Live Video పర్యాటకుల కారుపైకి దూసుకొచ్చిన బండరాయి.. డ్రైవర్ అలా చేయకుంటే భారీ ప్రమాదమే..!
మూడు రోజుల క్రితం నాగాలాండ్ రాష్ట్రంలోని 29వ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడి మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. ఆ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చాలా మందిని కలచివేసింది. అయితే అటువంటి కొండచరియలు విరిగిపడిన ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా జిల్లాలో జరిగింది. పర్వానూ సిమ్లా జాతీయ రహదారిపై దాత్యార్ గ్రామ సమీపంలో కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కారు డ్రైవర్ అప్రమత్తతను మెచ్చుకుంటున్నారు.

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సహజ సుందరమైన పర్వత ప్రాంతాలు, పర్యావరణానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ రాష్ట్రానికి ఉన్న ఆదాయ మార్గాల్లో పర్యాటకం ఎంతో ముఖ్యమైనది. సంవత్సరంలో చాలా నెలలు పాటు పర్యాటకులతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలం మరింత రద్దీగా ఉంటుంది.
హిమాచల్, ఉత్తరాఖండ్ సహా మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడడం లేదా వరదలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రమాదాలు కొన్నిసార్లు భారీ ప్రమాదాలకు దారితీస్తుంటాయి. అయితే తాజాగా సిమ్లా జిల్లాలోని దాత్యార్ గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా మట్టి, రాళ్లు విరిగిపడుతూ రోడ్డు మీదకు వచ్చాయి.

ఆ సమయానికి జాతీయ రహదారిపై అధిక సంఖ్యలో కార్లు లేవు. కానీ రెండు మూడు కార్ల డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించారు. కొండచరియలు విరిగిపడడాన్ని గమనించిన హ్యుందాయ్ వెర్నా కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ముందే రోడ్డు దాటిపోయాడు. కానీ వెర్నా కారు వెనుక వచ్చిన మరో కారు డ్రైవర్ మాత్రం కొండచరియలు విరిగిపడడాన్ని గమనిస్తూ డ్రైవింగ్ చేశారు.
అదే సమయంలో ఓ పెద్ద బండ రాయి మాత్రం రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి కారు మీదకు దూసుకు వచ్చింది. కారు డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. రాయిని గమనించిన డ్రైవర్ కారును కొద్దిగా కుడి వైపునకు తిప్పారు. దాంతో ఆ రాయి కారు పైనుంచి ఎగిరి పక్కకు పడింది.
లేకుంటే నేరుగా కారును ఢీకొట్టే అవకాశం ఉండేది. డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా పెద్ద ప్రమాదం జరిగేది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంపై నెటిజన్లు కొందరు ఆందోళన వ్యక్తం చేయగా మరి కొందరు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
నాగాలాండ్‌లో జులై 4 తేదీన ఓ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కారణంగా వాహనాలు నిలిచాయి. అదే సమయంలో కొండపైనుంచి ఓ భారీ బండరాయి కార్లపైనుంచి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ కారు నుజ్జునుజ్జయింది. మరో రెండు కార్లు భారీగా ద్వంసం అయ్యాయి. ఇద్దరు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








