కార్ల కోసం భవిష్యత్తులో రానున్న పది టెక్నాలజీలు

By Anil

ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు ఆటోమొబైల్ సంస్థలు తమ ఉత్పత్తుల్లో ఉన్న విలక్షణమైన ఫీచర్లు ఉన్నాయంటూ వినియోగదారులను ఆకర్షిస్తుంటారు. అలా చాలా వరకు కార్ల తయారీ సంస్థలు వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఆధునిక టెక్నాలజీలను ఆయుధంగా చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో భవిష్యత్తులో కొన్ని అధునాతనమైన ఆధునిక టెక్నాలజీలు అందుబాటులోకి రానున్నాయి. అందులో పదింటి గురించి క్రింది కథనంలో...

 10. ఎయిర్ కండీషన్ సీట్లు

10. ఎయిర్ కండీషన్ సీట్లు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను సాదరణ కార్ల వరకు అన్నింటిలో కూడా ఏ/సి అందుబాటులో ఉంచారు. దీనికి అడ్వాన్స్‌గా త్వరలో ఏ/సి సీట్లు రానున్నాయి. సీట్లకు చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా ఏ/సి వెలువరించే చల్లదనం విడుదల అవుతుంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఖరీదైన కార్లను అందిస్తున్న మెర్సిడెస్-బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, వోల్వో మరియు ఆడి వంటి సంస్థలు ఈ టెక్నాలజీని ఆక్టివ్ సీట్ వెంటిలేషన్ అనే పేరుతో తమ కార్లలో అందిస్తున్నాయి.

09. ట్రాఫిక్ సంజ్ఞలను గుర్తించే పరిజ్ఞానం

09. ట్రాఫిక్ సంజ్ఞలను గుర్తించే పరిజ్ఞానం

ఈ టెక్నాలజీ రోడ్డు మీద ఉండే ట్రాఫిక గుర్తులను (స్పీడ్ లిమిట్, టర్న్ లెఫ్ట్/ టర్న్ రైట్) గుర్తించి డ్రైవర్‌కు ముందు వైపున్న ఇన్ఫర్మేషన్‌ క్లస్టర్ మీద చూపిస్తుంది. రోడ్డు సంజ్ఞలను గుర్చించని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుంది. కారుకు ముందు వైపు కెమెరా ఉంటుంది. ఇది దీనికి ముందువైపున ఉన్న ట్రాఫిక్ నియమాల,గుర్తులను గ్రహిస్తుంది. ఈ పరిజ్ఞానాన్ని భద్రత ఫీచర్లలో భాగంగా అందుబాటులోకి రానుది.

 08. రాత్రి పూట బాటసారులను గుర్తించే పరిజ్ఞానం

08. రాత్రి పూట బాటసారులను గుర్తించే పరిజ్ఞానం

రాత్రి పూట బాటసారులను గుర్తించే ఈ పరిజ్ఞానం, చీకటిలో పాదచారులను గుర్తించి వారిని స్కాన్ చేసి డ్రైవర్‌కు ఇన్ఫోటైన్‌మెంట్ క్లస్టర్ ద్వారా సామాచారాన్ని అందిస్తుంది. అయితే ఈ పరిజ్ఞాన్ని వోల్వో సంస్థ తమ వి40 మరియు ఎస్60 వంటి కార్లలో అందించింది. కాని భారత్‌కు రావడానికి ఇంకా సమయం పట్టనుంది.

07. ముందు వైపున అద్దం మీద డ్యాష్ బోర్డ్

07. ముందు వైపున అద్దం మీద డ్యాష్ బోర్డ్

వీటిని అగుమెంటెడ్ రియాలిటీ డ్యాష్ బోర్డ్ అంటారు. దీని ద్వారా ఎదురుగా వెళుతున్న వాహనం మనకు ఎంత దూరంలో ఉంది, ప్రమాదం జరిగే అవకాశాలు, కారు వేగం, ఎదుటి కార్ల వేగం, రహదారిలో ఏ విభాగంలో వెళుతున్నాము వంటి అనేక విషయాలను అద్దం మీద క్లియర్‌గా చూడవచ్చు. ఈ భవిష్యత్ టెక్నాలజీని బిఎమ్‌డబ్ల్యూ తాజాగా ప్రదర్శిన మోడల్‌లో దీనిని పరిచయం చేశారు.

06. తెలివైన హెడ్‌లైట్లు

06. తెలివైన హెడ్‌లైట్లు

ఇండియన్ కార్లలో ఇంత వరకు ఆటో హెడ్ ల్యాంప్స్ మరియు గైడ్ మి హోమ్ లైట్లు వంటివి పరిచయమే కాలేదు. అయితే ఈ ఇంటెలిజెంట్ హెడ్ లైట్లు కథేంటో తెలుసా ? ఎదురుగా వస్తున్న కార్లకు అనుగుణంగా ఆటోమేటిక్ ఎక్కువ కాంతితో డిమ్ అండ్ డిప్‌ను ఇస్తాయి. డ్రైవర్లు ఎక్కువగా డిమ్ అండ్ డిప్ ఇవ్వకుండా అలాగే వెలుతుంటారు.

05. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్

05. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో క్రూయిజ్ కంట్రోల్ వ్యవస్థ చాలా కార్లలో ఉంది. దీని ద్వారా వేగం యొక్క నియంత్రణ మరియు నిర్ధిష్ట వేగాన్ని అనుసరిచండానికి ఈ క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగపడుతుంది. కాని ఈ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ద్వారా రెండు అంశాలను స్టీరింగ్ ఆధారంగా ఆపరేట్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ అభివృద్ది కోసం ఇందులో సెన్సార్లు మరియు రాడార్లను వినియోగించారు. ప్రారంభంలో ఈ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌ను మిత్సుబిషి సంస్థ 1995 లో తమ కార్లలో అందుబాటులోకి తెచ్చింది.

04. ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టమ్

04. ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టమ్

ఈ టెక్నాలజీ ఇప్పుడు అన్ని కార్లలో కూడా ఎంతో ముఖ్యం. ఎదురుగా ప్రమాదానికి కారణం అయ్యే వాటిని గుర్తించడానికి ఇందులో రకరకాలసెన్సార్లు, రాడార్లు, వీడియో కెమెరాలు మరియు జీపిఎస్ సిస్టమ్స్‌ ఇందులో ఉన్నాయి. ప్రమాదం జరగడానికి ముందే ప్రమాద ఘంటికలను డ్రైవర్‌కు సంకేతాల ద్వారా తెలిపి బ్రేకులను, సీటు బెల్ట్‌లను ఆక్టివేట్ చేస్తుంది.

3. V2V కనెక్టివిటి

3. V2V కనెక్టివిటి

V2V కనెక్టివిటి అనగా వెహికల్ నుంచి వెహికల్‌కు కనెక్టివిటి అని అర్థం. ఇందులో ప్రత్యేకమైన వై-ఫై సిగ్నల్స్ ద్వారా ప్రతి యొక్క వాహనం దాని పరిధిలోకి వచ్చే వాహనంతో అనుసంధానం అయిపోతుంది. ఆ తరువాత ఒక వాహనం ఏ దిశలో వెళుతోంది, దాని వేగం, ఆ రెండింటి మధ్య దూరం వంటి వివరాలు ఇతర వాహన చోదకులకు చేరుతాయి. తద్వారా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇది కనుక అందుబాటులోకి వస్తే ఆటోమొబైల్ పరిజ్ఞానాలలో ఒక కొత్త విప్లవం అని చెప్పవచ్చు.

02. అడ్వాన్స్‌డ్ ఆటోమోటివ్ కార్లు

02. అడ్వాన్స్‌డ్ ఆటోమోటివ్ కార్లు

మీరు కారులో కూర్చున్న తరువాత ముందువైపున ఒక మూల నుండి మరో మూలకు దాదాపుగా ఖచ్చితంగా చూడలేము. కాని ముందు వైపు 180 డిగ్రీల కోణంలో తిరిగే కెమెరాల ద్వారా మన బాగా చూడగలం. తద్వారా ప్రమాదాలు జరగకుండా మరియు మనం వెళ్లాల్సిన ప్రదేశాన్ని దాటవేలి వెళ్లిపోతే ఇది మనల్ని అలర్ట్ చేస్తుంది. ఈ పరిజ్ఞానాన్ని బిఎమ్‌డబ్ల్యూ తమ 5 మరియు 7 సిరీస్ కార్లలోని టాప్ ఎండ్ వేరియంట్లో ఆప్షనల్‌గా అందుబాటులో ఉంచింది.

01. సెల్ఫ్ డ్రైవింగ్ కారు (స్వయం చోదక వాహనం)

01. సెల్ఫ్ డ్రైవింగ్ కారు (స్వయం చోదక వాహనం)

సొంతం పరిజ్ఞానంతో తనంతట తానుగా నడిచే కార్లను అతి త్వరలో చూడబోతున్నాం. ఈ పరిజ్ఞానం అభివృద్దిలో గూగుల్ ఎన్నో ముందడుగులు వేసింది. సురక్షితంగా, సౌకర్యవంతంగా, మృదువైన డ్రైవింగ్ శైలిలో మనం ఈ డ్రైవర్ రహిత కార్లలో తిరగనున్నాం.

కార్ల కోసం భవిష్యత్తులో రానున్న పది టెక్నాలజీలు

ఇండియన్ ఇస్రో దాటికి బెంబేలెత్తుతున్న అమెరికా

డ్రైవర్ లేకుండా నడిచే కారు

Most Read Articles

English summary
To Ten Future Technologies For Cars
Story first published: Monday, May 16, 2016, 15:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X