దీపావళి టపాసులు వచ్చేస్తున్నాయి.. మీ కారు సురక్షితంగా ఉండాలంటే ఇలా చేయండి
దీపావళి పండుగ వస్తే, ప్రతీ ఇంటి వద్దే ప్రత్యేక ఉత్సాహం, సందడి వాతావరణం కనిపిస్తుంది. పెద్దవారూ, చిన్నవారూ వయసు తేడా లేకుండా రంగురంగుల బాంబులు, రాత్రిపూట వెలిగే ఫైర్‌వర్క్స్ తో పండుగ ఆనందంతో మునిగిపోతారు. అయితే, ఈ ఉత్సాహంలో పొరపాటున అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా బాంబులు కాల్చుతున్న సమయంలో చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు ఎదురుకావచ్చు. దీపావళి సమయంలో వాహనాలను రక్షించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే, బాంబులు, ఫైర్‌వర్క్స్ అనుకోకుండా వాహనాలకు చేరితే మంటలు అంటి, కార్లకు, బైక్‌లకు, ఇతర వాహనాలకు భారీ నష్టం కలిగించవచ్చు. కాబట్టి దీపావళి రోజు వాహనాల యజమానులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
షెడ్ కింద పార్క్ చేయడం: దీపావళి పండుగలో వాహనాలను బయట పార్క్ చేయడం సురక్షితం కాదు. రోడ్లపైన, బయట వాహనాలను పెట్టినప్పుడు, పండుగ సందర్భంలో పేలే బాంబులు, ఫైర్‌వర్క్స్ వల్ల నిప్పురవ్వలు వాహనాలపై పడే అవకాశం ఉంటుంది. ఒక్కసారే ఆ నిప్పు వాహనంపై చేరితే, మంటలు వేగంగా వ్యాపిస్తాయి. ఈ ప్రమాదాల నుండి వాహనాలను రక్షించాలంటే, వాటిని షెడ్ కింద పార్క్ చేయడం బెస్ట్.

అగ్ని నిరోధక కవర్లను ఉపయోగించడం: దీపావళి సందర్భంలో వాహనాలను రక్షించడంలో అగ్ని నిరోధక కవర్లను ఉపయోగించడం బెస్ట్. కారు పార్క్ చేసినప్పుడు, మంచి నాణ్యమైన కవర్తో కప్పడం వలన దుమ్ము, ధూళి మాత్రమే కాకుండా, అగ్ని ప్రమాదాల వల్ల వచ్చే పొగ , చిమ్నీల నుంచి వాహనాన్ని రక్షించవచ్చు. ప్రత్యేకంగా, రోడ్ల పక్కన లేదా ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలపై బాంబులు పేలినప్పుడు వచ్చే పొగ కారును నష్టపరుస్తుంది.
ఇలాంటి సందర్భాల్లో, హై-క్వాలిటీ అగ్ని నిరోధక కవర్లు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి సాధారణ కవర్‌ల కంటే కొంచెం ఎక్కువ ఖర్చుతో లభిస్తాయనేమీ, కానీ వాహనాన్ని అన్ని వాతావరణ పరిస్థితుల నుండి రక్షిస్తాయి. ఇండోర్ పార్కింగ్ సౌకర్యం లేని వారు ఈ రకమైన కవర్లను ఉపయోగించడం ద్వారా వాహనం కేవలం భద్రతతో కాకుండా, దీర్ఘకాలంలో కారు రంగు, ఫినిష్‌ను కూడా కాపాడుతుంది.

కారు విండోలను మూసివేయడం: కారు ఇంటీరియర్‌ను పూర్తిగా రక్షించాలంటే విండోలను మూసి ఉంచటం చాలా ముఖ్యం. విండోలు ఓపెన్‌గా ఉంటే దీపావళి సమయంలో పేలే బాంబుల నిప్పురవ్వలు లేదా పొగ సులభంగా కారుని లోపల చేరవచ్చు, అది సీట్లకు, డాష్‌బోర్డ్కు నష్టం కలిగించడంతో పాటు మంటలు చెలరేగే అవకాశం ఉంది. అందుకే కారును పార్క్ చేసినప్పుడు విండోలను పూర్తిగా మూసి వేయాలి. అలాగే, సన్‌రూఫ్ ఉంటే దానిని బంద్ చేయాలి.
సిరామిక్ పూత పూయడం: దీపావళి సందర్భంగా వాహనాన్ని రక్షించడంలో సిరామిక్ పూత (Ceramic Coating) చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బాంబులు పేలినప్పుడు వచ్చే పొగ, ధూళి, చిన్న చిమ్ములు కార్ బాడీపై చేరి కలర్‌ను చెడుపరిచే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పండుగ తరువాత ఆ మర్కులు, దుమ్ము దానిని శుభ్రం చేయడం కష్టతరం.

ఇలాంటి సమస్యలను నివారించడానికి, ముందుగా వాహన యజమానులు సిరామిక్ పూత వేయించుకోవడం ఉత్తమం. ఇది కారుపై ఒక రక్షణ పొరగా పనిచేస్తుంది, దుమ్ము, ధూళి, పొగ వంటి హానికరకణాలను వాహనంపై అంటుకోకుండా రాకుండా చూసుకుంటుంది. సిరామిక్ పూత వలన పైన ఉన్న పెయింట్ నాణ్యత, కలర్, ఫినిష్ ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. కాబట్టి, దీపావళి పండుగ ముందే సిరామిక్ క్వాలిటీ పూత వేసుకోవడం బెస్ట్.
పోర్టబుల్ అగ్నిమాపక యంత్రాలు: దీపావళి సమయంలో అగ్ని ప్రమాదాల అంచనాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ సందర్భంలో ముందు సిద్ధంగా ఉండటం అత్యంత అవసరం. అందుకే పోర్టబుల్ అగ్నిమాపక యంత్రాలు దగ్గర ఉంచుకోవాలి. కేవలం ప్రమాదం జరిగాక బాధపడటం కంటే, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం సురక్షితం. వాహనాలకు అకస్మాత్తుగా మంటలు అంటితే, పోర్టబుల్ అగ్నిమాపక యంత్రాలు వెంటనే ఉపయోగించడం ద్వారా మంటలను సమయానుకూలంగా ఆర్పవచ్చు.


Click it and Unblock the Notifications








