణకు, టైర్ పరిమాణం అనుమతించబడిన దానికంటే ఎక్కువ లేదా తక్కువ ఉండకూడదు.

కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

వాస్తవానికి ఫ్యాక్టరీలో అమర్చిన టైర్లు మరియు చక్రాలే వాహనం యొక్క మెరుగైన పనితీరు కోసం అత్యంత అనుకూలమైనవిగా పరిగణించబడతాయి. ఏదైనా వాహనంలోని రిమ్ లేదా టైరును మార్చేటప్పుడు, అది వాహనం యొక్క సమతుల్యతకు (బ్యాలెన్స్‌కు) భంగం కలిగించదని నిర్ధారించుకోవాలి. రహదారిపై ఉన్న ఇతర వాహనాలకు హాని కలిగించని విధంగా టైర్లు మరియు రిమ్స్ ఉండాలి.

MOST READ:ప్రమాదానికి గురైన అల్లు అర్జున్ కారావ్యాన్..ఎలా జరిగిందంటే ?

కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

3. బాడీ కిట్

ప్రస్తుతం అనేక కార్ కంపెనీలు తమ స్టాండర్డ్ ఉత్పత్తులను ఆధారంగా చేసుకొని, వాటిని ప్రత్యేకంగా కనిపించేలా చేసేందుకు స్పెషల్ బాడీ కిట్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇలా స్టాండర్డ్ కార్లపై సర్టిఫై చేసిన బాడీ కిట్స్ ఉపయోగించడం చట్టవిరుద్ధం కాదు.

కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

సాధారణంగా, కంపెనీలు అందించే బాడీ కిట్స్‌లో సైడ్ ప్యానెల్స్, ఫ్రంట్ స్ప్లిటర్స్, డిఫ్యూజర్స్, బాడీ క్లాడింగ్ మరియు స్పెషల్ బాడీ గ్రాఫిక్స్ మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ కారు యొక్క అసలు పరిమాణాన్ని మార్చవు కాబట్టి, ఇవి అనుమతించబడుతాయి. అయితే, ఆఫ్టర్ మార్కెట్‌లో లభించే కొన్ని బాడీ కిట్స్ విషయంలో జాగ్రత్త వహించాలి.

MOST READ:ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అభినందించిన కమల్ హాసన్, ఎందుకో తెలుసా ?

కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

4. ఆఫ్టర్ మార్కెట్ సిఎన్‌జి కిట్

సాధారణంగా కార్ కంపెనీలే ఇప్పుడు సిఎన్‌జి కిట్‌తో కూడిన వాహనాలను విక్రయిస్తున్నాయి. అలా కాకుండా, కస్టమర్లు ఎవరైనా తమ పెట్రోల్ కార్లకు సిఎన్‌జి కిట్‌ను అమర్చుకోవాలనుకుంటే, సర్టిఫై చేయబడిన ఆఫ్టర్ మార్కెట్ ఉత్పత్తులను ఎంచుకోవచ్చు.

కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

అయితే, ఇందుకు తప్పనిసరిగా ఆర్టీఓ అనుమతి పొందాల్సి ఉంటుంది. కారులో సిఎన్‌జి కిట్ అమర్చడం గురించి ఆర్టీఓ నుండి అనుమతి పొందాలి. సిఎన్‌జి మోడల్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అందుకు సంబంధించిన సమాచారాన్ని ఆర్‌సిలో అప్‌డేట్ చేయటం జరుగుతుంది. ఆర్టీఓ అనుమతి లేకుండా సిఎన్‌జి కిట్ అమర్చుకోవటం చట్టవిరుద్ధంగా పరిగణించడం జరుగుతుంది.

కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

5. ఎల్ఈడి డిఆర్ఎల్స్

హైడ్‌లైట్లలో మార్పులు చేయటం చట్టవిరుద్ధంగా పరిగణించడం జరుగుతుంది. ఫ్యాక్టరీ అనుమతించిన హెడ్‌లైట్స్ కాకుండా వేరే ఏ ఇతర లైట్స్ ఉపయోగించినా అవి రోడ్డుపై ఎదురుగా వచ్చే డ్రైవర్ విజిబిలిటీని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అయితే, ఎల్ఈడి డిఆర్ఎల్స్ (డేటైమ్ రన్నింగ్ లైట్స్)లో మార్పులు చేసుకోవ్చచు.

కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

ఒకవేళ మీ కారుకి ఎల్ఈడి డిఆర్ఎల్ కోసం బంపర్‌లో స్థానం ఉండి, ఫ్యాక్టరీ అమర్చిన డిఆర్ఎల్స్ లేకపోయినట్లయితే, వాటిని ఆఫ్టర్ మార్కెట్ ఉత్పత్తులతో రీప్లేస్ చేసుకోవచ్చు. నిజానికి ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఎంతో చక్కగా పనిచేస్తాయి మరియు డ్రైవర్ విజిబిలిటీని పెంచుతాయి. కాకపోతే, వీటిని కూడా పరిమితికి మించి మోడిఫై చేయకూడదని గుర్తుంచుకోండి.

Most Read Articles

English summary
Top Five Legal Car Modifications Allowed In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X