గుజరాత్ సంఘటన మరవకముందే.. మరో వేలాడే బ్రిడ్జిపైకి ఎక్కిన కారు: వీడియో వైరల్
రోజు మనం సోషల్ మీడియాలో కొన్ని వందల సంఖ్యలో వీడియోలను చూస్తూ ఉంటాము. ఇందులో కొన్ని ఆశ్చర్యపరిచే వీడియోలు ఉంటాయి, అయితే ఇటీవల సోషల్ మీడియాలో విడుదలైన ఒక వీడియో వారి మూర్ఖత్వాన్ని తెలియజేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా నడిచి వెళ్లే వారి కోసం ఏర్పాటు చేసిన 'వేలాడే వంతెన' (Hanging Bridge) మీద ఏకంగా కారునే డ్రైవ్ చేసాడు ఒక ప్రబుద్దుడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం సోషల్ మీడియాలో వెల్లడైన ఈ సంఘటన జరిగింది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లపుర పట్టణంలోని ప్రసిద్ధ పర్యాటక హాట్ స్పాట్ అయిన శివపురా హ్యాంగింగ్ బ్రిడ్జ్ వద్ద. నిజానికి శివపురా హ్యాంగింగ్ బ్రిడ్జ్ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కూడా. ఈ కారణంగా ప్రతి రోజు లెక్కకు మించిన పర్యాటకులు ఇక్కడికి వస్తూ.. పోతూ.. ఉంటారు.

ఈ బ్రిడ్జి మీద సాధారణంగా వాకర్స్ మరియు బైక్స్ కి మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే ఈ బ్రిడ్జి మీద ఒక వ్యక్తి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న మారుతీ సుజుకి 800 డ్రైవ్స్ చేసాడు. అయితే ఆ సమయంలో చాలామంది స్థానికులు ఆ డ్రైవర్ ని హెచ్చరించారు. అయితే బ్రిడ్జి మీద ముందుకు వెళ్లలేక అక్కడే ఇరుక్కుపోయింది.
No lessons learnt post #MorbiBridgeCollapse . Hooligans/tourists from Maharashtra were seen driving a car on a suspension bridge at Yellapura town in Uttara Kannada district of Karnataka. Finally the locals ensured that the car was driven back from the bridge in reverse gear. pic.twitter.com/RvVPOhB8CL
— Harish Upadhya (harishupadhya) November 1, 2022
ఆ సమయంలో బ్రిడ్జిపై ఇద్దరు వ్యక్తులు ఆ కారును వెనక్కి నెట్టి వెనక్కు పంపించారు. కారు వెనక్కు వెళ్లే సమయంలో బ్రిడ్జి అటు ఇటు కదలటం కూడా చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ శివపురా హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద కారు నడిపిన వ్యక్తి 'ముజాహిద్ ఆజాద్ సయ్యద్' అని తెలిసింది. ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కారుని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తులపైన కేసు నమోదు చేశామని, వీరిపైన కఠిన చర్యలు తీసుంటామని చెప్పారు.

శివపురా హ్యాంగింగ్ బ్రిడ్జి యల్లాపూర్ జిల్లాలోని సతోడ్డి నుండి శివపురా గ్రామానికి అనుసంధానించడానికి కాళీ నదిపై నిర్మించబడింది. ఈ బ్రిడ్జి నిర్మించి ఇప్పటికే 8 సంవత్సరాలు కావొస్తోంది. అయితే అప్పటినుంచి కూడా దీనికి ఎలాంటి మరమ్మత్తులు చేయలేదు. కావున దీనిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

నిజానికి పర్యాటకుల కోసం అక్కడక్కడా ఇలాంటి హ్యాంగింగ్ బ్రిడ్జిలు ఉంటాయి. అయితే వీటిపైన బరువైన కార్లు మొదలైనవి ప్రయాణించడం నిషేధం. ఎందుంకంటే ఇలాంటి బ్రిడ్జిలు కొంత బరువును మాత్రమే తట్టుకోగలిగి ఉంటాయి. అంతకు మించిన బరువు ఆ వంతెన మీద వెళ్ళినప్పుడు తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా జరిగితే ఊహకందని ప్రమాదం జరుగుతుంది.

ఇటీవల గుజరాత్‌లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం రోజున ఈ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏకంగా 130 మంచికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో ప్రైవేట్ కాంట్రాక్టర్ ఒరెవా గ్రూప్ మేనేజర్లు, టికెట్ క్లర్కులు, సెక్యూరిటీ గార్డులతో సహా తొమ్మిది మందిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ బ్రిడ్జి కూలిపోవడానికి గల కారణాలు ఏమిటి? దీనిపైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే మరిన్ని విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతదేశంలో అక్కడక్కడా ఇలాంటి వేలాడే వంతెనలు ఉన్నాయి. ఇలాంటి వంతెనలు ఆంధ్రప్రదేశ్ (రాయలసీమ) లో కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి హ్యాంగింగ్ బ్రిడ్జిల మీద వ్యతిరేక చర్యలకు పాల్పడే వార్ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








