రైళ్లలో తరచూ ప్రయాణిస్తున్నా ఈ పదాల గురించి బహుశా మీకు తెలియకపోవచ్చు

Written By:

ప్రపంచపు అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్ కలిగిన దేశాలలో ఇండియా ఒకటి. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలలో మరియు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారతీయ రైల్వే సేవలందిస్తోంది. ఒక్కో ప్రాంతం మధ్య ఒకరమైన రైళ్లను నడుపుతోంది. అదే విధంగా అవసరాన్ని బట్టి వివిధ రకాల రైలు సర్వీసులను నడుపుతోంది. మరి ఇండియన్ రైల్వేలో అధిక ప్రాధాన్యత గల రైళ్లు ఏవో తెలుసా ? అయితే ఈ కథనం తప్పకుండా చూడాల్సిందే.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
రాజధాని ఎక్స్‌ప్రెస్

రాజధాని ఎక్స్‌ప్రెస్

భారతీయ రైల్వేలో ఉన్న రైళ్లలో అధిక ప్రాధాన్యత ఉన్న వాటిలో మొదటి సర్వీస్ రాజధాని ఎక్స్‌ప్రెస్. మరియు ఇవి అత్యంత వేగవంతమైన సర్వీసులు కూడా. పూర్తి స్థాయి ఎయిర్ కండీషనింగ్ గల ఈ రాజధాని రైళ్లను దేశ రాజధాని ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల రాజధానులకు నడుపుతున్నారు.

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఉదాహరణ

రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఉదాహరణ

 • ముంబాయ్ రాజధాని ఎక్స్‌ప్రెస్
 • డిబ్రూఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్
 • హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్
శతాబ్ది ఎక్స్‌ప్రెస్

శతాబ్ది ఎక్స్‌ప్రెస్

భారత దేశంలోని ప్రధాన మెట్రో నగరాలను, ఇతర సమీప నగరాలను కలిపే రైళ్లను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు అంటారు. ఇండియన్ రైల్వేలో వీటికి రెండవ అధిక ప్రాధాన్యత కలదు. శతాబ్ది రైళ్లు పరిమిత దూరం మాత్రమే ప్రయాణిస్తాయి.

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో అధిక ప్రాధాన్యత గల రైళ్లు

ఒకే రోజున ప్రయాణాన్ని ప్రారంభించి గమ్యస్థానానికి చేరుకుని, తిరిగి అదే రోజు ప్రయాణం ప్రారంభించిన స్టేషన్‌కు శతాబ్ది రైళ్లు చేరుకుంటాయి.

 • న్యూ ఢిల్లీ-హబీబ్‌గంజ్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
 • లక్నో-న్యూ ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
 • బెంగళూరు-చెన్నై శతాబ్ది ఎక్స్‌ప్రెస్
దురంతో ఎక్స్‌ప్రెస్

దురంతో ఎక్స్‌ప్రెస్

తక్కువ స్టాపులతో దూర ప్రాంత గమ్యస్థానాలకు సేవలందించే సర్వీసులను ఇండియన్ రైల్వే నడుపుతోంది. రెండు ప్రధాన నగారలకు సేవలందించే రైళ్లను కూడా దురంతో ఎక్స్‌ప్రెస్‌లంటారు. శతాబ్ది మరియు రాజధాని రైళ్ల కన్నా ఇవి వేగవంతమైనవి.

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో అధిక ప్రాధాన్యత గల రైళ్లు

ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో వేగవంతమైన రైళ్లలో దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి.

 • పూనే-హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్
 • సీల్దా-న్యూ ఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
 • ముంబాయ్-న్యూ ఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్

సరసమైన ప్రయాణ ఛార్జీలతో దూర ప్రాంతాలకు ఏ/సి భోగీల్లో ప్రయాణం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఇండియన్ రైల్వే ఈ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ రైళ్లను ప్రారంభించింది. గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు గరిష్టంగా గంటకు 130కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో అధిక ప్రాధాన్యత గల రైళ్లు

సాధారణంగా ఇండియన్ రైల్వేలో ఉన్న అత్యంత వేగంతో ప్రయాణించే రైళ్ల వేగం కన్నా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం తక్కువగానే ఉంటుంది. అయితే తక్కువ ధరతో ఏ/సి సేవలందిచడం లక్ష్యంతో వీటిని ప్రారంభించడం జరిగింది. గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొన్ని ఉదాహరణలు...

 • పూనే-నాగ్‌పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
 • సీల్దా-రాంచీ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
 • జబల్‌పూర్-ముంబాయ్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్

డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్

ఇండియన్ రైల్వేలో డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరియు ఈ రైళ్లు అత్యంత వేగవంతమైనవి కూడా. భారతీయ రైల్వే హౌరా-దన్‌బంద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ మొదటి సూపర్ ఫాస్ట్ డబుల్ డెక్కర్ రైలు.

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో అధిక ప్రాధాన్యత గల రైళ్లు

కలకత్తాను మరియు దన్‌బాద్ ప్రాంతాలను కలిపుతూ ఈ సేవలను ప్రారంభించారు. డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు కొన్ని ఉదాహరణలు...

 • హౌరా-దన్‌బాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
 • గోవా-ముంబాయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
 • ముంబాయ్-అహ్మదాబాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్

జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్

శతాబ్ది రైళ్ల యొక్క క్రింది స్థాయి సర్వీసు జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సర్వీస్. సాధారణ ప్రజల కోసం అత్యంత సరసమైన సర్వీసులను జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా ఇండియన్ రైల్వే వీటిని ప్రారంభించింది.

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో అధిక ప్రాధాన్యత గల రైళ్లు

ఎయిర్ కండీషనింగ్(A/C) ఆప్షన్‌ భోగీలతో అత్యంత ఆదరణ పొందిన రైలు సర్వీసుల్లో ఒకటి జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సర్వీస్. వీటికి కొన్ని ఉదాహరణలు...

 • రాయ్‌ఘర్-గోండియా జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
 • న్యూ ఢిల్లీ-డెహ్రాడూన్ జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
 • పాట్నా-రాంచీ జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

భారత దేశపు సూపర్ ఫాస్ట్ రైళ్లు ఇప్పటివి కాదు, వాటిని ప్రారంభించిన కాలం నుండి అవి సూపర్ ఫాస్ట్ రైళ్లుగా చలామణి అవుతున్నాయి. వీటి గరిష్ట వేగం గంటకు 60కిలోమీటర్లుగా ఉంది. ఇండియన్ రైల్వేలో ఇలాంటి రైళ్లు 450 జతలకు పైగా ఉన్నాయి.

సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులకు ఉదాహరణ

సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులకు ఉదాహరణ

 • సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
 • మహామన ఎక్స్‌ప్రెస్
 • స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్
ఎక్స్‌ప్రెస్/మెయిల్స్ రైళ్లు

ఎక్స్‌ప్రెస్/మెయిల్స్ రైళ్లు

ఎక్స్‌ప్రెస్ లేదా మెయిల్స్ రైళ్లుగా పిలువబడే సర్వీసులు గంటకు సగటున 50కిలోమీటర్ల వేగంతో గరిష్ట స్టాపులతో ప్రయాణిస్తాయి. ఈ రైళ్లు రిజర్వ్ రహిత మరియు జనరల్ భోగీలను కలిగి ఉంటాయి. కొత్తగా చేర్చిన అంత్యోదయ రైళ్లు కూడా ఈ విభాగంలోకే వస్తాయి.

మెయిల్స్ రైళ్లకు ఉదాహరణలు

మెయిల్స్ రైళ్లకు ఉదాహరణలు

వివేక్ ఎక్స్‌ప్రెస్

కవి గురు ఎక్స్‌ప్రెస్

రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్

ఫాస్ట్ ప్యాసింజర్

ఫాస్ట్ ప్యాసింజర్

ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు ఇండియన్ రైల్వేలో సాధారణంగా సింగల్ లైన్ మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ప్రాంతీయ రైలు సర్వీసుగా బ్రాడ్ గేజ్ మరియు మీటర్ గేజ్ సింగల్ లైన్ రూట్లో సేవలందిస్తాయి వీటిని ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లంటారు.

 సబర్బన్ రైళ్లు

సబర్బన్ రైళ్లు

ప్రాధాన్యత పరంగా చివరి స్థానంలో ఉన్నప్పటికీ భారత దేశంలోని ప్రధాన నగరాలలో ప్రజారవాణాకు జీవనాడి అని చెప్పవచ్చు. నగరంలో రోజూ వారీ ప్రయాణావసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని నడుపుతుంటారు.

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో అధిక ప్రాధాన్యత గల రైళ్లు

సబర్బన్ రైళ్లు సాధారణంగా ఇండియన్ రైల్వే యొక్క లైన్లను నగరంలో ఒక చివరి నుండి మరో చివరకు అన్ని చిన్న చిన్న స్టాంపులతో సేవలందిస్తారు. వీటికి ఉదాహరణలు...

 • ముంబాయ్ సబర్బన్ రైల్వే,
 • చెన్నై సబర్బన్ రైల్వే,
 • కలకత్తా సబర్బన్ రైల్వే.
Read more on: #రైలు #rail
English summary
Read In Telugu To Know AboutTop 10 Highest Priority Trains of Indian Railways Network
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark