100 మీటర్ల లోతు లోయలోపడిన బస్సు.. ప్రమాదానికి కారణం ఏంటి..?
కొండ, పర్వత ప్రాంతాల్లో ఇటీవల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది ఓ పర్యటకుల బస్సు కొండపైనుంచి దిగుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతిచెందారు. ఈ ఘటన తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్‌లో జరిగింది.
వరుస సెలవులు కావడంతో తమిళనాడులోని పలు ప్రాంతాలు పర్యటకులతో సందడిగా ఉన్నాయి. ఊటీ, కొడైకెనాల్ పర్యాటక ప్రాంతాలకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. తెంకాశి నుంచి బస్సులో నీలగిరి జిల్లాలో ఊటికి వెళ్లారు. అక్కడ పర్యటక ప్రాంతాల్లో పర్యటించిన.. తిరుగు ప్రయాణం అయ్యారు. నిన్న సాయంత్రం మరపాలెం వద్దకు వస్తుండగా మలుపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు కొండపై నుంచి 100 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది.

ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడగా... 9 మంది మరణించారు. సహాయక చర్యలతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే బస్సు ప్రమాదంపై అనేక రకాల ఉహాగానాలు వినిపిస్తున్నాయి.
బస్సు అతివేగం కారణంగా మలుపు వద్ద అదుపు చేయలేకపోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి కిందకు పడిందని కొందరు చెబుతున్నారు. అయితే కొండపై నుంచి దిగుతున్న సమయంలో బ్రేక్ డ్రమ్ వేడెక్కితుందని, ఫలితంగా డ్రైవర్ సరైన సమయంలో బ్రేకులు వేసినా.. వాహనం నియంత్రణలోకి రాలేకపోయి ఉండొచ్చని అందుకే ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు.

ఈ బస్సు ప్రమాద ఘటనపై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్, పర్యాటక శాఖ మంత్రి రామచంద్రన్ స్పందించారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వలంగా గాయపడిన వారికి 50 వేల చొప్పున ఇస్తామని, మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటన చేశారు.
తమిళనాడు ఘటనపై ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించింది. ఈ ఘటనపై తన సంతాపం వ్యక్తం చేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ.50000 చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ప్రకటన చేసింది.

బస్సు ప్రమాదంపై పోలీసులు కేసునమోదు చేశారు. ఫోరెన్సిక్ బృందంతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. అసలు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. నీలగిరి జిల్లాలో బస్సు ప్రయాణం చేసిన మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కొన్నిరోజుల్లో ప్రాథమిక నివేదిక వచ్చే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








