ఎంత వర్షాలలోనైనా ఈ వాహనాలతో సురక్షితంగా ప్రయాణించండి
అతి వృష్టి అయినా, అనావృష్టి అయినా మనుషులు ఏమాత్రం భరించ లేరు. గత వారం రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దీని వలన సాధారణ ప్రజల జీనం మరింత దుర్భరమైపోయింది. ఏ మాత్రం రోడ్ల మీదకు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్ని కట్టలు తెంచుకుపోయాయి.
Also Read: అత్యంత ఖరీదైన బైక్‌ను విడుదల చేసిన డుకాటి: 400సీసీ స్క్రాంబ్లర్.
రోడ్లన్ని పాడైపోయి వరదల వలన రోడ్లన్ని చెరువులు, నదుల వలె తలపిస్తున్నాయి. దీని వలన సాధారాణ వాహనాలతో ఏ మాత్రం ఆ రోడ్ల మీద ప్రయాణించేందుకు వీలు లేకుండా ఉంది, కనీసం అత్యవసర సేవలకు కూడా ఆటంకం ఏర్పడింది.
Also Read: రెండు రోజుల్లో 180 కోట్ల రుపాయలు నష్టపోయిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ: కారణం ఏంటి?
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు నీటి మీద నడిచే వాహనాలను అందుబాటులో ఉంచుకుంటే ఇలాంటి అత్యవసర సేవలకు ఎంతో ఉపయోగపడుతాయి. అందుకోసం డ్రైవ్‌స్పార్క్ వివిద రకాల ఆంపిబియస్ వాహనాలను అందిస్తోంది. ఒక వేల మీకు నచ్చితే కొనేయండి. ఎంచక్కా నీటి మీద మరియు రోడ్ల మీద వెళ్లండి. కొనే ముందు క్రింద గల స్లైడర్ మీదు ఓ చూపు చూడండి....

10.గిబ్స్ క్వాడ్‌స్కి
గిబ్స్ క్వాడ్‌స్కి ఆంపిబియస్ 4-స్ట్రోక్ వాహనం నేల మీద మరియు నీటి మీద రెండింటి మీద నడుస్తుంది. ఇది నీటి మీద దాదాపుగా రెండు గంటల పాటు నడుస్తుంది. నీటి మీద దీని గరిష్ట వేగం గంటకు 72 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని నీటిలోకి తీసుకెళ్లిన తరువాత ఒక బటన్ ఉంటుంది దానిని ప్రెస్ చేసిన తరువాత ఆటోమేటిక్‌గా ఇది నీటిలో ప్రయాణాన్ని మొదలుపెడుతుంది.

09. ఆంపికార్
ఈ ఆంరికార్‌ను 1961లో అభివృద్ది చేశారు. తరూవాత 1965 వరకు దాదాపుగా 4000 యూనిట్ల ఆంపికార్లను తయారుచేసారు. దీనిని హాన్స్ ట్రిప్పల్ అనే సంస్థ తయారుచేసింది. మరియు ఇది దాదాపుగా 43 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని అమెరికా దేశస్థులు రూపొందించారు. మరియు అమెరికాకు మాత్రమే వీటిని పరిమితం చేశారు.

08. గిబ్స్ అక్వాడా
గిబ్స్ ఆక్వాడా కాన్సెప్ట్ కారును 2003, 2004 మధ్య కాలంలో అభివృద్ది చేశారు. ఇందులో అత్యంత శక్తివంతమైన 2.5-లీటర్ వి6 ఇంజన్ కలదు. ఇది రోడ్డు మీద అయితే గంటకు 160 కిలోమీటర్ల అత్యధిక వేగంతో ప్రయాణిస్తుంది మరియు నీటి మీద గంటకు 50 కిలో మీటర్ల అత్యధిక వేగంతో ప్రయాణిస్తుంది. దీని న్యూజిల్యాండ్‌కు చెందిన అక్‌ల్యాండ్ వాసులు రూపొందించారు.

07. రిన్‌స్పీడ్ స్ల్పాష్
ఈ రిన్‌స్పీడ్ స్ల్పాష్ ఆంపిబియస్ కారును స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రసిద్ద ఆటోమొబైల్ తయారీదారులు రిన్‌స్పీడ్ వారు తయారు చేసారు. ఇందులో 750సీసీ గల రెండు సిలిండర్ల టర్బోఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఇది నేల మీద గంటకు 200 కిలోమీటర్లు వేగంతో వెలుతుంది మరియు నీటి మీద 45 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది.

06.సీరోడర్ ల్యాంబోర్గిని కౌంటాక్
ఒక విధంగా మొట్టమొదటి ఆంపిబియస్ వాహనం ఇదే అని చెప్పవచ్చు . అయితే ఇది ఏ మాత్రం తక్కువ ధర కాదు దీని ధర కాస్త ఎక్కువే. ఈ ఆంపిబియస్ వాహనాన్ని మైక్ ర్యాన్ అనే సంస్థ రూపొందించింది. ఇందులో గల హైడ్రోఫాయిల్ ద్వారా దీని ముందు భాగాన్ని నీటిలో ప్రయాణించేంత సేపు పైక ఎత్తి ఉంచుతుంది. మరియు మంచి సస్పెన్షన్ కోసం ఇందులో కంప్రెస్స్‌డ్ హైడ్రాలిక్ ఆక్టివేటర్స్‌ను కల్పించారు.

05. గిబ్స్ హమ్‌డింగా
ఇది ఏ సమయంలోనైనా నాలుగు చక్రాల ద్వారా పని చేస్తుంది. ఇందులో 350బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల వి8 ఇంజన్ కలదు. అయితే దీనిని గిబ్స్ వారి అక్వాడా వాహనం యొక్క పరిజ్ఞానంతో రూపొందించారు.ఇది నేల మీద గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మరయు నీటి మీద గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

04. హైడ్రా స్పైడర్
ఈ హైడ్రాస్పైడర్ యొక్క అత్యధిక వేగం నీటి మీద గంటకు 85 కిలోమీటర్లు మరియు నేల మీద 201 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని కూల్ ఆంపిబియస్ మ్యానుఫ్యాక్ఛర్స్ ఇంటర్నేషనల్(సిఎయమ్ఐ) వారు తయారు చేశారు.న మరియు ఇందులో 400బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 6.0-లీటర్ వి8 ఇంజన్ కలదు.

03.డుబ్బెర్టిన్ హైడ్రోకార్
ఈ ఓపెన్ టాప్ ఆంపిబియస్ కారులో 762బిపెచ్ పవర్ ఉత్పత్తి చేయగల ఇంజన్ కలదు. ఇందులో ల్యాండ్ మోడ్ మరియు వాటర్ మోడ్ అనే రెండు ఆప్షన్‌లు కలవు దీని ద్వారా దేని ప్రయాణించాలో ఈ మోడ్ ద్వారా ఎంచుకోవచ్చు

02. సముద్రపు సింహం (సీ లయన్)
ఇది నిజంగానే సముద్రపు సింహం ఎందుకంటే నీటి మీద అత్యధిక వేగంతో ప్రయాణించ గల వాహనం ఇదే కాబట్టి. ఇది నేల మీద అత్యధికంగా గంటకు 201 కిలోమీటర్లు మరియు నీటి మీద అత్యధికంగా గంటకు 96 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. నీటి మీద అత్యధిక వేగంతో ప్రయాణించే ఆంపిబియస్ వాహనంగా ఇది రకార్డ్‌లకు ఎక్కడానికి కారణం మార్క విట్ అనే వ్యక్తి

01. వాటర్ కార్ ప్యాంథర్
వాటర్ కార్లలో చివరిది ఈ ప్యాంథర్. దీనిని జీప్ సిజె8 స్క్రాంబ్లర్ ఆధారంతో రూపొందించారు. దీనిని వ్యవస్తాపకుడు డేవ్ మార్క్ ఈ యస్‌యువి ప్యాంథర్ ఆంపిబియస్ వాహనాన్ని డిజైన్ మరియు అభివృద్ది మొత్తానికి ఇతనే ఆధ్యుడు. ఇది నీటి మీద గరిష్టంగా గంటకు 42 కిలోమీటర్ల వేగంతో మరియు నేల మీద గంటకు 128 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

- ప్రపంచంలో కెల్లా అతిపెద్ద క్రూయిజ్ షిప్స్
- ఆటోమొబైల్స్ గురించి కొన్ని ఆసక్తికర వాస్తవాలు (వరల్డ్‌వైడ్)


Click it and Unblock the Notifications








