అత్యంత పొడవైన రన్‌‌వేలు ఉన్న 10 భారతీయ ఎయిర్‌పోర్ట్‌లు

By N Kumar

విమానాశ్రయాలలో ఉండే రన్‌వే యొక్క పొడవు సాధారణంగా విమానం యొక్క బరవు మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఎలాంటి విమానాలు అయినా ల్యాండ్ అవ్వాలి అంటే రన్‌పొడవు కనీసం 1,829 మీటర్లు పొడవు ఉండాలి. అయితే అత్యంత పొడవైన రన్‌వేలు ఉన్న విమానాశ్రయాల గురించి ఆరాతీస్తే ఢిల్లీలోని ఇంధిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యంత పొడవైన రన్‌వే కలదు. మరియు అరక్కోణంలోని నావల్ ఎయిర్ స్టేషన్‌లో ఉన్న మిలిటరీ రన్‌వే ఆసియాలోని అత్యంత పొడవైనది.

ఇండియాలో అత్యంత పొడవైన రన్‌వేను కలిగి ఉన్న పది విమానాశ్రయాలు గురించి క్రింది కథనంలో.....

10. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం

10. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం

డాక్టర్ బాబాసాహెబ్ అంర్జాతీయ విమానాశ్రయం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో కలదు. ఇక్కడ నుండి షార్ఝా మరియు దోహాకు నేరుగా సర్వీసులు ఉన్నాయి. ఇది 1460 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో ఉన్న రన్‌వే పొడవు 3,200 మీటర్లుగా ఉంది.

09. శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం

09. శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం

అమృత్‌సర్‌లో ఉన్న శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం, దీనిని రాజా సాన్సి అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా అంటారు. ఇది అమృత్‌సర్ లోని అంజాలా రోడ్డు వెంబడి కలదు. ఇందులోని రన్‌వే పొడవు 3,289 మీటర్లుగా ఉంది.

08. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం

08. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం

దేశీయంగా అత్యంత పొడవైన రన్‌వేలు ఉన్న విమానాశ్రయాలలో కొచ్చిన్ విమానాశ్రయం ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇది కేరళ రాష్ట్రంలో అత్యంత రద్దీతో కూడిన అతి పెద్ద విమానాశ్రయం. ఈ విమానాశ్రయంలో ఉన్న రన్‌వే పొడవు 3,400 మీటర్లుగా ఉంది. అంతే కాదండోయ్ ప్రపంచ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో సోలార్ ఎనర్జీతో నడుస్తున్న మొదటి విమానాశ్రయం కూడా ఇదే.

07. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం

07. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం

దేశీయంగా అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయాలలో ముంబాయ్‌లో ఉన్న ఈ ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం రెండవ స్థానంలో ఉంది. ఇందులో ఉన్న రన్‌వే పొడవు 3,445 మీటర్లుగా ఉంది. ఈ విమానాశ్రయం దేశీయంగా మరియు మధ్య ఆసియాలో ఉత్తమ ఎయిర్ పోర్ట్‌గా కూడా ఎంపికయ్యింది.

 06. సర్దార్ వల్లభ భాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం

06. సర్దార్ వల్లభ భాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం

గుజరాత్‌లో గాంధీనగర్ మరియు అహ్మదాబాద్ నగరాలకు సేవలందిస్తున్న ఈ సర్దార్ వల్లభ భాయి పటేల్ అంతర్జాతీయ విమాశ్రయంలో ఉన్న రన్ వే పొడవు 3,599 మీటర్లుగా ఉంది. దీనిని ధొలెరా అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చనున్నారు.

 05. నేతాజీ సుభాష్ చంద్రబోష్ అంతర్జాతీయ విమానాశ్రయం

05. నేతాజీ సుభాష్ చంద్రబోష్ అంతర్జాతీయ విమానాశ్రయం

కలకత్తాలో ఉన్న ఈ ఎయిర్ పోర్ట్ డమ్ డమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉండేది, అయితే తరువాత కాలంలో నేతాజీ సుభాష్ చంద్రబోష్ అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపాంతరం చెందింది. ఇండియాలో బాగా అభివృద్ది చెందిన విమానాశ్రయం పరంగా దీనికి అవార్డు కూడా వచ్చింది. ఈ విమానాశ్రయంలో ఉన్న రన్‌వే పొడవు 3,627 మీటర్లుగా ఉంది.

04. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం

04. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం

దేశీయంగా విమాన ప్రయాణికుల రద్దీ పరంగా నాలుగవ స్థానంలో ఉంది ఈ చెన్నై విమానాశ్రయం. ఇందులోని రన్‌వో పొడవు 3,658 మీటర్లుగా ఉంది.

03. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం

03. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం

దేశీయంగా అత్యంత పొడవైన రన్‌వేను కలిగి ఎయిర్ పోర్ట్‌ల జాబితాలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మూడవ స్థానంలో నిలిచింది. ఇందులోని రన్‌వే పొడవు 4,120 మీటర్లు పొడవుగా ఉంది.

 02. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

02. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

దక్షిణ భారత దేశంలో ప్రముఖ నగరాలలో భాగమైన హైదరాబాద్‌‌లోని విమానాశ్రయాన్ని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అంటారు. ఈ ఎయిర్ పోర్ట్ హైదరాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్‌లో కలదు. ఇందులో రెండు రన్‌వేలు కలవు. అందులో అత్యంత పొడవైనది 4,260 మీటర్లు పొడవు ఉంది.

01.ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

01.ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

ఢిల్లీ లో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియాలోనే అత్యంత పొడవైన రన్‌ వేలను కలిగి ఉంది. అత్యంత రద్దీగా ఉండే ఈ విమానాశ్రయంలో ఉండే రన్ వే పొడవు 4,430 మీటర్లుగా ఉంది. మరియు ఆసియాలో బాగా అభివృద్ది చెందిన విమానాశ్రయంగా కూడా గుర్తింపు పొందింది.

పొడవైన రన్‌‌వేలు ఉన్న 10 భారత విమానాశ్రయాలు

ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే పది అంతర్జాతీ విమానాశ్రయాలు గురించి....

Most Read Articles

English summary
Top Ten Longest Airport Runways In India Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X