Driving Tips మంచు రోడ్లపై డ్రైవింగ్‌ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

భారత్‌లో మంచు, శీతాకాలంలో రహదారులపై డ్రైవింగ్‌ చేయడం కొంచెం సవాల్‌తో కూడుకున్నాదే. వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో... ప్రస్తుతం పలు ప్రాంతాల్లో హిమపాతం ప్రభావం ఉంది. శీతాకాలంలో ఉత్తర భారతం, ఈశాన్య ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

కొన్నిరోజుల క్రితం, ఈ వారం తొలిభాగంలో హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురిసింది. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై జారిపోయే ప్రమాదం కారణంగా అటల్‌ టన్నెల్‌, రోహ్‌తంగ్‌, దుండి మధ్య సుమారు 500 వాహనాలు నిలిచిపోయాయి. భారీ హిమపాతం కారణంగా ఆ ప్రాంతంలో విజబిలిటి కూడా బాగా తగ్గింది.

Driving tips in snow and winter road conditions

ఇటువంటి శీతల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరియు విజబిలిటీ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో డ్రైవింగ్‌ చేయడం సవాల్‌తో కూడుకున్నది. ఇటువంటి ప్రాంతాల్లో డ్రైవింగ్‌ చేయడంలో అనుభవం ఉన్న డ్రైవర్లు కూడా ఈ పరిస్థితులు వారి నైపుణ్యానికి పరీక్ష పెట్టినట్లు చేస్తాయి. ఈ ప్రాంతాల్లో డ్రైవింగ్‌ చేసేటప్పుడు వాహనం యొక్క బ్రేకులు, స్టీరింగ్‌, యాక్సిలిరేషన్‌, గేర్లు మార్చడం వంటివి చాలా నెమ్మదిగా మరియు సజావుగా చేయాల్సి ఉంటుంది.

విండ్‌షీల్డ్‌ మరియు కిటికీలను శుభ్రంగా ఉంచాలి : ఈ ప్రాంతాల్లో కారులో బయటకు వెళ్తునప్పుడు. మంచి విజబిలిటీ కోసం విండ్‌షీల్డ్‌ మరియు అన్ని కిటికీలు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు విండ్‌షీల్డ్‌ మరియు కిటికీలపై హిమపాతం కారణంగా విజబిలిటి తగ్గుతూ వస్తుంది. ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. విండ్‌షీల్డ్‌, విండోస్‌ను కొంత సేపు కిందకు దించడం వల్ల తాజా గాలిని పీల్చుకోవడం సహా హిమపాతం నుంచి కొంత ఉపసమనం కలుగుతుంది.

Driving tips in snow and winter road conditions

డ్రైవింగ్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి: హిమపాతం మరియు మంచుతో నిండిన రోడ్లపై డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అలాగే మన పరిసర ప్రాంతాలపై అవగాహన కలిగి ఉండాలి. మరియు వాహనం ముందు కనీస దూరం ఉండేలా చూడాలి. ఈ దూరం.. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదం నుంచి బయటపడేందుకు అవకాశం ఇస్తుంది. కారు నియంత్రణ మీ చేతిలోనే ఉండేలా చూసుకోండి.

నెమ్మదిగా డ్రైవింగ్‌ చేయాలి : హిమపాతం మరియు మంచుతో కప్పబడిన రోడ్లు ఉన్న ప్రాంతాల్లో అత్యంత వేగం ప్రమాదకరం. వేగంగా వెళ్లడం కొంచెం సరదాగా అనిపించినా.. శీతల వాతావరణ పరిస్థితులు, తక్కువ విజబిలిటి, పైగా జారిపోయే స్వభావం రోడ్లు ఉన్న ప్రాంతాల్లో వేగం అత్యంత ప్రమాదకరం. అందువల్ల ఇటువంటి ప్రాంతాల్లో నెమ్మదిగా, స్థిరంగా డ్రైవింగ్‌ చేయాల్సి ఉంటుంది.

హెడ్‌లైట్లను తక్కువ కాంతిలోనే ఉంచాలి: శీతల వాతావరణం ఉన్న ప్రాంతాల్లో డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు మీ కారు హెడ్‌లైట్లు తక్కువ కాంతిలో వెలిగేలా చూసుకోండి. అయితే ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ బీమ్‌ ఉన్న లైటింగ్‌ ఉంటే బాగుంటుందని భావిస్తాం కానీ అది తప్పు. ఎక్కువ బీమ్‌ లైటింగ్‌ మంచులో రిఫ్లైక్ట్‌ అవుతాయి. ఫలితంగా మరింతగా విజిబిలిటి తగ్గుతుంది. దాంతోపాటు ఎదురుగా వచ్చే డ్రైవర్లు సైతం ఇబ్బంది పడతారు.

లైట్‌ ఇండికేటర్లు తప్పనిసరిగా వినియోగించాలి: కారు డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఎటువైపు మలుపులు తిరిగినా, ఇండికేటర్లు ఉపయోగించడం అత్యవసరం. ముఖ్యంగా ఇటువంటి శీతాకాలంలో మలుపులు తిరుగుతున్న సమయంలో కచ్చితంగా ఇండికేటర్లు వినియోగించాల్సి ఉంటుంది. తక్కువ విజబిలిటి ఉన్న సమయంలో ఇంటికేటర్లు.. ఎదురుగా లేదా వెనుకగా వస్తున్న డ్రైవర్లకు సరైన సమాచారం ఇస్తాయి.

More from DriveSpark

Article Published On: Saturday, May 13, 2023, 17:56 [IST]
English summary
Top tips while driving in snow and winter road conditions
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+